MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • ఫ్రెండ్‌ అన్ననే ప్రేమించిన తమన్నా, అతను చెప్పిన సమాధానంతో హార్ట్ బ్రేక్‌.. మిల్కీ బ్యూటీ ఫస్ట్ క్రష్‌

ఫ్రెండ్‌ అన్ననే ప్రేమించిన తమన్నా, అతను చెప్పిన సమాధానంతో హార్ట్ బ్రేక్‌.. మిల్కీ బ్యూటీ ఫస్ట్ క్రష్‌

తమన్నా ప్రస్తుతం విజయ్‌ వర్మతో ప్రేమలో ఉంది. అయితే ఆమె స్కూల్‌ లోనే ప్రేమలో పడిందట. అ అబ్బాయి చెప్పిన సమాధానంతో గుండె పగిలినంత పనైందట.   

3 Min read
Author : Aithagoni Raju
Published : Nov 11 2024, 02:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు టాప్‌ స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. ఒకప్పుడు గ్లామర్‌ పాత్రలతో అలరించిన తమన్నా, ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు, అలాగే బోల్డ్ కంటెంట్‌ ఉన్న మూవీస్‌ చేస్తూ ఆకట్టుకుంటుంది. బోల్డ్ అండ్‌ ఇంటెన్స్ రోల్స్ తోనూ షాకిస్తుంది. సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఇలా అన్ని రకాలుగా దూసుకుపోతుంది తమన్నా. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తమన్నా ప్రస్తుతం నటుడు విజయ్‌ వర్మతో లవ్‌ లో ఉన్న విషయం తెలిసిందే. గత కొన్నాళ్లుగా ఈ ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరగుతున్నారు. పబ్లిక్‌ ఈవెంట్లలోనూ కలిసే కనిపిస్తున్నారు. తమ రిలేషన్‌ని ఓపెన్‌గానే తెలియజేస్తున్నారు. ఇద్దరూ ఒకే రంగంలో ఉండటంతో, ఇద్దరి మనసులు కలవడం, ఇద్దరూ మెచ్యూర్డ్ పర్సన్స్ కావడంతో వీరి ప్రేమకి పేరెంట్స్ నుంచి అడ్డు లేదు. అయితే ఇటీవల ఈ ఇద్దరు కలిసి కనిపించడం తగ్గింది. దీంతో విడిపోయారా? అనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తమన్నా, విజయ్‌ వర్మ రిలేషన్‌పై ఓ డౌట్‌ అయితే ఉంది. 
 

36

అయితే ఇప్పుడే కాదు ఆల్‌రెడీ రెండు సార్లు లవ్‌ బ్రేకప్‌ అయ్యిందట తమన్నాకి. గతంలో ఓ వ్యక్తితో ట్రావెల్‌ అయ్యిందట, కానీ అతను తనని అర్థం చేసుకోలేకపోవడంతో బ్రేకప్‌ చెప్పిందట. ఆ తర్వాత మరో వ్యక్తితోనూ ప్రేమలో పడింది. డేటింగ్‌ కూడా చేసింది. కానీ ఆయనతో జీవితం అంతా అబద్దంలా ఉంటుందనే భావనకు వచ్చిందట.

దీంతో ఆ రిలేషన్‌కి కూడా బ్రేకప్‌ చెప్పింది. అయితే బయటకు తెలిసిన రూమర్లుగా వినిపించేవి ఈ రెండు బ్రేకప్‌లు మాత్రమే. కానీ మరో బ్రేకప్‌ తమన్నా జీవితంలో ఉంది. స్కూలింగ్‌లోనే కావడం విశేషం. తన ఫస్ట్ క్రష్‌ వివరాలు బయటపెట్టింది తమన్నా. 
 

46

స్కూలింగ్‌ టైమ్‌లో తమన్నా తన ఫ్రెండ్‌ అన్ననే ప్రేమించిందట. చాలా రోజులు ఆయన్ని ఆరాధించిందట. ఎట్టకేలకు తన క్రష్‌ విషయాన్ని ఆయనకు చెప్పగా, అతను చెప్పిన సమాధానం విని తమన్నాకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. తన చెల్లి ఫ్రెండ్‌ తమన్నా కావడంతో అతను నిన్ను కూడా చెల్లిలానే ఫీలవుతున్నా అని చెప్పాడట. దెబ్బకి తమన్నా మతిపోయిందట. ఏంటి ? ఇలా చెప్పాడని  షాక్‌ అయ్యిందట.

ఆ తర్వాత కొన్ని రోజులు బాగా ఫీలయ్యింది. అంతేకాదు ఆయన్ని అలానే చాలా రోజు ఇష్టపడింది. ఆ తర్వాత వదిలేసిందట. అయితే తమన్నా ఏ ఏజ్‌లో ఈ ప్రేమలో పడిందో తెలిస్తే మీరూ షాక్‌ అవుతాడు. తను 5వ తరగతిలో ఉందట. అతను 8వ తరగతి చదువుతున్నాడట. ఏమీ తెలియని ఏజ్‌లో తమన్నాకి ఫ్రెండ్‌ అన్న మీదనే క్రష్‌ ఏర్పడింది. ప్రపోజ్‌ కూడా చేసింది. అతన్నుంచి రిజెక్షన్‌ కూడా ఫేస్‌ చేసింది తమన్నా. 
 

56

అయితే తాను ఇంత అందంగా ఉంటుంది. టాలెంటెడ్‌, డేరింగ్‌ కూడా. మరి ఎవరూ మీకు లవ్‌ ప్రపోజ్‌ చేయలేదా? అంటే తమన్నాకి ఎవరూ ప్రపోజ్‌ చేయలేదట. ఆ వెలితి ఇప్పటికీ ఉండిపోయిందని చెప్పింది తమన్నా. చెప్పుకోవడానికి అలాంటి మెమరీస్‌ లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేసింది.

దీంతో తనే ఇష్టపడటం స్టార్ట్ చేసిందట. అలా బ్రేకప్‌ చెప్పుకోవాల్సి వచ్చిందని చెప్పింది తమన్నా. ప్రదీప్‌ యాంకర్ గా ఉన్న `కొంచెం టచ్‌లో ఉంటే చెబుతా` టాక్‌ షోలో ఈ విషయాన్ని వెల్లడించింది తమన్నా. ఇకమోడలింగ్‌ నుంచి సినిమాల్లోకి వచ్చిన తమన్నా 2005లో `చాంద్‌ సా రోషన్‌ చెహ్ర` చిత్రంలో నటించింది. వెండితెరకు పరిచయం అయ్యింది. 
 

66

అదే ఏడాది తెలుగులో `శ్రీ` సినిమాలో మంచు మనోజ్‌ సరసన నటించి టాలీవుడ్‌కి పరిచయం అయ్యింది. `హ్యాపీడేస్‌` మూవీతో బ్రేక్‌ అందుకుని బిజీ హీరోయిన్‌ అయిపోయింది. అనతి కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ముఖ్యంగా గ్లామర్‌కి ఐకాన్‌గా నిలిచింది. గ్లామర్‌ క్వీన్‌గా ఓ ఊపు ఊపేసిన తమన్నా.. ఇటీవల సెలక్టీవ్‌గా వెళ్తుంది.

ఆ మధ్య `అరన్మణై 4`లో రచ్చ చేసింది. `స్ట్రీ2`లో స్పెషల్‌ సాంగ్‌లో దుమ్ములేపింది. సంచలనంగా ఈ పాట మారడం విశేషం. ప్రస్తుతం తమన్నా `సికండర్‌ కా కా ముఖ్‌దార్‌` చిత్రాల్లో నటిస్తుంది. తెలుగులో `ఓడెల 2`లో చేస్తుంది. శివ శక్తి పాత్రలో ఆమె కనిపించి విశ్వరూపం చూపించేందుకు రెడీ అవుతుంది. 

read more; హరికృష్ణ కూతురు పెళ్లికి వెళ్లొద్దని అడ్డుకున్న లక్ష్మీ పార్వతి, ఎన్టీఆర్‌ ఏం చేశాడో తెలిస్తే మతిపోతుంది!

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: ఆయనకి ఎన్టీఆర్ అయినా, చిరంజీవి అయినా ఒకటే..ఎదురు చూసే అలవాటు లేదు, అందుకే సినిమాలు చేయలేదు
Recommended image2
Rajamouli: తీశావులే బోడి బాహుబలి అంటూ.. రాజమౌళిని అవమానించింది ఎవరో తెలుసా? హీరో నాని చెప్పిన సీక్రెట్..
Recommended image3
Nagarjuna: హలో బ్రదర్ సినిమాలో నాగార్జున డూప్ గా నటించిన స్టార్ హీరో ఎవరో తెలుసా? ఎలా ఒప్పుకున్నాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved