అంబాని పెళ్లికి వెళ్లిన స్టార్స్ ని తాప్సీ వెటకారం? ఇలా అనేసిందేంటి?
టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు మహేష్ బాబు, రామ్‌చరణ్ కుటుంబ సమేతంగా ఈ పెళ్లిలో పాల్గొన్నారు. అలాగే విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ రజినీకాంత్, మహేంద్ర సింగ్ ధోనీ వంటి ప్రముఖులు కూడా ఈ పెళ్లిలో కనువిందు చేశారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Taapsee Pannu
తాప్సీ అందరికన్నా కాస్త డిఫరెంట్ గా వ్యవహిస్తూంటూంది. తన మనస్సులో ఏది తోస్తే అది మాట్లాడేస్తూంటుంది. అయితే అదే వివాదాల్లో చాలా సార్లు పడేస్తూంటుంది. తాజాగా ఆమె భారతదేశం అంతటా మాట్లాడుకుంటున్న అనంత్ అంబాని పెళ్ళి విషయమై కామెంట్ చేసింది. తాప్సీ ఆ పెళ్లికి వెళ్లలేదు. అయితే ఎందుకు వెళ్లలోదో ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అవి పెళ్లిన వెళ్లిన చాలా మంది స్టార్స్ కు గుచ్చుకునేలా ఉన్నాయి. ఇంతకీ ఆమె ఏమంది...
actress taapsee pannu
మనదేశ కుబేరుడు ముకేశ్ అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి ఎంతో వైభవంగా చేశారు. ఈ పెళ్లికి సుమారు ఐదువేల కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు చెప్పుకుంటన్నారు. ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటుగా అనేక మంది వీవీఐపీలు, వీఐపీలు హాజరయ్యారు.
ఈ వివాహానికి వివిధ దేశాధినేతలు, దిగ్గజ పారిశ్రామిక వేత్తలు, సినీ తారలు, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు దాదాపు అందరూ హాజరయ్యారు. కొంతమంది అతిధులకు అంబానీ ఏకంగా రూ. 2 కోట్ల ఖరీదైన వాచ్‌లను కూడా గిఫ్ట్‌గా ఇచ్చారు. అనంత్, రాధికల ఒక్కో పెళ్లి కార్డు కోసమే అంబానీ రూ. 6.5 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇవన్ని ఎప్పటికప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
ఇక ఈ పెళ్లి బారాత్ ఊరేగింపులో కేవలం సంప్రదాయ ఆచారాలకే పరిమితం కాలేదు. పలువురు సెలబ్రిటీలు డ్యాన్స్ చేశారు. అమెరికా నటుడు, రాపర్ జాన్ సెనా, సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, రణవీర్ సింగ్‌తో పాటు పెళ్లి కొడుకు అనంత్ అంబానీ కూడా డ్యాన్స్ వేశారు. ఇక కింగ్ షారుఖ్ ఖాన్ నీతా అంబానీతో కలిసి చేసిన డ్యాన్స్ ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో తాప్సీ ...ఈ పెళ్లికి వెళ్లకపోవటం కూడా మీడియాలో వచ్చింది.
తాప్సీని మీరెందుకు ఈ శతాబ్దపు భారీ వివాహంగాచెప్పబడుతున్న ఈ పెళ్లికు వెళ్లలేదు అని ప్రశ్నించారు. దానికి తాప్సీ నవ్వుతూ సమాధానం ఇచ్చింది. ఈ మెగా వెడ్డింగ్ కు వెళ్లకపోవటానికి కారణం తనకు అంబానీలు పర్శనల్ గా పరిచయం లేకపోవటమే అంది. తాను ఎవరిదైనా పెళ్లికి వెళ్లాలంటే... వివాహం జరుపుకుంటున్న ఆ కుటుంబంతో పర్శనల్ కమ్యునికేషన్ ఉంటేనే వెళ్తాను అని చెప్పుకొచ్చింది.
"నాకు వాళ్లెవరో పర్శనల్ గా తెలియదు. నేను పెళ్లిళ్లు అనేవి పూర్తి పర్శనల్ లైఫ్ కు చెందినవి గా భావిస్తాను. ఆ వివాహాలుకు చాలా మంది స్నేహితులు, బంధువులు వెళ్తూంటారు. వాళ్లందరితో ఆ కుటుంబానికి పర్శనల్ గా రిలేషన్ ఉంటుంది. అయితే అంబాని కుటుంబంలో నాకు ఎవరూ పర్శనల్ గా తెలియదు. అందుకే నేను వెళ్లలేదు. ఆ ఫ్యామిలీతో పరిచయం ఉంటే వెళ్లేదాన్ని," అంది.
ఈ స్టేట్మెంట్ చాలా మంది వివాహానికి వెళ్లిన స్టార్స్ ని డైరక్టర్ గా తాప్సీ కౌంటర్ వేసినట్లుంది అని సోషల్ మీడియాలో అంటున్నారు. పెళ్లికు వెళ్లిన స్టార్స్ లో ఎంతమందికి అంబాని కుటుంబంతో పర్శనల్ అనుబంధం ఉండి ఉంటుంది. వాళ్ళు పిలిచారు ..వీళ్లు వెళ్లి ఫొటోలు దిగి వచ్చారు అంటున్నారు. ఇది ఓ రకంగా ఆ స్టార్స్ ని వెటకారం చేసినట్లే అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే తాప్సీ కు అసలు పిలుపు రాలేదేమో అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఆ ఉక్రోషంతోనే ఆమె అలా మాట్లాడింది. అంబాని పెళ్లికు పిలిచే స్దాయి తాప్సి కు లేదు అని తేల్చేస్తున్నారు. ఏదైమైనా ఈ దెబ్బతో మరోసారి తాప్సీ వార్తల్లో నిలిచింది. ఈ కామెంట్స్ కి తాప్సీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Taapsee Pannu
జియో వరల్డ్ సెంటర్‌లో జరిగిన అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ పెళ్లి వేడుకలకు ఏపీ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు సతీమణితో కలిసి హాజరయ్యారు. చంద్రబాబు, నారా భువనేశ్వరితో పాటుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ హాజరయ్యారు. అలాగే టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు మహేష్ బాబు, రామ్‌చరణ్ కుటుంబ సమేతంగా ఈ పెళ్లిలో పాల్గొన్నారు. అలాగే విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ రజినీకాంత్, మహేంద్ర సింగ్ ధోనీ వంటి ప్రముఖులు కూడా ఈ పెళ్లిలో కనువిందు చేశారు.
సుమారు రూ.5 వేల కోట్ల ఖర్చుతో జరిగిన ఈ పెళ్లి వేడుకకు వచ్చిన వారికి అదే స్దాయిలో గిప్ట్ లు కూడా అందచేసారు. తన వివాహానికి హాజరైన తన స్నేహితులు, ఆత్మీయులకు అనంత్ అంబానీ అత్యంత ఖరీదైన వాచీలను కానుకగా అందజేసినట్లు తెలుస్తోంది. అడెమార్స్ పిగ్యుట్ బ్రాండ్‌కు చెందిన ఈ వాచీ ధర సుమారు కోటిన్నర నుంచి రూ.2 కోట్లు ఉంటుందని అంచనా. అతిథుల కోసం అంబానీ కుటుంబం వీటిని ప్రత్యేకంగా సిద్ధం చేయించినట్లు సమాచారం. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, రణ్‌వీర్ సింగ్ వంటి తారలు ఈ వాచీలతో ఫొటోలకు పోజులిచ్చారు.