రీసెంట్ గా తాప్సి పెళ్లి న్యూస్.. ఇంతలోనే ఇలా క్రేజీ ఫోటో షూట్, వైరల్
ఝుమ్మంది నాదం చిత్రంతో హీరోయిన్ గా తాప్సి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కొంతకాలం తెలుగులో వరుసగా చిత్రాలు చేసిన తాప్సి ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టింది.

ఝుమ్మంది నాదం చిత్రంతో హీరోయిన్ గా తాప్సి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కొంతకాలం తెలుగులో వరుసగా చిత్రాలు చేసిన తాప్సి ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టింది. బాలీవుడ్ లో తాప్సి ప్రస్తుతం హీరోయిన్ ఓరియెంటెడ్, కథా బలం ఉన్న చిత్రాల్లో ఎక్కువగా నటిస్తోంది.
ఇటీవల తాప్సి పెళ్లి చేసుకున్నట్లు వచ్చిన వార్తలు అందరికి షాక్ ఇచ్చాయి. ఇలాంటి హడావిడి లేకుండా అత్యంత రహస్యంగా తాప్సి పెళ్లి ఉదయ్ పూర్ లో ముగిసిందని అంటున్నారు.
తాప్సి పెళ్ళికి సంబంధించిన కొన్ని దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తాప్సి మాత్రం తన పెళ్లి గురించి నోరు విప్పడం లేదు.
చాలా కాలంగా తాప్సి.. మ్యాతీస్ అనే బ్యాట్మింటన్ ప్లేయర్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు పదేళ్ల నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. తాప్సి చాలా తక్కువ సందర్భాల్లో తన ప్రియుడు మ్యాతీస్ తో కనిపించింది.
అయితే పెళ్ళైన వెంటనే తాప్సి తాజాగా సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫొటోలతో సందడి షురూ చేసింది. ఎల్లే మ్యాగజైన్ కోసం తాప్సి ఇచ్చిన ఫోజులు తెగ వైరల్ అవుతున్నాయి.
డిఫెరెంట్ స్టైలిష్ కాస్ట్యూమ్స్ లో తాప్సి ఫోజులు ఇచ్చింది.ట్రెండీ అవుట్ ఫిట్స్ లో తాప్సి అందంగా కనిపిస్తోంది. పెళ్ళైన వెంటనే ఫోటో షూట్స్ మొదలు పెట్టిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.