- Home
- Entertainment
- karthika deepam: కార్తీక్,దీపను పొట్టన పెట్టుకున్నావు అంటూ హిమను వేదిస్తున్న స్వప్న..శౌర్యను కొట్టిన సౌందర్య!
karthika deepam: కార్తీక్,దీపను పొట్టన పెట్టుకున్నావు అంటూ హిమను వేదిస్తున్న స్వప్న..శౌర్యను కొట్టిన సౌందర్య!
karthika deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతుంది. మరీ ఈ రోజు ఏప్రిల్ 20 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చిన శౌర్య, హిమా, నిరూపమ్ (sourya, Hima) లను ఎలా వెళ్తారు అని ప్రేమ్ అడుగుతాడు. దీంతో శౌర్య వాళ్ళు ఎలా వచ్చారో అలానే వెళ్తారు అంటుంది. దాంతో అంతలేదు క్యాబ్ లో వెళ్తారు అని ఇద్దరు గొడవ పడుతారు.. దాంతో నిరూపమ్, హిమ ఆటోలో వెళ్తామ్ అంటూ ప్రేమ్ ను (prem) పంపిస్తారు.
కానీ ప్రేమ్ డ్రామా ఆడి ఆటోలోనే వెళ్తాడు.. వెళ్లే దారిలో మళ్ళీ శౌర్య, ప్రేమ్ (sourya, prem) గొడవపడుతారు. రెండు ప్రేమ జంటలు ఒకరిని ఒకరు చూసుకుంటూ తిరుగుతారు.. అతర్వాత నీ శత్రువు ఎదురు అవ్వాలంటాడు ప్రేమ్.. అప్పుడు వెంటనే ఆ టాపిక్ ఆపేయ్యాలని చెప్తుంది.. అతర్వాత డాక్టర్ సాబ్ (Jwala, nirupam) తెగ నచ్చేశావ్ అంటూ మనసులో అనుకుంటుంది.
మరోవైపు స్వప్న నిరూపమ్ క్లినిక్ లో లేడు అని చిరాకు పడుతుంది. అప్పుడు స్వప్నను (swapna) ఆమె తండ్రి తిడుతాడు. నీకు సర్దుకుపోయే మనసు ఎక్కడుంది అంటూ కామెంట్ చేస్తాడు.. అతర్వాత హిమ, నిరూపమ్ ను చూసి దారుణమైన తిట్లు తిడుతుంది. కార్తీక్, దీపను (karthik, Deepa) పొట్టన పెట్టుకున్నావు అంటూ తిట్టిపొస్తుంది.
సౌందర్య, హిమను కలిపి తిడుతుంది. అయినా నా మాట ఎవరు వింటారు అంటూ హేళన చేసి పోతుంది స్వప్న. ఇక ఆ మాటలకూ హిమ (Hima) కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. అతరువాత హిమ రూమ్ లోకి వచ్చిన సౌందర్య లైట్, ఫ్యాన్ ఆఫ్ చెయ్యడానికి అని వస్తుంది.. అక్కడ హిమ, శౌర్య (sourya, hima) ఫోటోలు చిన్నప్పుడువి ఒక వైపు, జ్వాలా, హిమ ఉన్న ఒక ఫోటో వెనుక ముందు ఉంటాయి.
చూస్తుంది ఏమో అనుకుంటే చిన్నప్పుడు ఫోటో చూసి వెళ్ళిపోతుంది. అతర్వాత సీన్ లో నిరూపమ్ తో భోజనం చెయ్యాలి అనుకుంటే తిని వచ్చా అని చెప్తాడు. ఎక్కడ తిన్నావు అని అడిగితే జ్వాలా తెచ్చిన బాక్స్ తిన్నాను అంటాడు. దీంతో స్వప్న (swapna) కోపంతో రగిలిపోతుంది. నువ్వు వంట చేసి పంపు మీ ఆయనకు అని ఆనంద్ రావు అంటాడు.
స్వప్నను నిరూపమ్ కూడా తిడుతాడు.. ఇద్దరు భోజనం చెయ్యకుండా వెళ్ళిపోతారూ (Anandh rao).. అతర్వాత రోజు ఇద్దరు కారులో వెళ్లే సమయంలో నిరూపమ్ స్వప్నను మారాలని చెప్తాడు.. అందుకు నీ పని నువ్వు చూసుకో అన్నట్టు చెప్తుంది. అతర్వాత పెళ్లి చెయ్యాలనుకుంటున్న అని చెప్తే అప్పుడే ఏంటి అని Nirupam తిడుతాడు.
అతర్వాత వారి కారు ఆగిపోతుంది.. ఆటో కోసం వెయిట్ చేస్తుంటే స్వప్న (swapna, sathya) భర్త వస్తాడు.. కార్ బ్యాట్రీ డౌన్ అయ్యిందని చెప్తే నేను మెకానిక్ ఫోన్ చేస్తా అతను తెస్తాడు.. ఇప్పుడు పోదాం అని సత్య అంటాడు.. నిరూపమ్ (Nirupam) పదా మమ్మి అంటే నేను రాను అని మళ్ళీ రచ్చ చేస్తుంది. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది. మరీ రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సి ఉంది..