- Home
- Entertainment
- Brahmamudi: రాజ్ ని తప్పుతోవ పట్టించిన స్వప్న.. జరిగిన దాని గురించి కోడల్ని నిలదీస్తున్న అపర్ణ!
Brahmamudi: రాజ్ ని తప్పుతోవ పట్టించిన స్వప్న.. జరిగిన దాని గురించి కోడల్ని నిలదీస్తున్న అపర్ణ!
Brahmamudi: స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి టిఆర్పి రేటింగ్ ని సంపాదిస్తూ టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తుంది. ఆకాశానికి నిచ్చెనలు వేస్తూ మంచి జీవితాన్ని నాశనం చేసుకున్న ఒక ఆడపిల్ల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 5 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో స్వప్న దగ్గరికి వచ్చి హోటల్ బిల్ పే చేయమంటాడు మేనేజర్. నా ఫ్రెండ్ పే చేయలేదా అంటే వాళ్ళు ఎవరో మాకు తెలియదు మీ పేరు మీద రూమ్ బుక్ అయి ఉంది మీరే బిల్ కట్టండి అంటాడు మేనేజర్. అంతలోనే రాహుల్ ఫోన్ చేస్తే బిల్ గురించి మాట్లాడుతుంది స్వప్న. ఆ విషయం పక్కన పెట్టు రాజ్ నీ ఆచూకీ తెలుసుకొని పోలీసులతో సహా వస్తున్నాడు. ముందు అక్కడ నుంచి తప్పించుకో అంటూ ఫోన్ పెట్టేస్తాడు. కింద వెయిట్ చేయండి వచ్చి బిల్ పే చేస్తాను అంటూ మేనేజర్ ని కిందకి పంపించి మొత్తం బట్టలన్నీ సర్దుకొని అక్కడినుంచి వెళ్ళిపోయి పోర్టుకోలో దాక్కుంటుంది.
అప్పుడే అక్కడికి వచ్చిన రాజ్ వాళ్లకి స్వప్న రూమ్ నెంబర్ చెప్తాడు మేనేజర్. అక్కడికి వెళ్లి చూసేసరికి అక్కడ స్వప్న కనిపించదు.కిటికీ కి చీరలు వేలాడదీసి కిందికి వదిలేస్తుంది స్వప్న. అది చూసి తను అక్కడ నుంచి పారిపోయింది అనుకొని పొరపడతారు రాజ్ వాళ్ళు. కానీ స్వప్న, రాజ్ వాళ్లని డైవర్ట్ చేయటం కోసం చీరలు మాత్రమే అలా కట్టి పక్కన పోర్టుకోలో దాక్కుంటుంది. మనం వస్తున్నట్లుగా ఎవరికీ తెలియదు అయినా ఆమె తప్పించుకుంది అంటే మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా అంటూ నసుగుతాడు ఎస్సై.
ఏంటి అని రాజ్ కోపంగా అనేసరికి అనుమానం మాత్రమే సార్ లేకపోతే ఆమెకి ఇంత ఫాస్ట్ గా ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది అంటాడు ఎస్ఐ. అప్పుడు రాజ్, కావ్యని అనుమానిస్తాడు. సిసి ఫుటేజీ చెక్ చేద్దాం అంటాడు రాజ్. మేనేజర్ తో మాట్లాడి ఆ ఏర్పాటు చేసి పని ఉండటంతో బయటికి వెళ్లిపోతాడు ఎస్సై. ఆ ఆపరేటర్ ఈరోజు ఫుటేజ్ మాత్రమే ఉంది లాస్ట్ టెన్ డేస్ ది ఎర్రర్ వల్ల పాడయింది అని చెప్పటంతో ఫ్రెస్టేట్ అవుతాడు రాజ్. కానీ ఇదంతా రాహుల్ కి అమ్ముడుపోవడం వల్ల ఆపరేటర్ చేసిన పని. బయటనుంచి చూస్తున్న కనకం వాళ్లకి స్వప్న ఏమైందో, ఎస్సై ఎందుకు బయటకు వెళ్ళిపోయాడో అర్థం కాక తలలు బద్దలు కొట్టుకుంటూ ఉంటారు.
అదే సమయానికి కావ్య కూడా ఆ హోటల్ కి వచ్చి స్వప్న గురించి ఎంక్వయిరీ చేస్తుంది. స్వప్న లేదు నాకు గుండు కొట్టి పారిపోయింది అంటూ కోపంగా చెప్తాడు మేనేజర్.అప్పుడే బయటికి వచ్చిన రాజ్, కావ్యని చూసి ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాం పద అంటూ కోపంగా మాట్లాడుతాడు. ఆమె ఎంత చెప్పినా వినిపించుకోకుండా చేయి పట్టుకొని లాక్కుని వెళ్ళిపోతాడు. ఇదంతా చూస్తున్న రాహుల్, స్వప్న ఎస్కేప్ అయిపోయినట్లుగా ఉంది తనే ఫోన్ చేస్తుంది నేను ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవడం బెటర్ అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.
కావ్య వాళ్లు వెళ్లిపోయిన తర్వాత అసలు స్వప్న ఏమైందో వెళ్లి లోపల కనుక్కుందాం రా అని మీనాక్షి తో అంటుంది కనకం. ఇంత జరిగాక కూడా ఇంకా వెళ్లి కనుక్కోవడం అవసరమా ఇంటికి వెళ్లి పోదాం పద అంటుంది మీనాక్షి. అయినా వినిపించుకోకుండా మీనాక్షిని లాక్కొని వెళ్లి స్వప్న గురించి ఎంక్వయిరీ చేస్తుంది కనకం. ఆమెకి మీరు ఏమవుతారు అని అడుగుతాడు మేనేజర్.
ఏంటా ప్రశ్న ఆవిడది పేగు బంధం నాది జన్మజన్మల బంధం అంటుంది మీనాక్షి. అయితే ఆగండి అంటూ స్వప్న బిల్ వాళ్ళ చేతిలో పెడతాడు. తను కట్టలేదా అని మీనాక్షి అడిగితే లేదు ఎస్కేప్ అయిపోయింది అంటాడు మేనేజర్. అయితే మేము కూడా ఎస్కేప్ అయిపోతాం అని మీనాక్షి అంటే పోలీసులకి పట్టిస్తాను అని చెప్పి బలవంతంగా మీనాక్షి చేత బిల్లు కట్టిస్తాడు మేనేజర్. కనకాన్ని తిట్టుకుంటుంది మీనాక్షి.
మరోవైపు కావ్య ని తీసుకొచ్చి హాల్లోకి నెట్టేస్తాడు రాజ్. ఆడపిల్లని నెట్టేస్తావా, రాక్షసుడి లాగా ప్రవర్తిస్తున్నావేంటి అంటూ మందలిస్తుంది చిట్టి. దానికి కారణం ఈమె అంటూ కావ్యని చూపిస్తాడు రాజ్. విని ప్రశాంతంగా బ్రతకనివ్వవా అంటూ మందలిస్తుంది అపర్ణ. వీళ్ళు మారరు, వీళ్ళ బుద్ధులు మారవు అంటూ చీదరించుకుంటాడు రాజ్.
వాడికి అంతా ఆవేశం ఎందుకు వచ్చింది అని అపర్ణ అడిగితే నేను కూడా మీ అబ్బాయిని అదే ప్రశ్న వేస్తున్నాను ఎందుకు అంత ఆవేశం వచ్చింది అని రాజ్ ని అడుగుతుంది కావ్య. తరువాయి భాగంలో నేను వెళ్ళకముందే వీళ్ళ అక్కకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, అక్కడినుంచి తప్పించేసింది. నేను తీసుకొస్తానని చెప్పి వెళ్లాను కదా అంతలోనే అంత త్వరగా హోటల్ కి ఎందుకు వెళ్ళింది, అసలు తప్పు చేసింది స్వప్న కాదు నువ్వు అంటూ వేలెత్తి చూపిస్తాడు రాజ్.