Brahmamudi: అసూయతో రగిలిపోతున్న స్వప్న.. అట్టర్ ఫ్లాపైన రాజ్ ప్లాన్?
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి కంటెంట్తో టాప్ రేటింగ్ ని సంపాదించుకుంటుంది. భార్యని పుట్టింటికి వెళ్ళనీయకుండా ఆపాలనుకుంటున్న ఒక భర్త కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఆగస్టు 15 ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో సీతారామయ్య తనని గమనించాలని అతనికి ఏదో ఒకటి ఇస్తూ అతని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది కావ్య. ఇది ఎందుకంత ఓవరాక్షన్ చేస్తుంది ఏదో నా కొంప ముంచేలాగా ఉంది అనుకుంటాడు రాజ్. మీకు ఏం కావాలన్నా నన్ను అడగండి ఈరోజు అంతా నేను కిచెన్ లోనే ఉంటాను అంటుంది కావ్య. అదేంటమ్మా ఈరోజు మీ ఇంటికి వెళ్లి పని చేస్తాను అన్నావు కదా అంటాడు సీతారామయ్య. అప్పుడు కావ్య ఎందుకలా ప్రవర్తిస్తుందో అర్థం చేసుకుంటాడు రాజ్.
ఆమె తెలివితేటలకి ఆశ్చర్యపోతాడు. తాతగారు ఇప్పటికైనా గుర్తించారు అనుకోని సంతోషిస్తుంది కావ్య. మీరు వెళ్ళమంటే సరిపోతుందా తాతయ్య అంటూ రాజ్ వైపు చూస్తుంది కావ్య. తను కాంటాక్ట్ క్యాన్సిల్ చేయించిన విషయం ఎక్కడ చెప్పేస్తుందో అని కంగారుపడిన రాజ్ నేనే వెళ్లొద్దన్నాను తాతయ్య అంటాడు. నేను వెళ్ళమని చెప్పాను కదా మళ్లీ ఎందుకు వద్దన్నావు అంటాడు సీతారామయ్య.
ఈ ఒక్కరోజే వెళ్లదన్నాను తాతయ్య. పర్వాలేదులే ఇప్పుడు వెళ్ళమని చెప్తాను అని చెప్పి కావ్య ఏదో మాట్లాడుతుంటే అక్కడ నుంచి లాక్కొని వెళ్ళిపోతాడు రాజ్. అది చూసి కుళ్లుకుంటుంది స్వప్న. ఇష్టం లేదు అంటూనే భార్య కోసం అన్నీ చేస్తున్నాడు అనుకుంటుంది. గదిలోకి వెళ్ళిన తర్వాత పట్టపగలే అలా చేయి పట్టుకొని నాకు వచ్చేస్తే నలుగురు ఏమనుకుంటారు నాకు అసలే సిగ్గు అంటూ భర్తని ఆట పట్టిస్తుంది కావ్య.
అంత సీన్ లేదు గాని నన్ను తాతయ్య దగ్గర ఇరికించడానికే కదా అదంతా చేసావు అంటాడు రాజ్. అలాంటిదేమీ లేదు మీరు వద్దంటే వెళ్లడం మానేస్తాను. తాతయ్య అడిగితే మీరు వద్దన్నారు అని చెప్తాను అంటుంది కావ్య. అంత సీను అక్కర్లేదు వెళ్లి స్నానం చేసిరా బయలుదేరుదాం అంటాడు రాజ్. కావ్య బాత్రూంలోకి వెళ్ళిన తరువాత బయటికి వచ్చి శ్రీనుకి ఫోన్ చేసి కాంటాక్ట్ మళ్ళీ వాళ్ళకి ఇవ్వు అని చెప్తాడు. అలాగే అని ఫోన్ పెట్టేస్తాడు కాంట్రాక్టర్ శ్రీను.
ఇదంతా వింటున్న స్వప్న కుళ్లుకుంటూ రాహుల్ దగ్గరికి వచ్చి ఆ రాజుని చూసి నేర్చుకో పెళ్ళాం ఇష్టం లేదంటూ నే పెళ్ళాం చుట్టు తిరుగుతున్నాడు ఏం కావాలంటే అది చేస్తున్నాడు నువ్వు ఉన్నావు అసలు ఇంట్లో పెళ్ళాం ఉందనే గుర్తుండదు అంటూ నాలుగు తిట్లు తిట్టేసి వెళ్ళిపోతుంది. స్వప్న ఎందుకు తిట్టిందో అర్థం కాక అయోమయం పడతాడు రాహుల్. స్వప్న మాటలు విన్న రాజ్ ఇంట్లో నన్ను అందరూ కావ్య చేతిలో కీలుబొమ్మలనుకుంటున్నారా అనుకుంటూ గదిలోకి వస్తాడు.
ఎలాగైనా తనని వెళ్లకుండా ఆపాలి ఏం చేయాలి అని ఆలోచనలో పడతాడు. మరోవైపు నాకు ఇదే నచ్చలేదు నీ పాట లేవు నువ్వు పాడు నన్ను కూడా ఎందుకు నీతో పాటు తిప్పుతావు అని కళ్యాణ్ ని మందలిస్తుంది అప్పు. నాకు మాత్రం ఈ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఫోన్ నెంబర్ పట్టుకొని ఆ ఇంటి అడ్రస్ కనుక్కోవాలి అంటాడు కళ్యాణ్. నువ్వు కనుక్కో మధ్యలో నాకేంటి బాధ అంటుంది అప్పు.
ఇదేనా స్నేహం ఇదే నా ఫ్రెండ్ షిప్ అంటూ ఎమోషనల్ డైలాగ్స్ వేస్తాడు కళ్యాణ్. ఇంతలో ఇంటి అడ్రస్ మెసేజ్ వస్తుంది కళ్యాణ్ కి. అనామిక అడ్రస్ దొరికింది అనుకొని అక్కడికి బయలుదేరుతాడు. మరోవైపు కావ్య వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అంటే కాలు జారీ మంచం మీద పడితే అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు అందుకే బాత్రూం ముందు నూనె పోయు అని అంతరాత్మ చెప్పడంతో నూనె పోసి ఎప్పుడు బాత్రూం నుంచి బయటకు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాడు రాజ్.
బాత్రూం నుంచి బయటకు వస్తూనే నూనె గమనిస్తుంది కావ్య నూనె దాటుకొని బయటికి వచ్చి మీ పప్పులు ఏమి ఉడకవు మీ నూనె ఏమి చేయలేదు అంటుంది కావ్య. అయినా నేనెందుకు అలా చేస్తాను సాక్ష్యం చూపించావు అంటాడు రాజ్. కావ్య సీక్రెట్ గా వీడియో తీసిన ఫోన్ చూపిస్తుంది. నీకు ఇంత ముందు చూపియండి అని ఆశ్చర్యంగా అడుగుతాడు.
మీరు ఇష్టం లేకుండా నన్ను మా ఇంటికి తీసుకువెళ్తాను అన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది అందుకే ఈ ఏర్పాటు చేశాను అంటుంది కావ్య. తరువాయి భాగంలో కావ్య వాళ్ళ ఇంటికి వచ్చిన రాజ్ కావ్య తో అనుకోకుండా మట్టి తొక్కుతూ ఉంటాడు. దీనిని రుద్రాణి వీడియో తీసి అపర్ణకి చూపిస్తుంది. కోపంతో రగిలిపోతుంది అపర్ణ.