Brahmamudi: చెల్లెల్ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్న స్వప్న.. కావ్య కోసం కంగారు పడుతున్న కుటుంబం!
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి టిఆర్పి రేటింగ్ ని సంపాదించుకొని టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తుంది. భర్త చూపించే ప్రేమ నిజమైన ప్రేమ కాదు అని తెలుసుకొని తల్లడిల్లిపోతున్న ఓ భార్య కథ ఈ సీరియల్. ఇక ఈరోజు అక్టోబర్ 6 ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో కూతురు కాపురం గురించి సంతోషపడుతూ ఉంటారు కృష్ణమూర్తి దంపతులు. ఇంతకుముందు నా కూతురు కాపురానికి, ఇప్పుడు నా కూతురు కాపురానికి చాలా తేడా ఉంది అంటూ బాగా ఎమోషనల్ అవుతుంది కనకం. అప్పుడు కళ్యాణ్ వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి ఇప్పుడు బాధపడే సమయం సంతోషపడే సమయం. లెట్స్ డాన్స్ అంటూ డాన్స్ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తాడు కళ్యాణ్.
జంటలు జంటలుగా వెళ్లి స్టేజ్ మీద డాన్స్ పెర్ఫార్మన్స్ ఇస్తారు. అప్పుడు స్వప్న కూడా ఆవేశంగా డాన్స్ చేస్తూ ఉంటుంది. సడన్ గా పొట్టలో పెట్టుకున్న ప్యాడ్ జారిపోతుంది. అది గమనించిన కావ్య కామ్ గా ఆ ప్యాడ్ దాచేసి స్వప్నని అక్కడ నుంచి లాక్కొని వెళ్ళిపోతుంది. ఎందుకు నేను డాన్స్ చేస్తుంటే అలా లాక్కొచ్చేసావు అని చిరాకు పడుతుంది స్వప్న. ఒకసారి నీ పొట్ట కాసి చూసుకో అంటూ కోపంగా చెప్తుంది కావ్య.
తన పొట్ట ఫ్లాట్ గా ఉండడం చూసుకొని కంగారు పడిపోతుంది స్వప్న. అప్పుడు స్వప్న కి తను దాచేసిన ప్యాడ్ తీసి ఇచ్చి నేను చూశాను కాబట్టి సరిపోయింది. ఇంట్లో వేరే ఎవరైనా చూస్తే ఏంటి నీ పరిస్థితి ఇప్పటికైనా నీకు అర్థం అవుతుందా నువ్వు ఎంత పెద్ద మోసం చేస్తున్నావో, ఇప్పటికైనా నిజం చెప్పు లేదంటే నీ మోసంలో నేను భాగం పంచుకున్నట్లు అవుతుంది అంటుంది కావ్య.
నా మోసంలో నువ్వు ఎప్పుడో భాగం అయిపోయావు. పెళ్లిలోనే నేను కడుపుతో లేనని నీకు తెలుసు. అప్పుడు నువ్వు నిజం చెప్పలేదు అంటే నా మోసంలో నువ్వు భాగమైనట్లే కదా, రేపు ఇంట్లో ఎవరికైనా నిజం తెలిస్తే నాతో పాటు నువ్వు కూడా దోషి వి అవుతావు అంటుంది స్వప్న.ఒక్క సారిగా షాక్ అవుతుంది కావ్య.అవునా అయితే నేను ఇంకా ఈ మోసంలో భాగస్వామిని కాలేను. ఇప్పుడే ఇంట్లో వాళ్ళందరికీ వెళ్లి నిజం చెప్పేస్తాను అంటుంది కావ్య.
అలా చెయ్యకు అని చెల్లెలి చెయ్యి పట్టుకొని ఆపుతుంది స్వప్న. ఏం భయంగా ఉందా, ఎన్నాళ్ళని ఈ నాటకం ఆడుతావు, ఇప్పుడే వెళ్లి నిజం చెప్పు అంటుంది కావ్య. అంటే నీ అక్క కాపురం ఏమైపోయినా నీకు నష్టం లేదా పొద్దున లేస్తే బంధాల గురించి మాట్లాడుతావు కదా ఇదేనా అంటుంది స్వప్న. బెదిరిస్తే వినటం లేదని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నావా.. ఇంటికి మరో కొత్త కోడలు వస్తుంది.
ఆమె వచ్చిన తర్వాత నిజం బయటపడితే ఇంట్లో నీకు విలువ ఉంటుందా అంటుంది కావ్య. లేదు, నాకు కొంచెం సమయం ఇవ్వు ఈలోపు నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను అంటుంది స్వప్న. మరో కొత్త నాటకం మొదలు పెడతావా అంటుంది కావ్య. కాదు పాత నాటకానికి తెరదించుతాను అంటుంది స్వప్న. ఇదే నీకు ఆఖరి అవకాశం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య.
ఇది అమ్మానాన్నల కోసమైనా నిజం చెప్పదు కానీ ఎన్నాళ్ళని ఈ కడుపు నాటకం ఎలా అయినా అబార్షన్ అయిపోయిందని చెప్పి మళ్లీ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటుంది స్వప్న. ఆ తరువాత అందరూ భోజనాల దగ్గర కూర్చుంటారు. అక్కడ కళ్యాణ్ పక్కన కూర్చుంటుంది అనామిక. ఏంటి బేబీ అప్పుడే మమ్మల్ని వదిలేసి కళ్యాణ్ పక్కన కూర్చున్నావు అంటాడు ఆమె తండ్రి. ఇప్పటినుంచే మీకు అలవాటు చేస్తుంది అని నవ్వుతుంది ధాన్యలక్ష్మి. కళ్యాణ్ ఏదో కవిత చెప్పబోతే ఇప్పుడు వద్దు రా బాబు అని రిక్వెస్ట్ చేస్తాడు రాజ్.
అందరూ అలా సరదాగా టైం స్పెండ్ చేస్తుంటే అక్కడ అప్పు కనబడదు. అప్పు ఏది అంటుంది కావ్య. బయట ఉందేమో వెళ్లి తీసుకు వస్తాను అని వెళ్తుంది కనకం. తరువాయి భాగంలో భర్త ఉత్తరం చదివి బాధపడుతూ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది కావ్య. చాలా రాత్రి అయినప్పటికీ బెడ్ రూమ్ లోకి కావ్య రాకపోవడం చూసి కంగారు పడి ఇంట్లో అందరికీ చెప్తాడు రాజ్.అప్పుడు కావ్య కోసం అందరూ కంగారుపడతారు. బ్లాంక్ గా రోడ్డు మీద నడుస్తూ ఉంటుంది కావ్య.