హీరోని నమ్ముకుంటే అంతే, అందుకే 'గుంటూరు కారం' పోయింది.. ఎస్వీ కృష్ణారెడ్డి షాకింగ్ కామెంట్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం గుంటూరు కారం సంక్రాంతికి విడుదలై థియేటర్స్ లో సందడి చేస్తోంది. మహేష్ బాబు మాస్ మ్యానరిజమ్స్ ఈ చిత్రంలో ఫ్యాన్స్ ని అలరించాయి. కానీ ఓవరాల్ గా మూవీ ఆశించిన సక్సెస్ సాధించలేదు.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం గుంటూరు కారం సంక్రాంతికి విడుదలై థియేటర్స్ లో సందడి చేస్తోంది. మహేష్ బాబు మాస్ మ్యానరిజమ్స్ ఈ చిత్రంలో ఫ్యాన్స్ ని అలరించాయి. కానీ ఓవరాల్ గా మూవీ ఆశించిన సక్సెస్ సాధించలేదు. సంక్రాంతి సీజన్ కావడం, మహేష్ క్రేజ్ తోడవడంతో వసూళ్లు ఆ మాత్రం అన్నా వచ్చాయి. లేకుంటే ఈ చిత్ర పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేదని విశ్లేషకుల అభిప్రాయం.
త్రివిక్రమ్ శ్రీనివాస్ మ్యాజిక్ ఎక్కడా కనిపించలేదు. గుంటూరు కారం చిత్రం చూస్తే త్రివిక్రమ్ ఏదో చేయబోయి ఇంకేదో చేసినట్లు ఉన్నారు అనే అనుమానం కలగక మానదు. మహేష్ బాబు, త్రివిక్రమ్ లాంటి క్రేజీ కాంబినేషన్ లో రావలసిన చిత్రం కాదు ఇది.
త్రివిక్రమ్ చిత్రంలో వినోదంతో పాటు ఎమోషన్స్ కూడా బాలంగా ఉంటాయి. కానీ గుంటూరు కారం చిత్రంలో ఎమోషన్ చాలా తక్కువ. తాజాగా ఈ చిత్రంపై ప్రముఖ ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తాజా ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
కథా బలంతో ఆయన అప్పట్లో శుభలగ్నం, మావిచిగురు, యమలీల లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టారు. కానీ బాలకృష్ణ, నాగార్జున లాంటి స్టార్ హీరోలతో ఆయన చేసిన టాప్ హీరో.. వజ్రం చిత్రాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. తాను కథని నమ్ముకున్నప్పుడు ఎప్పుడూ ఫ్లాప్ కాలేదని.. హీరోల ఇమేజ్ కి తగ్గట్లుగా సినిమా చేయాలనుకున్నప్పుడు దెబ్బైపోయానని అన్నారు.
బాలకృష్ణ ఇమేజ్ కి తగ్గట్లుగా సినిమా చేయాలని ప్రయత్నించడంతో కథ పక్కకి పోయింది. అందువల్లే టాప్ హీరో ఫ్లాప్ అయింది అని అన్నారు. రీసెంట్ గా కూడా చూడండి.. పాపం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మహేష్ బాబు ఇమేజ్ కి తగ్గట్లుగా సినిమా చేయాలని కిందా మీదా పడ్డారు. అందువల్లే గుంటూరు కారం పోయింది. కథని నమ్ముకుంటే ఎప్పుడూ పరాజయం ఉండదని ఎస్వీ కృష్ణా రెడ్డి అన్నారు.
హీరోకి తగ్గట్లుగా ఎప్పుడూ సినిమా చేయకూడదు. కథని కథలాగే తీయాలి. యమలీల చిత్రంలో నేను కథ గురించే ఆలోచించా ఇంకేమి పట్టించుకోలేదు అని ఎస్వీ కృష్ణా రెడ్డి అన్నారు.