సుశాంత్‌ను చంపేసింది అదే.. వాళ్లంతా అబద్దాల కోర్లు

First Published 15, Jun 2020, 12:52 PM

బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్యతో యావత్ సినీ పరిశ్రమ ఉలిక్కి పడింది. ఆయన మరణానికి సరైన కారణాలు తెలియకపోయినా.. ఇండస్ట్రీలోని రాజకీయాలే అందుకు కారణంమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో మరోసారి నెపోటిజం (వారసత్వం)పై విమర్శలు వెళ్లువెత్తున్నాయి.

గతంలో ఓ ఇంటర్య్వూలో మాట్లాడిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌.. `బాలీవుడ్‌ ఇండస్ట్రీలో తనను ఎవరు పార్టీలకు ఆహ్వానించర`ని చెప్పాడు. అంతేకాదు బాలీవుడ్‌ ఇండస్ట్రీ తనను ఓ ఫ్యామిలీ మెంబర్‌గా స్వీకరించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ముఖ్యంగా ఇదే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ డిప్రెషన్‌కు కారణమై ఉంటుదంని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

మరో సందర్భంలోనూ ఇదే విధంగా స్పందించాడు సుశాంత్.. సినిమాలో సుశాంత్ చనిపోయే సన్నివేశం ఉండటంతో ఓ అభిమాని తాను ఆ సినిమా చూడనని చెప్పింది. అయితే అభిమాని ట్వీట్‌పై స్పందించిన సుశాంత్.. `ఇండస్ట్రీలో నాకు ఎలాంటి గాడ్ ఫాదర్ లేడు. అబిమానులే నాకు గాడ్‌, ఫాదర్‌. మీరు నా సినిమా చూడకపోకతే నన్ను బాలీవుడ్‌ నుంచి గెంటేస్తారు` అంటూ ట్వీట్ చేశాడు. సుశాంత్ సరదాగానే రిప్లై ఇచ్చాడని అప్పట్లో భావించినా.. ఇప్పుడు అవే ట్వీట్లు చూస్తుంటే ఆ మాటల వెనుక ఎంతో పెయిన్ ఉందని అర్ధమవుతుంది.

సుశాంత్ ఆత్మహత్య నేపథ్యంలో బాలీవుడ్‌ ప్రముఖలు కూడా ఇదే అంశాలను తెర మీదకు తీసుకు వస్తున్నారు. ముఖ్యంగా నెపోటిజం (వారసత్వం)ను తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు అనుభవ్‌ సిన్హా స్పందిస్తూ బాలీవుడ్ ప్రముఖులు కూర్చొని మాట్లాడుకోవాల్సిన సమయం ఇంత కన్నా నన్ను ఎక్కువ అడగకండి అంటూ ట్వీట్ చేశాడు.

బాలీవుడ్‌ వివాదాస్పద దర్శక నిర్మాత కేఆర్‌కే కూడా ఈ విషయంపై స్పదించాడు. `ఇప్పుడు సుశాంత్ ఆత్మహత్య చేసుకోకుండా మమ్మల్ని సాయం అడగాల్సింది అని అంతా ట్వీట్  చేస్తున్నారు. వాళ్లంతా అబద్ధాల కోర్లు.. బాలీవుడ్‌లో ఎవరూ సాయం చేయరు. ఇక్కడ ఎవరి పోరాటం వారే చేయాలి` అంటూ కామెంట్ చేశాడు.

ప్రముఖ జర్నలిస్ట్ శివ అరోర్ కూడా ఈ విషయంపై స్పందించాడు. `కంగనా నే కరెక్ట్` అంటూ ట్వీట్ చేసిన ఆయన, గతంలో ఇండస్ట్రీలో నెపోటిజంపై కంగనా గళమెత్తడాన్ని గుర్తు చేశాడు.

మరో బాలీవుడ్‌ దర్శకుడు వివేక్‌ రంజన్‌ అగ్నిహోత్రి మాట్లాడుతూ.. ఈ రోజు అంతా ఉత్తుత్తి మాటలతో హడావిడి చేస్తున్నారంటూ తీవ్ర పదజాలంతో విమర్శించాడు.

మరో జర్నలిస్ట్ సప్నా భావ్నానీ మాట్లాడుతూ.. `ఇందులో దాచి పెట్టడానికి ఏం లేదు. గత కొన్నేళ్లుగా సుశాంత్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇండస్ట్రీలో ఎవరూ ఆయనకు సాయం చేయలేదు` అంటూ విమర్శించింది.

loader