ఆస్కార్ బరిలో `కంగువా`.. సూర్యకి ఎనర్జీనిచ్చే విషయం, పోటీలో ఎన్ని సినిమాలున్నాయంటే?
సూర్య హీరోగా నటించిన రీసెంట్ మూవీ `కంగువా`. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ అయ్యింది. కానీ ఇప్పుడు సూర్య కాలర్ ఎగరేసే గుడ్ న్యూస్ బయటకు వచ్చింది.
సూర్య హీరోగా నటించిన `కంగువా` మూవీకి శివ దర్శకత్వం వహించారు. దిశా పటానీ హీరోయిన్‌గా నటించింది. కరుణాస్, నట్టి నటరాజ్, రెడిన్ కింగ్స్లీ, యోగి బాబు మరియు బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు.
2024లో నవంబర్ 14న ఈ మూవీ విడుదలైంది. భారీ అంచనాలతో ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు వచ్చింది. సుమారు పదివేల థియేటర్లలో విడుదల చేశారు. టీజర్,ట్రైలర్స్ గూస్ బంమ్స్ తెప్పించేలా ఉండటంతో బిజినెస్ బాగా జరిగింది. హైప్ కూడా బాగా వచ్చింది. కానీ థియేటర్ లో ఈ మూవీకి డివైడ్ టాక్ వచ్చింది. అతిగా లౌడ్‌గా ఉందని, సోల్ లేదని, స్క్రీన్ ప్లే మ్యాజిక్ వర్కౌట్ కాలేదనే విమర్శలు వచ్చాయి. మొత్తంగా సినిమా డిజాస్టర్ గా మారింది.
కాంగువ OTT విడుదల సమీక్ష
భారీ బిజినెస్‌తో థియేటర్‌లోకి వచ్చిన ఈ మూవీకి చేదు అనుభవం ఎదురైంది. మొదటి ఆట నుంచే నెగటివ్ టాక్ వచ్చింది. కల్పిత కథ బాగున్నా, దాన్ని వెండితెరపై అంతే ఎమోషనల్‌గా, ఇంట్రెస్టింగ్‌గా తెరకెక్కించడంలో విఫలమయ్యింది టీమ్. దీంతో సూర్య పడ్డ కష్టం అంతా బూడిదలో పోలిన పన్నీరులా మారిందట. సినిమాపై బాగా ట్రోల్స్ కూడా నడిచాయి. సూర్య సైతం చాలా డిజప్పాయింట్ అయ్యారు. నిర్మాత జ్ఞానవేల్ రాజా దారుణంగా నష్టపోయారు.
`కంగువా` మూవీ 100 కోట్లకు పైగా నష్టాలను చవిచూసిందని తెలుస్తోంది. ఈ మూవీ ఫెయిల్యూర్‌తో నిరాశలో ఉన్న సూర్యకు ఇప్పుడు శుభవార్త అందింది. `కంగువా` ఆస్కార్ రేసులోకి ప్రవేశించింది. ప్రపంచవ్యాప్తంగా 323 చిత్రాలు ఉత్తమ చిత్రం కోసం పోటీ పడుతున్నాయి, వాటిలో `కంగువా` కూడా ఉంది. అభిమానులు ఈ వార్తను సోషల్ మీడియాలో జరుపుకుంటున్నారు.
read more: `డాకు మహారాజ్` థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు, బాలయ్య కెరీర్‌లోనే హైయ్యెస్ట్
also read: `OG`లో అకీరా నందన్.. మెగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే వార్త చెప్పిన అన్నయ్య