MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ముంబయ్ షిఫ్ట్ అవ్వడానికి జ్యోతికనే కారణం, అసలు విషయం చెప్పేసిన సూర్య.

ముంబయ్ షిఫ్ట్ అవ్వడానికి జ్యోతికనే కారణం, అసలు విషయం చెప్పేసిన సూర్య.

చెన్నై వదిలి ముంబయ్ షిప్ట్ అయ్యారు. సూర్య, జ్యోతిక. దాంతో ఇండస్ట్రీలో ఓ రూమర్ గట్టిగా వినిపించింది. వీరు విడాకులు తీసరకుంటున్నారని, సూర్యను కుటుంబం నుంచి జ్యోతిక దూరం చేసిందని.. ఇలా రకరకాల వార్తల  నడుమ సూర్య అసలు విషయం ఇదే అంటూ క్లారిటీ ఇచ్చాడు. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 31 2024, 04:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Suriya 45

Suriya 45

తమిళనాడుతో పాటు తెలుగులో కూడా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నహీరో సూర్య. ఆయన సినిమాలు రిలీజ్ అయ్యాయి అంటే చాలు ఎగబడి చేసే జనాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల్లో ఉన్నారు. ఇకసూర్యను తెలుగులో డైరెక్ట్ ఫిల్మ్ చేయాల్సిందిగా చాలామంది ఫ్యాన్స్ డిమాండ్ చేస్తుంటారు కూడా. ఇక చాలా గ్యాప్ తరువాత సూర్య నటించిన సినిమా కంగువ. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Actor Suriya

Actor Suriya

తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ కాబోతోంది సినిమా.  నవంబర్ 14న రిలీజ్ కు  రెడీగా ఉంది కంగువ సినిమా. ఈ సినిమా కి సంబందించిన ప్రమోషన్స్ ను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు సూర్య. అందులో భాగంగా తెలుగు వర్షన్ ప్రమోషన్స్ ను కూడా గతంలో కంటే ఎక్కువగా చేస్తున్నారు.  పాన్ ఇండియా లెవెల్ లో వస్తున్న ఈ మూవీకి ప్రమోషన్స్ తెలుగులో కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం వరుస ఇంటర్వూలు  ఇస్తూ బిజీగా ఉన్నారు సూర్య.

36
Suriya

Suriya

అయితే ఈ క్రమంలోనే సూర్యకు జ్యోతిక విషయంలో వరుసగా ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అవేంటో అందరికి తెలిసినవే. సూర్య తనభార్య పిల్లలతో కలిసి ఎందరకు ముంబయ్కు షిఫ్ట్ అయ్యాడు. మరి ఎందుకు ఇలా షిఫ్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ లో నిజం ఎంత అని ప్రశ్న సూర్యకు ఎదురయ్యింది. 

46

 గతేడాది సూర్య తన భార్య పిల్లలతో చెన్నై నుంచి ముంబైకి ఎందుకు షిఫ్ట్ అయ్యారు. ఇక ఈ విషయంపై ఆయన  క్లారిటీ ఇచ్చారు. జ్యోతిక తన కోసం ఇప్పటివరకు చాలా త్యాగం చేసిందని, తన కోసం జ్యోతిక కుటుంబాన్ని, కెరీర్ ను వదిలేసి వచ్చిందని, తన కోసం ఇన్ని త్యాగాలు చేసిన జ్యోతిక ఇప్పటికైనా తన కుటుంబంతో కలిసి ఉండాలనే చెన్నై నుండి ముంబైకి షిఫ్ట్ అయ్యామని సూర్య  తెలిపారు. 

 

56

తనకోసం కెరీర్, స్నేహితులు, తన బంద్రా లైఫ్‍స్టైల్‍ను వదులుకొని 27 ఏళ్ల క్రితం ముంబై నుంచి చెన్నైకు వచ్చేసిందని ఆయన అన్నారు. అందుకే  ముంబయ్ లో తనకిష్టమైన లైఫ్ స్టైల్ ను తనకు భహుమతిగా ఇవ్వడం కోసం తాము ముంబయ్ షిప్ట్ అయినట్టు తెలిపారు సూర్య. ఇక జ్యోతిక కూడా బాలీవుడ్ సినిమాల్లో బిజీ అవుతున్న క్రమంలో .. పిల్లల చదువులు కూడా అక్కడే కంటీన్యూ చేస్తున్నారట. 

66
Suriya

Suriya

చెన్నై నుండి ముంబైకి వెళ్ళిపోయినప్పటి నుండి జ్యోతిక తన పేరెంట్స్ తో హ్యాపీగా ఉందని, జ్యోతికకి గౌరవం, జిమ్ టైమ్ బాగా అవసరమని, తల్లిదండ్రుల నుంచి ఆమె సమయాన్ని, ఒకప్పుడు ఇష్టపడిన లైఫ్‍స్టైల్‍ను ఎందుకు దూరం చెయ్యాలని తాను ఈ నిర్ణయం తీసుకున్నానని సూర్య తెలిపారు. అయితే చెన్నై నుండి ముంబైకి షిఫ్ట్ అయిన సమయంలో విడాకులు తీసుకుంటున్నారని కొందరు.. లేదు సూర్యను తన కుటుంబం నుంచి జ్యోతికనే దూరం చేసిందని మరికొందరు.. ఇలా సోషల్ మీడియాలో రకరకాలుగా రూమర్స్ వస్తున్న క్రమంలో సూర్య ఇచ్చిన క్లారిటీ అందరిని ఆశ్చర్యపరిచింది. సూర్య క్లారిటీతో ఆ రూమర్స్ కి చెక్ పడినట్లే.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
తమిళ సినిమా
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ తెలుగు 10 నుంచి అదిరిపోయే అప్‌ డేట్‌, కంటెస్టెంట్లు వీరేనా.. సరికొత్త ట్విస్ట్ తో
Recommended image2
Priya Bapat: సాంగ్ షూట్‌లో హీరో బలవంతంగా ముద్దుపెట్టాడు.. ఆ నరకాన్ని తలచుకుని కన్నీళ్లు పెట్టుకున్న నటి
Recommended image3
OTT Movies: సూర్య, ఇంద్ర హీరోయిన్ ఎంట్రీతో ఓటీటీలో అసలైన వినోదం.. కరుప్పు, దృఢం, రాఖ్ ఇంకా మరిన్ని
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved