MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మహేష్ బాబు ఆస్తుల విలువ ఎన్ని వందల కోట్లో తెలుసా.. సినిమాల్లో కాకుండా డబ్బు ఎలా సంపాదిస్తాడంటే..

మహేష్ బాబు ఆస్తుల విలువ ఎన్ని వందల కోట్లో తెలుసా.. సినిమాల్లో కాకుండా డబ్బు ఎలా సంపాదిస్తాడంటే..

మహేష్ బాబుకి సినిమాలు మాత్రమే కాకుండా ఇతర ఆదాయ మార్గాలు కూడా ఉన్నాయి. మహేష్ బాబు ఆస్తుల విలువ, ఆదాయ మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 09 2025, 05:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మహేష్ బాబు 50వ పుట్టినరోజు 
Image Credit : Instagram/ Mahesh babu

మహేష్ బాబు 50వ పుట్టినరోజు 

సూపర్ స్టార్ మహేష్ బాబు 50వ జన్మదిన వేడుకలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మహేష్ పుట్టినరోజు సందర్భంగా అభిమానుల నుంచి, సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మహేష్ బాబు రెండు దశాబ్దాలకి పైగా టాలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ తనకంటూ సపరేట్ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మహేష్ బాబు ఆస్తులు 
Image Credit : Facebook

మహేష్ బాబు ఆస్తులు 

మహేష్ ఇప్పటివరకు 28 చిత్రాల్లో నటించారు. మహేష్ బాబు ఆస్తుల విలువ 400 కోట్ల వరకు ఉంటుందని అంచనా. మహేష్ బాబు ప్రతి చిత్రానికి 70 నుంచి 80 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటారు. రాజమౌళి చిత్రానికి మహేష్ బాబు 125 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది మహేష్ బాబు కెరీర్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్. 

35
వివిధ నగరాల్లో లగ్జరీ హౌస్ లు 
Image Credit : Facebook

వివిధ నగరాల్లో లగ్జరీ హౌస్ లు 

 మహేష్ బాబుకి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో 30 కోట్ల విలువైన లగ్జరీ హౌస్ ఉంది. అదే విధంగా గోవా, చెన్నై, బెంగళూరులో కూడా మహేష్ కి ప్రాపర్టీలు ఉన్నాయి. మహేష్ బాబుకి ప్రైవేట్ జెట్ కూడా ఉన్నట్లు సమాచారం. ఇక మహేష్ కార్పొరేట్ సంస్థలకి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఉన్నారు. 

45
బ్రాండ్ ఎండార్స్మెంట్స్ 
Image Credit : Facebook / Mahesh Babu

బ్రాండ్ ఎండార్స్మెంట్స్ 

 తాను ప్రమోట్ చేసే బ్రాండ్ ని బట్టి మహేష్ బాబు 12 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. పెరుగుతున్న రెమ్యునరేషన్ కారణంగా ప్రతి ఏడాది మహేష్ ఆస్తులు కూడా పెరుగుతున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంతో మహేష్ బాబు పాన్ ఇండియా స్థాయిలో టాప్ లీగ్ లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 

55
రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా బిజినెస్ మ్యాన్ 
Image Credit : Youtube/ Shemaroo Telugu

రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా బిజినెస్ మ్యాన్ 

మహేష్ బాబు సిల్వర్ స్క్రీన్ పైనే కాదు రియల్ లైఫ్ లో కూడా బిజినెస్ మ్యాన్ అనే చెప్పాలి. మహేష్ కి అనేక వ్యాపారాలు ఉన్నాయి. జిఎంబి పేరుతో మహేష్ బాబుకి నిర్మాణ సంస్థ కూడా ఉంది. తన బ్యానర్ లో మహేష్ బాబు మేజర్ లాంటి చిత్రాలని నిర్మించి లాభాలు పొందారు. అదే విధంగా ఎంఎబి సినిమాస్ పేరుతో మహేష్ బాబు మల్టీప్లెక్స్ థియేటర్స్ లో భాగస్వామిగా ఉన్నారు. రాజమౌళి సినిమా తర్వాత మహేష్ ఇంకా ఏ రేంజ్ కి వెళతాడో చూడాలి.  

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
మహేష్ బాబు ఘట్టమనేని
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: హౌస్ నుంచి అపూర్వ, చరణ్ ఇద్దరూ అవుట్.. షాలినికి చుక్కలు చూపించిన వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్
Recommended image2
Ramakrishna: ఖాకీ యూనిఫామ్ వేసుకోవాలనే కల, కానీ క్యాటరింగ్ యూనిఫామ్ తో జీవితం.. బిగ్ బాస్ లోకి రామకృష్ణ
Recommended image3
Swetha Naidu: సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసుకుని ఇండస్ట్రీలోకి శ్వేతా నాయుడు, బిగ్ బాస్ లోకి ఫైర్ బ్రాండ్ ఎంట్రీ
Related Stories
Recommended image1
బాలకృష్ణ, వెంకీ, నాగ్ లతో ఒక్క సినిమా కూడా చేయని స్టార్ హీరోయిన్.. చిరంజీవితో మాత్రం రెండు చిత్రాలు
Recommended image2
ఆ టైంలో ప్రెజర్ హ్యాండిల్ చేయలేకపోయిన మహేష్, మూడేళ్లపాటు కాపాడింది అదే.. అసలేం జరిగిందంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved