విరాళంగా సితార ఫస్ట్ రెమ్యూనరేషన్.. మహేష్ బాబు కూతురు అనిపించుకుంది...?
స్టార్ కిడ్ అనిపించుకుంది సితార. సూపర్ స్టార్ కూతురు అంటే ఇలా ఉంటుంది మరి అని ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకునేలా చేసింది. మహేష్ బాబులో స్టార్ డమ్ నే కాదు.. ఆయన మంచితనాన్ని కూడా పంచుకుంది స్టార్ కిడ్.

సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఆయన ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కలర్లేదు. మహేష్ తో పాటు.. ఆయన భార్య నమ్రత, కూతురు సితార కూడా స్టార్లే.. ఒక్క గౌతమ్ మాత్రం కాస్త వీటికి దూరంగా చదువుమీద దృష్టి పెట్టాడు కాని.. మహేష్ తరువాత అంతటి ఇమేజ్ ను సాధిస్తోంది మాత్రం సితారే అని చెప్పాలి.
7వ తరగతి చిదివే అమ్మాయిలో ఇంత మెచ్యూర్డ్ ఆలోచనలు ఏంటీ అనేలా బిహేవ్ చేస్తోంది సితార. మాట తీరు, మంచితనం, ఎదుటివారు ఎవరైనా సరే రిసీవ్ చేసుకునే విధానంతో అందరి మనసులు గెలిచేసింది. ఇక సోషల్ మీడియాలో ఆమె ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తండ్రిలాగే మంచి పనులు చేస్తూ.. మరో కోణం కూడా చూపించేసింది సితార.
మహేష్ బాబు కుమార్తె సితార ప్రస్తుతం మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె తన రెమ్యూనరేషన్ ను విరాళంగా ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఒక ప్రకటన ద్వారా కోటి రూపాయలను స్వచ్ఛంద సంస్థకు అందించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ తో పాటు.. ఆయనకు అన్ని భాషల్లో ఫ్యాన్స్ ఉన్నారు. కృష్ణ వారసత్వాన్ని తీసుకున్నా కూడా.. తనకంటూ సొంత ఇమేజ్ ను డెవలప్ చేసుకుని ఎదిగాడు. టాలీవుడ్ లో సూపర్ స్టార్ క్రేజ్ ను సొంతం చేసుకున్నారు మహేష్ బాబు.
మహేష్ బాబు 2005లో నటి నమ్రతను వివాహం చేసుకున్నారు మరియు వారికి కుమారుడు గౌతమ్ కాటమనేని మరియు కుమార్తె సితార కాటమనేని ఉన్నారు. సితార వయసు 12 ఏళ్లే...చిన్న వయసులోనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఆమె.. ఎంతో మంది అభిమానులను పొందింది.
సితార తాజాగా ఓ ప్రముఖ జ్యువెలరీ కంపెనీకి సంబంధించిన ప్రకటనలో నటించింది. ఈ కంపెనీన నుంచి అందుకున్న రెమ్యూనరేషన్ ను ఆమె విరాళంగా ఇచ్చేసింది. ప్రస్తుతం సూపర్ స్టార్ అభిమానులను సంతోషపెడుతున్న వార్త ఇది.
సితార ప్రస్తుతం హైదరాబాద్‌లోని CHIREC ఇంటర్నేషనల్ స్కూల్‌లో 7వ తరగతి చదువుతోంది. చదువుతో పాటు.. డాన్స్, మ్యూజిక్, సమాజ సేవా కార్యక్రమాలు ఇలా మల్టీ టాలెంట్ చూపిస్తూ.. దూసుకుపోతోంది. ఆమె హీరోయిన్ గా ఎంటర్ అయితే చూడాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.