- Home
- Entertainment
- తేలిగ్గా తీసుకున్న చిరంజీవి, నాగార్జున, రాజశేఖర్.. సూపర్ స్టార్ కృష్ణ లాస్ట్ పంచ్ కి వీళ్ళ అడ్రస్ గల్లంతు
తేలిగ్గా తీసుకున్న చిరంజీవి, నాగార్జున, రాజశేఖర్.. సూపర్ స్టార్ కృష్ణ లాస్ట్ పంచ్ కి వీళ్ళ అడ్రస్ గల్లంతు
సూపర్ స్టార్ కృష్ణ ఇచ్చిన లాస్ట్ పంచ్ కి కొన్ని సినిమాల అడ్రెస్ గల్లంతు అయింది. కృష్ణని తేలిగ్గా తీసుకోవడంతో చిరంజీవి, నాగార్జున లాంటి హీరోలకు చుక్కలు కనిపించాయి. ఆ వివరాలు ఈ కథనంలో చూద్దాం.

సూపర్ స్టార్ కృష్ణ కెరీర్
సూపర్ స్టార్ కృష్ణ 1965లో హీరోగా తన కెరీర్ ప్రారంభించారు. అప్పటి నుంచి దాదాపు 30 ఏళ్ళ పాటు కృష్ణ జైత్ర యాత్ర కొనసాగింది. 90వ దశకం ఆరంభం నుంచి కృష్ణ కెరీర్ నెమ్మదించింది. కొత్త తరం హీరోలు రావడంతో కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు లాంటి అగ్ర హీరోల హవా తగ్గుతూ వచ్చింది. 90 వ దశకంలో కృష్ణ మార్కెట్ పడిపోయింది అని టాలీవుడ్ లో అంతా మాట్లాడుకున్నారు. కృష్ణ నటించిన సినిమాలు అంతగా వర్కౌట్ కావడం లేదు.
కృష్ణని తక్కువగా అంచనా వేసిన హీరోలు
దీనితో ఆయన సినిమాలని ఇతర హీరోలు సైతం లైట్ తీసుకున్నారు. ఆ తరుణంలో కృష్ణ ఇచ్చిన లాస్ట్ పంచ్ కి మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, రాజశేఖర్ ల మైండ్ బ్లాక్ అయింది. అప్పటికే స్టార్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు లాంటి వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్నారు. ఆయన కృష్ణకి అభిమాని. ఎలాగైనా కృష్ణతో సినిమా చేయాలనేది కృష్ణారెడ్డి కోరిక. దీనితో వీరిద్దరి కాంబినేషన్ లో నెంబర్ వన్ అనే చిత్రం ఫిక్స్ అయింది. సౌందర్య హీరోయిన్.
కృష్ణకి అసలు మార్కెట్ ఉందా ?
బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, అలీ మరికొందరు నటులు నటించారు. మంచి ఫామ్ లో ఉన్న కృష్ణ రెడ్డి.. కృష్ణతో ఎందుకు సినిమా చేస్తున్నాడు.. ఇప్పుడు కృష్ణకి అసలు మార్కెట్ ఉందా ? కృష్ణ రెడ్డి చాలా రిస్క్ చేస్తున్నారు అంటూ ఇండస్ట్రీలో కామెంట్స్ చేశాయి. కానీ ఒక ఫ్యాన్ బాయ్ తన అభిమాన హీరోతో సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఎస్వీ కృష్ణారెడ్డి చూపించారు. నెంబర్ వన్ చిత్రం 1994 సంక్రాంతికి జనవరి 14 న రిలీజ్ అయింది.
నెంబర్ వన్ తో కృష్ణ లాస్ట్ పంచ్
కృష్ణ బాక్సాఫీస్ సత్తాని తేలిగ్గా తీసుకున్న చిరంజీవి, నాగార్జున, రాజశేఖర్ లాంటి హీరోలు బాగా దెబ్బ తిన్నారు. నెంబర్ వన్ కి పోటీగా చిరంజీవి ముగ్గురు మొనగాళ్లు, నాగార్జున గోవిందా గోవిందా, రాజశేఖర్ అంగరక్షకుడు లాంటి చిత్రాలు విడుదలయ్యాయి. ముగ్గురు మొనగాళ్లు చిత్రం యావరేజ్ కాగా.. గోవిందా గోవిందా, అంగరక్షకుడు చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి. కృష్ణ నెంబర్ వన్ మూవీ బ్లాక్ బస్టర్ వసూళ్లతో దూసుకుపోయింది.
ఇదే చివరి హిట్
సూపర్ స్టార్ కృష్ణకి హీరోగా ఇదే చివరి సూపర్ హిట్ అని చెప్పాలి. ఆ తర్వాత కృష్ణ కొన్ని చిత్రాల్లో హీరోగా నటించారు. అవి వర్కౌట్ కాలేదు. దీనితో కృష్ణ నెమ్మదిగా హీరోగా సినిమాలు తగ్గించి సైడ్ అయ్యారు. మొత్తానికి కృష్ణ ఇచ్చిన లాస్ట్ పంచ్ చిరంజీవి, నాగార్జున, రాజశేఖర్ లకు గట్టిగానే తగిలింది.