- Home
- Entertainment
- మాస్ సినిమాకి సుద్దపూసలా గెటప్, ఇంట్లో ఉన్న పాత బనియన్ చించేసి ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిరంజీవి
మాస్ సినిమాకి సుద్దపూసలా గెటప్, ఇంట్లో ఉన్న పాత బనియన్ చించేసి ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిరంజీవి
చిరంజీవి కెరీర్ ని మలుపు తిప్పిన ఖైదీ చిత్రంలో కాస్ట్యూమ్స్ వెనుక పెద్ద సీక్రెట్ ఉంది. తన ఇంట్లో పాత బనియన్ నే చిరంజీవి ఈ మూవీలో కాస్ట్యూమ్ గా వాడారట.

చిరంజీవి ఖైదీ మూవీ
చిరంజీవి కెరీర్ ఆరంభంలో కష్టపడుతూ, డ్యాన్సులు, నటన, ఫైట్స్ లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఆ సమయంలో ఖైదీ చిత్రం పడింది. దీనితో ఒక్కసారిగా చిరంజీవి టాలీవుడ్ లో తిరుగులేని హీరోగా మారిపోయారు. ఖైదీ చిత్రంలో చిరంజీవి ఇంటెన్స్ లుక్స్, ప్రతీకారంతో రగిలిపోతూ చేసే పోరాటం ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది.
ఖైదీ విశేషాలు
ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా మాధవి నటించింది. సుమలత కీలక పాత్రలో నటించారు. రావు గోపాలరావు విలన్. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం చిరంజీవి కెరీర్ కి టర్నింగ్ పాయింట్ కావడమే కాదు ఏకంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచి సంచలనం సృష్టించింది. ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పటి షూటింగ్ విశేషాలు పంచుకున్నారు.
సుద్దపూసలా తయారు చేశారు
సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. ఖైదీ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశాం. ముందుగా పోలీసులు అరెస్ట్ చేసే సీన్ షూటింగ్ చేశాం. నాకు ప్లేన్ షర్ట్ ఒకటి వేసి బుద్ధిమంతుడిగా, సుద్దపూసలా తయారు చేశారు. నాకు ఎక్కడో తేడా కొడుతోంది. ఖైదీ అనే టైటిల్ పెట్టాం. పైగా పోలీస్ స్టేషన్ లో మాస్ సీన్.. నాకేమో ఇలాంటి డ్రెస్ వేశారు ఏంటి, ఇది కరెక్ట్ కాదు అని అనిపించింది. వెంటనే చెన్నైలో మా ఇంటికి ఫోన్ చేశాను. నాది బ్లాక్ కలర్ పాత బనియన్ ఒకటి ఉంది.
ఇంట్లో ఉన్న పాత బనియన్ తో అదిరిపోయే గెటప్
దానిని తీసుకురమ్మని చెప్పాను. దానికి హ్యాండ్స్ కాస్త పొడవుగా ఉంటాయి. వీటిని చించివేసి సరికొత్త బనియన్ లాగా తయారు చేసి వేసుకున్నా. పైన బెల్ట్ పెట్టుకున్నా. అప్పుడు గెటప్ అదిరిపోయింది. నాకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది అని చిరంజీవి తెలిపారు. ఆ విధంగా తన కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలో చిరంజీవే డిసైడ్ చేశారు. ఫలితంగా ఖైదీ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
ఇంద్ర మూవీ కోసం షూటింగ్ ఆపేసి మరీ..
ఇలాంటి సంఘటనే ఇంద్ర మూవీలో కూడా జరిగింది అని చిరంజీవి అన్నారు. ఇంద్ర ఫస్ట్ హాఫ్ లో వారణాసిలో సాధారణ వ్యక్తిగా కనిపిస్తాను. కానీ సమస్య ఇంద్రసేనారెడ్డి పాత్రలో వచ్చింది. ఇంద్రసేనారెడ్డి అంటే ఫ్యాక్షన్ లీడర్. నార్మల్ కాస్ట్యూమ్స్ వేసుకుంటే కుదరదు. ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసుకోవాలి అనే నిర్ణయం దర్శకుడు బి గోపాల్, నిర్మాత అశ్వినీ దత్, రచయితలు పరుచూరి బ్రదర్స్ నాకే వదిలేశారు. షూటింగ్ కి నన్ను తీసుకెళ్లడానికి అశ్విని దత్ ఉదయమే ఇంటికి వచ్చారు. నేను ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసుకోవాలి అని అప్పటికి ఇంకా డిసైడ్ కాలేదు. చాలా ట్రై చేశాను కానీ కుదరడం లేదు. దీనితో ఈ రోజు షూటింగ్ ఆపేయండి అని అశ్విని దత్ కి చెప్పను. ఆయన ఓకె చెప్పి షూటింగ్ ఆపేశారు. ఆ రోజంతా ఆలోచించి వైట్ షర్ట్, వైట్ ప్యాంట్ వేసుకుని ట్రై చేశాను. అది బాగా కుదిరింది. ఇక డే ఫ్లోలో మిగిలిన షూటింగ్ మొత్తం పూర్తి చేసినట్లు చిరంజీవి తెలిపారు. ఇంద్ర చిత్రం కూడా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.