బుల్లితెరపై మరో కొత్త ట్రెండ్.. హిట్ సినిమాలకు సీక్వెల్‌గా డైలీ సీరియల్స్!
ప్రస్తుతం బుల్లితెర పై ఉన్న క్రేజ్ వెండితెరపై కూడా లేదని చెప్పాలి. కారణం ఎంటర్టైన్మెంట్ షో లు, డైలీ సీరియల్స్. నిజానికి బుల్లితెరపై ప్రతి ఒక ఛానల్స్ లో సీరియల్స్ హవానే నడుస్తోంది.

ఇప్పటికే ఎన్నో సీరియల్స్ బుల్లితెరపై ప్రసారమవుతున్నాయి. అన్ని సీరియల్స్ కథలు ఒకే లాగా అనిపించినా కూడా ప్రేక్షకులను బోర్ కొట్టనివ్వకుండా బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక సీరియల్స్ అనేది సినిమా కథ లాగా కాకుండా జనరల్ కథలతో.. ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ఉంటాయి. అంతేకాని సినిమా కథ లాగా ఏ సీరియల్స్ ఉండవు.
కానీ ఈ మధ్య కొన్ని సీరియల్స్ సినిమా స్టైల్ ను కూడా ఫాలో అవుతున్నాయి. ఇంతవరకూ సినిమా పేర్లను సీరియల్ కు టైటిల్ గా పెట్టి ఆ సినిమాకు ఉన్న కథను సీరియల్ కు సింక్ అయ్యే విధంగా పెట్టి తీసే వాళ్ళు. దాంతో సీరియల్స్ మంచి సక్సెస్ ను అందుకోవడానికి రీచ్ అవుతుంటాయి.
ఇక ఈ మధ్య సీరియల్స్ లో మరింత కొత్తదనం కనిపిస్తుంది. అది కూడా సినిమా సీక్వెల్ తో ప్రసారమవుతున్నాయి. అది కూడా ఒక టీవీ ఛానల్ మాత్రమే ఫాలో అవుతుంది. ఇంతకీ ఆ టీవీ ఛానల్ ఏదో కాదు.. ఈటీవీ. ఈ ఛానల్ సీరియల్స్ సంవత్సరాలు పాటు కొనసాగిస్తుంది.
ఇప్పటికే ఇందులో ఎన్నో సీరియల్స్ ప్రసారం అయ్యి మంచి సక్సెస్ లు అందుకున్నాయి. ఇక ఇప్పటికి మంచి కాన్సెప్ట్ లతో సీరియల్స్ ప్రసారమవుతున్నాయి. ఇక గతంలో ఈ ఛానల్ లో ఒక సినిమా సీక్వెల్ ప్రారంభం కాగా ఆ సీరియల్ గత వారమే పూర్తయింది. ఆ సీరియల్ ఏదో కాదు.. యమలీలకు ఆ తర్వాత.
నిజానికి యమలీల వెండితెరపై సూపర్ హిట్ కొట్టింది. ఈ సినిమాను ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించి మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత భాగంను సీరియల్ ద్వారా చూపించారు. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం పర్యవేక్షణలో, మూలకథ ఇవ్వడం వల్ల ఈ సీరియల్ కొనసాగింది.
ఇదిలా ఉంటే తాజాగా ఈటీవీ ఛానల్ మరో సినిమా సీక్వెల్ ను రూపొందించనున్నట్లు తెలుస్తుంది. అది కూడా మంచి హిట్ అందుకున్న సినిమా. ఇంతకు ఆ సినిమా ఏదో కాదు.. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై వచ్చిన మౌన పోరాటం. ఈ సినిమా మగాళ్ళ చేతిలో మగువలు మోసపోయిన నేపథ్యంలో ప్రసారమైంది.
ఇక ఈ సినిమా సీక్వల్ ఈటీవీలో ప్రసారం కానుందట. ఇందులో యమునా కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలిసింది. అంటే ఆ సినిమాలో జరిగిన పాత్రల ప్రవర్తన గురించి ఈ సీరియల్ కొనసాగుతుందని తెలిసింది. మరి ఈ సీరియల్ ఈ తరం ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.