- Home
- Entertainment
- Sunny Leone Emotional Post: దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం, సన్నీ లియోన్ ఎమోషనల్ పోస్ట్
Sunny Leone Emotional Post: దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం, సన్నీ లియోన్ ఎమోషనల్ పోస్ట్
బాలీవుడ్ లో హాట్ బ్యూటీస్ అంటే వినిపించే పేర్లలో సన్నీ లియోన్ పేరు కూడా ఉంటుంది. హాట్ క్వీన్ సన్నీ జివితంలో కూడా.. ఇబ్బందులు, బాధలు తప్పలేదు. వాటి గురించి రీసెంట్ గా ఓ పోస్ట్ ద్వారా వివరించింది సన్నీ.

బాలీవుడ్ లో ఫుల్ యాక్టీవ్ గా ఉండే సన్నీ లియోన్.. ఈ మధ్య సినిమాలు తగ్గించింది. ఫారెన్ లో ఉంటూ.. తాను దత్తత తీసుకున్న పిల్లల బాగోగులు చూసుకుంటూ.. లైఫ్ పార్ట్ నర్ తో దిల్ కుష్ గా ఎంజాయ్ చేస్తోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ ఈ శనివారం ఎ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తన పెళ్లినాటి ఫొటోను షేర్ చేసిన సన్నీ లియోన్ 11 ఏళ్ల క్రితం జరిగిన తన పెళ్లి తాలూకు జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంది.
సన్నీ లియోన్ ఏమన్నదంటే..ఈ రోజుతో నాకు పెళ్లై 11 ఏళ్లు. పెళ్లి టైమ్ లో చేతిలో డబ్బులు కూడా లేవు. 50 మంది కంటే తక్కువమంది అతిథుల సమక్షంలో మా మ్యారేజ్ జరిగింది. అప్పుడు ఆ పెళ్ళి హాల్ కు డబ్బులు కట్టేందుకు కూడా మా దగ్గర డబ్బులు లేవు అంది సన్నీ.
అప్పుడు వచ్చిన గెస్ట్ లు తమ చేతిలో పెట్టిన ఎన్విలాప్ కవర్లు గబగబా తీసి అందులో ఉన్న డబ్బుతో రిసెప్షన్ ఫీజులు కట్టామని చెప్పుకొచ్చింది సన్నీ లియోన్. అంతే కాదు ఆ టైమ్ లో అక్కడ ఉన్న కొందరు తాగిన మత్తులో ఏదేదో వాగారంటూ బాధపడింది సన్నీ లియోన్.
తమ జీవితం గురించి కూడా సన్నీ కొన్ని విషయాలు పంచుకుంది. ఇద్దరం కలిసి ఎంతోదూరం ప్రయాణించాము. డబ్బు సరిగ్గా లేకపోయినా.. ప్రేమతోనే అది సాధ్యమయ్యిందంటోంది సన్నీ లియోన్.
సన్నీ పెళ్లి స్టోరీ అంటే ఎంతో ఇష్టమట..ఇప్పటికే మేము ఎంతో దూరం వచ్చేశాం. హ్యాపీ యానివర్సరీ బేబీ అంటూ.. తన భర్తకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపింది సన్నీ లియోన్. అటు సన్నీలియోన్ భర్త డేనియల్ కూడా వారిద్దరి ఫొటో షేర్ చేస్తూ భార్యకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపాడు.
సన్నీ, డేనియల్ పెళ్లి జరిగి 11 ఏళ్లు అయ్యింది. 2017లో నిషా అనే ఆడపిల్లను వీళ్ళు దత్తత తీసుకున్నారు. వెంటనే తరువాత ఇయర్ లో సరోగసి ద్వారా ఆశర్, నోవా అనే కవలలకు జన్మనిచ్చారు. ఫ్యామిలీతో టూర్లు ఎంజాయ్ చేస్తూ.. హ్యాపీగా గడిపేస్తుంది సన్నీ లియోన్.