MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • అన్నా అని పిలిచినా, నమ్మకం కోల్పోయాడు.. భరణి, రీతూ, తనూజల బండారం బయటపెట్టి శ్రష్టి వర్మ

అన్నా అని పిలిచినా, నమ్మకం కోల్పోయాడు.. భరణి, రీతూ, తనూజల బండారం బయటపెట్టి శ్రష్టి వర్మ

కొరియోగ్రాఫర్‌ శ్రష్టి వర్మ మొదటి వారం బిగ్‌ బాస్‌ తెలుగు 9 హౌజ్‌ నుంచి ఎలిమినేట్‌ అయ్యింది. ఈ సందర్భంగా ఆమె భరణి, రీతూ చౌదరీ, తనూజల బండారం బయటపెట్టింది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 14 2025, 11:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బిగ్‌ బాస్‌ తెలుగు 9 ఫస్ట్‌ ఎలిమినేషన్‌ శ్రష్టి వర్మ
Image Credit : jio Hotstar

బిగ్‌ బాస్‌ తెలుగు 9 ఫస్ట్‌ ఎలిమినేషన్‌ శ్రష్టి వర్మ

బిగ్‌ బాస్ తెలుగు 9వ సీజన్‌ మొదటి వారం పూర్తయ్యింది. ఫస్ట్ వీక్‌ కొరియోగ్రాఫర్‌ శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయ్యారు. ముందు నుంచి చెప్పినట్టుగానే శ్రష్టి హౌజ్‌ని వీడారు. ఓపెనింగ్ రోజు చాలా కాన్ఫిడెంట్‌గా హౌజ్‌లోకి వచ్చిన ఆమె హౌజ్‌లో ఆ జోరు చూపించలేకపోయింది. పెద్దగా యాక్టివ్‌గా కనిపించలేదు. ఆమె కంటెంట్‌ ఇవ్వలేకపోవడంతో కెమెరాల్లో ఫోకస్‌ కాలేదు. ఆడియెన్స్ ఆమెని రిజెక్ట్ చేశారు. ఆమెకి ఓట్‌ వేయలేదు. దీంతో మొదటివారమే ఎలిమినేట్‌ కావాల్సి వచ్చింది. అయితే ఎలిమినేట్‌ అయిన సందర్బంగా ఆమె ఏమాత్రం ఫీల్‌ కాలేదు. ఏదైనా ఓకే అని చెప్పడం విశేషం. ఓపెనింగ్ రోజు త్వరగా బయటకు వచ్చి తనకు సాంగ్‌ కొరియోగ్రఫీ చేయాలని నాగ్‌ అనగా, తాను ఓకే అని చెప్పింది. అన్నట్టుగానే వారం రోజుల్లోనే బయటకు రావడం గమనార్హం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
హౌజ్‌లో వీరంతా స్వీట్‌ పర్సన్స్ః శ్రష్టి వర్మ
Image Credit : jio Hotstar

హౌజ్‌లో వీరంతా స్వీట్‌ పర్సన్స్ః శ్రష్టి వర్మ

ఇక ఎలిమినేషన్‌ సందర్భంగా శ్రష్టి వర్మ ఆసక్తికర కామెంట్స్ చేసింది. తనకు బెస్ట్, జెన్యూస్‌ పర్సన్స్ ఎవరు? ఫేక్, డబుల్‌ గేమర్‌ ఎవరు అనేది బయటపెట్టింది. ఈ క్రమంలో రాము రాథోడ్‌ లో ఫిల్టర్‌ ఉండదని, చాలా జెన్యూన్‌ పర్సన్‌ అని తెలిపింది. ఆయనతోపాటు మర్యాద మనీష్‌ చాలా స్వీట్ పర్సన్‌ అని తెలిపింది. చాలా హెల్ప్ చేస్తాడని పేర్కొంది. మరోవైపు హరిత హరీష్‌ కూడా ఎంతో జెన్యూన్‌ పర్సన్‌ అని పేర్కొంది. ఫ్లోరా సైనీది స్వీట్‌ సోల్‌ అని, ఎంతో నిజాయితీతో ఉంటారని, బాగా చూసుకుంటారు, బాగా మాట్లాడుతారని తెలిపింది శ్రష్టి వర్మ.

Related Articles

Related image1
OG Update: ఓజీ మూవీ ట్రైలర్‌ అప్‌ డేట్.. పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్ కి పండగ స్టార్ట్ అయ్యేది అప్పుడే
Related image2
సమంతని తీసేసి రష్మిక మందన్నాతో ఓపెనింగ్‌ చేశారు, ఆగిపోయిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ఏంటో తెలుసా?
35
వీరంతా డబుల్‌ గేమర్‌ః శ్రష్టి వర్మ
Image Credit : jio Hotstar

వీరంతా డబుల్‌ గేమర్‌ః శ్రష్టి వర్మ

ఇక ఫేక్‌, డబుల్ గేమర్‌ ఎవరు? కెమెరా ముందు ఒకలా, కెమెరా వెనుక మరోలా ఎవరు ఉంటారనేది వెల్లడించింది శ్రష్టి వర్మ. భరణి ఫేక్‌ పర్సన్‌ అని చెప్పింది. ఆయన్ని తాను అన్నగా భావించానని, అన్నా అనిపిలిచానని, కానీ తన నమ్మకం కోల్పోయాడని, ఒక్కసారి నమ్మకం పోతే రావడం కష్టమని, భరణి అన్న విషయంలో అదే జరిగిందని పేర్కొంది శ్రష్టి. రీతూ చౌదరీకి కూడా డబుల్‌ ఫేస్‌ ఉంటుందని, ఆమె కెమెరా ముందు ఒకలా, వెనకాల మరోలా ఉంటుందని వెల్లడించింది. తనూజ కూడా తన నమ్మకాన్ని బ్రేక్‌ చేసిందని, డబుల్ గేమర్‌ అని వెల్లడించింది శ్రష్టి.

45
`మిరాయ్` టీమ్ సందడి
Image Credit : jio Hotstar

`మిరాయ్` టీమ్ సందడి

ఇక ఆదివారం ఎపిసోడ్‌లో `మిరాయ్‌`టీమ్‌ సందడి చేసింది. హీరో తేజ సజ్జా, హీరోయిన్‌ రితికా నాయక్‌ సందడి చేశారు. తమ సినిమా సక్సెస్‌ అయిన సందర్భంగా సంతోషాన్ని వ్యక్తం చేశారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ కూడా స్టేజ్‌పైకి వచ్చిన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక తేజ, రితికాల చేత హౌజ్‌లో కంటెస్టెంట్లని కాసేపు గేమ్‌ ఆడించారు నాగార్జున. చిట్టీలో ఒకపాట పేరు ఉంటుంది. దాన్ని ఒకరు బొమ్మల రూపంలో వేస్తే, మరొకరు గెస్ట్ చేయాల్సి ఉంది. దీనికోసం హోనర్స్, టెనెంట్స్ సెపరేట్‌గా గేమ్‌ ఆడారు. ఇందులో హోనర్స్ విజయం సాధించారు.

55
హోనర్‌గా మారిపోయిన భరణి
Image Credit : jio Hotstar

హోనర్‌గా మారిపోయిన భరణి

ఇంకోవైపు టెనెంట్‌లో తొమ్మిది మంది సెలబ్రిటీల్లో ఒకరు హోనర్‌ అయ్యే అవకాశాన్ని కల్పించారు . అందుకోసం టెనెంట్స్ ని రెండు టీములుగా విడగొట్టారు. భరణి, తనూజ, శ్రష్టి వర్మ, రాము రాథోడ్‌ రెండ్‌ టీమ్‌గా, రీతూ, ఇమ్మాన్యుయెల్‌, సంజనా, సుమన్‌ శెట్టి బ్లూ టీమ్‌గా విడిపోయారు. ఫోరా సంచాలక్‌గా వ్యవహరించింది. ఇందులో మిషన్ల నుంచి వైట్‌ పేపర్స్ వస్తాయి. వాటిని తీసుకుని స్టాంప్‌ వేసి పోలింగ్ బూత్‌ తరహాలో బాక్స్‌ లో పేపర్స్ వేయాల్సి ఉంటుంది. ఇందులో రెడ్‌ టీమ్‌ ఎక్కువగా పేపర్స్ వేశారు. విజయం సాధించారు. వీరిలో ఒకరిని హోనర్స్ గా ప్రకటించాల్సి వచ్చినప్పుడు ఇతరసభ్యుల ఓటింగ్‌ ప్రకారం భరణిని ఎంపిక చేశారు. ఇక సోమవారం నుంచి ఆయన హోనర్స్ జాబితాలో చేరిపోయారు. ఆయనకు అసిస్టెంట్‌గా తనూజని ఎంపిక చేసుకోవడం విశేషం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image3
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Related Stories
Recommended image1
OG Update: ఓజీ మూవీ ట్రైలర్‌ అప్‌ డేట్.. పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్ కి పండగ స్టార్ట్ అయ్యేది అప్పుడే
Recommended image2
సమంతని తీసేసి రష్మిక మందన్నాతో ఓపెనింగ్‌ చేశారు, ఆగిపోయిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved