MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • 300 సినిమాలు చేసిన కమెడియన్, అవకాశాలు లేక బిగ్ బాస్ లోకి, సుమన్ శెట్టి గుడి కట్టి పూజించే దర్శకుడు ఎవరో తెలుసా?

300 సినిమాలు చేసిన కమెడియన్, అవకాశాలు లేక బిగ్ బాస్ లోకి, సుమన్ శెట్టి గుడి కట్టి పూజించే దర్శకుడు ఎవరో తెలుసా?

బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన సెలబ్రిటీలలో టాలీవుడ్ స్టార్ కమెడియన్ సుమన్ శెట్టి కూడా ఉన్నారు. వందల సినిమాల్లో నటించిన ఆయన, అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న టైమ్ లో బిగ్ బాస్ తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నారు.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 07 2025, 11:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Image Credit : Star Maa

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లాంచ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈసారి సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా ఇందులో అవకాశం కల్పించారు బిగ్ బాస్. అంతే కాదు డబుల్ హౌస్, డబుల్ డోస్ అంటూ ఈసారి మార్పులు మామూలుగా ఉండవని ముందు నుంచే నాగార్జున చెపుతూ వస్తున్నారు. ఈక్రమంలోనే ఒక్కొక్కరుగా సెలబ్రిటీలు, సామాన్యులు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈక్రమంలో సెలబ్రిటీ లిస్ట్ నుంచి చివరి సెలబ్రిటీగా బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టాడు టాలీవుడ్ స్టార్ కమెడియన్ సుమన్ శెట్టి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
Image Credit : Star Maa

కమెడియన్ సుమన్ శెట్టి 13వ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టాడు. అంతకు ముందు నాగార్జున తో చాలా విషయాలు మాట్లాడాడు సుమన్. తాను దాదాపు 300కి పైగా సినిమాల్లో నటించానని.. తెలుగు, తమిళం, భోజ్ పురి సహా అనేక భాషల్లో నటించానని సుమన్ శెట్టి అన్నారు. అంతే కాదు 'జయం' సినిమాతో డైరెక్టర్ తేజ తనకు ఛాన్స్ ఇచ్చారని.. ఇప్పుడు 'బిగ్ బాస్' హౌస్ తనకు సెకండ్ ఛాన్స్ ఇచ్చిందని, తన ఆట ఏంటో చూపిస్తానని అన్నారు. ఈక్రమంలో సుమన్ శెట్టి కామెడీని నాగార్జున గుర్తు చేశారు. అంతే కాదు సమన్ శెట్టి బాగా ఫేమస్ అయిన '7/G బృందావన కాలనీ' సినిమాలోని డైలాగ్స్ చెప్పమని అడిగి మరీ చెప్పించుకుని నాగార్జున ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా నాగార్జునతో కలిసి నటించిన 'శివమణి' సినిమా షూటింగ్ విశేషాలను కూడా వారు గుర్తు చేసుకున్నారు.

Related Articles

Related image1
భరణితో ఒక ఆట ఆడుకున్న బిగ్ బాస్, హౌస్ లోకి రాకముందే ఎలిమినేషన్, ట్విస్ట్ ఏంటంటే?
Related image2
Bigg Boss Telugu 9: నా తలరాత నేనే రాసుకున్నాను, నాగార్జున ముందు టాలెంట్ చూపించిన ఇమ్మ్యాన్యూయల్
33
Image Credit : Star Maa

ఇక జయం సినిమా తరువాత డైరెక్టర్ తేజ సలహా మేరకు ఇల్లు కట్టుకున్నా సుమన్ శెట్టి తన ఇంట్లో డైరెక్టర్ తేజ కోసం ఓ రూమ్ కట్టాడట. అందులో తేజ ఫోటో మాత్రమే ఉంటుంది. దానిని ఓ గుడిలాగా భావిస్తాడట. రోజ క్లీన్ చేసి ఉంచుతాడట సుమన్ శెట్టి. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సినిమా ఆఫర్లు తగ్గిన సుమన్ శెట్టికి బిగ్ బాస్ రూపంలో బంపరాఫర్ వచ్చింది. బిగ్ బాస్ షోలో సత్తా చాటి మళ్లీ కమెడియన్ గా టాలీవుడ్ లో బిజీ అవుదామన్న ఆశతో ఉన్నాడు సుమన్ శెట్టి. మరి ఈ ఆఫర్ సుమన్ శెట్టికి ఎంత వరకూ ఉపయోగపడుతందో చూడాలి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బిగ్ బాస్ తెలుగు
అక్కినేని నాగార్జున
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Sreeleela: అందానికే అసూయ పుట్టించేలా మహేష్ బాబు హీరోయిన్ లేటెస్ట్ లుక్! రాధలా మారిన శ్రీలీల..
Recommended image2
Nayanthara: 14 కోట్లు వసూలు చేసిన నయనతార, లేడీ సూపర్ స్టార్ హాయ్ సినిమాకు రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసా?
Recommended image3
Samantha: తల్లి కాబోతున్న వేళ ఈశా యోగా సెంటర్‌లో సమంత.. 'ఈ ప్రయాణం ముగియదు' అంటూ పోస్ట్
Related Stories
Recommended image1
భరణితో ఒక ఆట ఆడుకున్న బిగ్ బాస్, హౌస్ లోకి రాకముందే ఎలిమినేషన్, ట్విస్ట్ ఏంటంటే?
Recommended image2
Bigg Boss Telugu 9: నా తలరాత నేనే రాసుకున్నాను, నాగార్జున ముందు టాలెంట్ చూపించిన ఇమ్మ్యాన్యూయల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved