- Home
- Entertainment
- Bigg Boss Telugu 9: నా తలరాత నేనే రాసుకున్నాను, నాగార్జున ముందు టాలెంట్ చూపించిన ఇమ్మ్యాన్యూయల్
Bigg Boss Telugu 9: నా తలరాత నేనే రాసుకున్నాను, నాగార్జున ముందు టాలెంట్ చూపించిన ఇమ్మ్యాన్యూయల్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో వెరైటీ ఎంట్రీ ఇచ్చాడు జబర్థస్త్ స్టార్ కమెడియన్ ఇమ్మ్యాన్యూయల్, . వచ్చీ రావడంతో నవ్వుల్లో ముంచెత్తాడు. నాగార్జున ముందు తన టాలెంట్ ను బయటపెట్టేశాడు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ గా లాంఛ్ అయ్యింది. డబుల్ హౌస్, సిలబస్ అంటూ బిగ్ బస్ ను మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చేశారు. ఇక ఈ హౌస్ లో డిఫరెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు జబర్ధస్త్ స్టార్ కమెడియన్ ఇమ్మ్యాన్యూయల్. పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్, గ్యాప్ లేకుండా పంచులు.. తన ఎమోషన్స్ తోనే నవ్వుల్లో ముంచెత్తే ట్యాలెంట్ ఉన్నఇమ్మ్యాన్యూయల్, ఎలాంటి బ్యాక గ్రౌండ్ లేకుండా ఈ రంగంలోకి అడుగు పెట్టి, తన ట్యాలెంట్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అందంగా లేవని అవమానాలు ఎదురైనా, బాడీ షేమింగ్ కామెంట్స్ తో వేధించినా దానినే పాజిటివ్ గా మల్చుకున్నాడు. తన యాక్టింగ్ తో బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తున్నాడు.
బిగ్ బాస్ లోకి నాలుగో కంటెస్టెంట్ గా అడుగు పెట్టాడు ఇమ్మ్యాన్యూయల్. వచ్చీ రావడంతో తన డిఫరెంట్ ఏవీతో ఆకట్టుకున్నాడు. ఏవీలో ఇమ్మ్యాన్యూయల్ పంచ్ లతో నాగార్జున కూడా గట్టిగానే నవ్వుకున్నాడు. ఇక నాగార్జున ముందు లేడీ వాయిస్ తో పాట పాడి ఆశ్చర్చపరిచిన ఇమ్మ్యాన్యూయల్, ఆతరువాత మిమిక్రీతో ఆకట్టుకున్నాడు. చిరంజీవి, విజయ్ దేవరకొండ వాయిస్ లను ఇమిటేట్ చేసి అందరిని ఆకట్టుకున్నాడు. అంతే కాదు హౌస్ లో తనకు దమ్ము శ్రీజ, హరీష్ లు కాంపిటేషన్ గా ఫీల్ అవుతున్నట్టు ఇమ్మ్యాన్యూయల్ వెల్లడించాడు.
గుంటూరుకు చెందిన ఇమ్మాన్యుయేల్ పల్లెటూరిల పనిలేక ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. అందరితో మాటలు పడ్డ తరువాత ఏదో ఒకటి సాధించాలన్న కసితో కేవలం 500తో హైదరాబాద్ సిటీకి వచ్చి ఆడిషన్స్‌లో పాల్గోన్నాడు. ఎన్ని పన్రనయత్నాలు చెసినా అవకాశాలు రాలేదు. దాంతో తన తలరాత ఎవరు మార్చరు, తన రాత తానేమార్చుకోవాలి అని డిసైడ్ అయ్యాడు ఇమ్మ్యాన్యూయల్. వరుసగా కాన్సెప్ట్ లు రాయం స్టార్ట్ చేశాడు. మొదట పటాస్ షోలో ఛాన్స్ దక్కించుకున్న ఇమ్మూ ఆ తర్వాత జబర్దస్త్ లోకి అడుగు పెట్టాడు. లేడీ కమెడియన్ వర్షతో కలిసి పలు స్కిట్స్ చేసి ఆడియెన్స్ ను నవ్వుల్లో ముంచెత్తాడు. ప్రస్తుతం పలు టీవీ షోల్లో సందడి చేస్తూనే సినిమాల్లోనూ మెరుస్తున్నాడు ఇమ్మాన్యుయేల్. విరూపాక్ష లో ఓ కీలక పాత్ర పోషించిన అతను గ్రామ వాలంటీర్ అనే ఓ కామెడీ వెబ్ సిరీస్ లోనూ యాక్ట్ చేశాడు . ఈ క్రేజ్ కారణంగానే బిగ్ బాస్ టీమ్ ఇమ్మాన్యుయేల్ ను హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్టైన్మెంట్ ఎలా ఉండబోతోందో చూడాలి మరి.