సుల్తాన్ ప్రీమియర్ షో రివ్యూ.. కార్తీ హిట్ కొట్టాడంటున్నారు
హీరో కార్తికేయ రష్మిక మందాన జంటగా దర్శకుడు భాగ్యరాజ్ కన్నన్ తెరకెక్కించిన చిత్రం సుల్తాన్. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సుల్తాన్ మూవీ నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావడం జరిగింది. తెలుగు మరియు తమిళ బాషలలో విడుదలైన సుల్తాన్ ప్రీమియర్స్ షో టాక్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం....
16

సుల్తాన్ మూవీ కథ విషయానికి అందమైన తన గ్రామాన్ని చేజిక్కించుకోవడానికి వచ్చిన రౌడీ మూకలపై ఆ గ్రామానికి చెందిన ఓ యువకుడు చేసే పోరాటమే సుల్తాన్ మూవీ. బలమైన ఆ ప్రత్యర్థులను ఒంటరిగా ఆ యువకుడు ఎలా ఎదుర్కొన్నాడు. చివరికి ఆ దుర్మార్గులను నుండి తన గ్రామాన్ని, కుటుంబాన్ని, ప్రజలను ఎలా కాపాడుకున్నాడు అనేది సినిమా కథ

26
సుల్తాన్ మూవీ పక్కా మాస్ కమర్షియల్ అంశాలతో దర్శకుడు తెరకెక్కించాడు. ఫైట్స్, సాంగ్స్, ఎమోషన్స్, కామెడీ వంటి కమర్షియల్ అంశాలు కలగలిసిన అవుట్ అండ్ అవుట్ మాస్ మసాలా ఎంటర్టైనర్ గా సుల్తాన్ ని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కార్తిపై తెరకెక్కిన పోరాట సన్నివేశాలు మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి.

36
ఇక హీరో కార్తి నటన సుల్తాన్ మూవీకి కలిసొచ్చే అంశం. కామెడీ, ఎమోషన్స్ మరియు మాస్ సన్నివేశాలలో కార్తీ తన మార్కు నటనతో ఆకట్టుకున్నారు. ఇక స్టార్ హీరోయిన్ రష్మిక మందాన డెబ్యూ తమిళ్ సుల్తాన్. పల్లెటూరి అమ్మాయిగా సరికొత్త రశ్మికను సుల్తాన్ మూవీలో చూడవచ్చు. ఆమె గత చిత్రాలకు భిన్నంగా సుల్తాన్ మూవీలో పాత్ర ఉంది. కార్తీ, రష్మికల కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది.

46
ఇక కీలక రోల్స్ చేసిన మళయాళ నటుడు లాల్ సినిమాకు మంచి సప్పోర్ట్ ఇచ్చారు. నెపోలియన్, యోగిబాబు, సతీష్, హరీష్ తమ నటనతో మెప్పించారు.

56
కామెడీ, ఎమోషన్స్ మరియు మాస్ సన్నివేశాలు తెరకెక్కించడంలో దర్శకుడు చాలా వరకు సక్సెస్ అయ్యాడు. అయితే కథలో ఎటువంటి కొత్తదనం లేదు. గతంలో మనం చూసిన అనేక మాస్ కమర్షియల్ సినిమాల సమాహారంగా సుల్తాన్ ఉంటుంది. వివేక్-మెర్విన్ అందించిన సాంగ్స్ పర్వాలేదు. యువన్ శంకర్ రాజా బీజీఎమ్ ఆకట్టుకుంది.

66
సుల్తాన్ మూవీ చాలా వరకు పాజిటివ్ టాక్ అందుకుంటుంది. సుల్తాన్ లోని మాస్ కమర్షియల్ అంశాలు ప్రేక్షకులు బాగానే నచ్చినట్లు తెలుస్తుంది. ప్రీమియర్స్ టాక్ బాగానే ఉన్న నేపథ్యంలో సుల్తాన్ మంచి ఓపెనింగ్స్ అందుకునే అవకాశం కలదు. ఖైదీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కార్తీ... సుల్తాన్ తో ఏ మేర విజయం అందుకుంటాడో తెలియాలంటే మరికొంత సమయం వేచివుండాలి.

Latest Videos