MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సుకుమార్ సెంటిమెంట్, పుష్ప2 కూడా ఆయనకు చూపించాడట.

సుకుమార్ సెంటిమెంట్, పుష్ప2 కూడా ఆయనకు చూపించాడట.

టాలీవుడ్ లెక్కల మాస్టారు సుకుమార్.. పుష్ప2 తో రిలీజ్ కు రెడీ అవుతున్నాడు. అయితే ఆయనకు ఈ సినిమా విషయంలో ఓ సెంటిమెంట్ ఉందట. ఆ సెంటిమెంట్ ను కూడా తీర్చుకున్నాడట. ఇంతకీ ఏంటా సెంటిమెంట్..? 

2 Min read
Mahesh Jujjuri
Published : Oct 25 2024, 05:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

హీరోలకు స్పెషల్ ఇమేజ్ ఇవ్వడంలో స్టార్ డైరెక్టర్ సుకుమార్ తరువాతనే ఎవరైనా.. పూరీలాంటి దర్శకులు ఈ కోవలోకే వస్తారు కాని సుకుమార్ ది మాత్రం డిఫరెంట్ స్టైల్. ఆయన సినిమాల్లో హీరోలలో విలన్ షేడ్స్ గట్టిగా కనిపిస్తుంటాయి. ఈక్రమంలోనే గ్లామర్ ఇండస్ట్రీ అయిన టాలీవుడ్ లో హీరోలను డీగ్లామర్ రోల్ లో చూపించి.. హిట్లు కొట్టించిన డైరెక్టర్లలో సుకుమార్ ఒకరు. 

25
Allu Arjun, #Pushpa2, sukumar

Allu Arjun, #Pushpa2, sukumar

ఒక రకంగా వీరివల్లే మన హీరోలకు పాన్ ఇండియా ఇమేజ్ పెరుగుతందని చెప్పవచ్చు. మరి ఇలాంటి దర్శకుడికి సెంటిమెంట్ ఉంది అంటే ఎవరైన నమ్ముతారా. కాని సుకుమార్ మాత్రం పుష్ప సినిమా  విషయంలో సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడట. ఇంతకీ ఆసెంటిమెంట్ ఏంటో తెలుసా..? పుష్ప2తో సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు సుకుమార్. అల్లు అర్జున్ ను ఈసినిమాతో పాన్ వరల్డ్ కు తీసుకెళ్లాలని ప్లాన్ చేశాడు. 

తెలుగు రాష్ట్రాలతో పాటు మలయాళంలో మాత్రమే స్టార్ హీరోగా ఉన్న బన్నీని పాన్ఇండియా హీరోగా చేసింది పుష్ప సినిమా. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాలలో అల్లు అర్జున్ కు భారీగా ఇమేజ్ ను తెచ్చిపెట్టింది సినిమా. పుష్పరాజ్ గా బన్నీ నార్త్ లో దూసుకుపోయాడు. అయితే పుష్ప2 కూడా వీరు అనుకున్నట్టుగా హిట్ అయ్యి 1000 కోట్లు దాటి కలెక్షన్లు సాధిస్తే.. నార్త్ లో తిరుగులేని హీరోగా అల్లు అర్జున్ పాగా వేయడం ఖాయం. 
 

35

అయితే సుకుమార్ పుష్ప సినిమా చేసే టైమ్ లో దర్శకధీరుడు రాజమౌళి సెట్స్ కు వచ్చాడట. అప్పుడు ఈసినిమా రష్ ఫీడ్ ను ఆయనకు చూపించాడట సుక్కు. ఇక ఏసినిమా జాతకంఅయినా అలవోకగా చెప్పగల రాజమౌళి.. ఈసినిమా పక్కా హిట్ అవుతుందని.. నార్త్ లో ఈసినిమాకు ఆదరణ బాగా ఉంటుంది అని చెప్పాడట. 

దాంతో ఆయన చెప్పినట్టే జరిగింది. ఇక ఇది సుకుమార్ కు సెంటిమెంట్ గా మారింది. అందుకే పుష్ప2  ను కూడా రీసెంట్ గా రాజమౌళికి చూపించాడట సుక్కు. రాజమౌళికి బాగా నచ్చినట్టు తెలుస్తుంది. ఆయన చాలా మంచి ఫీడ్ బ్యాక్ ఇచ్చారట. ఆ సెంటిమెంట్ తోనే పుష్ప 2 రషెస్ జక్కన్న చూపించినట్టున్నాడు సుక్కూ. 
 

45

పుష్ప 2 పై నార్త్ లో భారీ హైప్ ఉంది. నిజానికి  ఆగస్టు 15న  పుష్ప 2 రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అనుకున్న టైంకి షూటింగ్ కంప్లీట్ అవ్వకపోవడం వల్ల డిసెంబర్ 6 కి వాయిదా వేశారు. ఈ విషయంలో సుకుమార్ మీద బన్నీ కోప్పడి అలిగారని కూడా వార్తలు వచ్చాయి. నిర్మాతలు మళ్ళీ బుజ్జగించి సముదాయించారట. 

55

ఇక ఆతరువాత  ఫాస్ట్ గా షూటింగ్ కంప్లీట్ అవ్వడంతో ఒకరోజు ముందుగానే అంటే డిసెంబర్ 5 నే ఈ సినిమాను రిలీజ్  చేస్తున్నారు. అంటే డిసెంబర్ 4 న ప్రీమియర్స్ తోనే ప్రపంచ వ్యాప్తంగా  పుష్ప 2 హడావిడి మొదలవబోతోంది.  పుష్ప2 షూటింగ్ కంప్లీట్ కావస్తోంది. పాచ్ వర్క్ తో పాటు.. మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్ కూడా జరుగుతుందట. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Recommended image2
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌
Recommended image3
Divvala Madhuri అసలు రూపం బయటపెట్టిన రీతూ చౌదరీ తల్లి.. అన్‌ ఫెయిర్‌ ఎలిమినేషన్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved