MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Sukumar: బాలీవుడ్ నుంచి సుకుమార్ కు పిలుపు.. 100 కోట్ల హీరోతో సుక్కు సినిమా..?

Sukumar: బాలీవుడ్ నుంచి సుకుమార్ కు పిలుపు.. 100 కోట్ల హీరోతో సుక్కు సినిమా..?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) కు బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. ఇలా పుష్ప హిట్టు పడిందో లేదో.. అలా సుకుమార్  టాలెంట్ వారికి అర్ధం అయిపోయింది. దాంతో స్టార్ హీరో నుంచి సుక్కు కు పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 15 2022, 11:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సుకుమార్(Sukumar)  కు టాలీవుడ్ లో జీనియస్ డైరెక్టర్ గా మంచి పేరు ఉంది. అందరు దర్శకుల్లా.. హీరోలలో హీరోయిజం మాత్రమే కాకుండా.. నెగెటీవ్ షేడ్స్ చూడా చూపిస్తారు సుకుమార్. టాలీవుడ్ లో చాలా మంది హీరోలకు సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన సుకుమార్ పై ఇప్పుడు బాలీవుడ్ కన్ను పడినట్టు తెలుస్తోంది.

26

సుకుమార్(Sukumar)  కు ఎప్పుడో  బాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చినట్టు ఓ సందర్భంలో చెప్పారాయన. ఆ మధ్య సినిమా షూటింగ్ లో ఉండగా.. బాలీవుడం స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) ఫోన్ చేశారని.  సినిమా ఆఫర్ చేశారన్నారు. ముంబయ్ రా నీతో సినిమా చేయాలి అని.. అక్షయ్ చెప్పారట.. అయితే మంచి స్క్రిప్ట్.. టైమ్ తో పాటు.. అన్నీ సెట్ అయితే సినిమా త్వరలోనే సెట్ అవుతుందన్నారు సుకుమార్.

36

సుకుమార్(Sukumar)  కూడా ఫస్ట్ టైమ్ పుష్పాతో పాన్ ఇండియాకు వెళ్ళాడు. అయితే ముందు నుంచి సుకుమార్ సినిమాను పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అయ్యి ఉంటే.. ఎప్పుడో బాలీవుడ్ గుమ్మం తొక్కి ఉండే వాడు సుకుమార్. లేట్ అయినా.. మంచి టైమ్ లో బాలీవుడ్ చేరుతున్నారు సుక్కు. పుష్ప బాలీవుడ్ లో కూడా 70 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. దాంతో సుకుమార్ వైపు బాలీవుడ్ కన్ను పడింది. ఇక పుష్ప సినిమా చూసి.. అక్షయ్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

46

అయితే అక్షయ్ కుమార్(Akshay Kumar)  100 కోట్ల హీరో.. ఆయనతో సినిమా అంటే అది భారీ బడ్జెట్ సినిమా అయ్యి ఉండాలి. వందల కోట్ల బడ్జెట్ ఉంటేనే అది సాధ్యం. మరి వీరి కలయికలో అంత భారీ బడ్జెట్ ఎవరు పెట్టబోతున్నారు. టాలీవుడ్ నుంచి నిర్మాత జాయిన్ అవుతారా..? లేక అక్షయ్ కుమార్ పార్ట్నర్స్ తో కలిసి ఈ సినిమా నిర్మిస్తారా అనేది చూడాలి.

56

అల్లు అర్జున్ కు ఆర్య,ఆర్య2 తరువాత పుష్ప పార్ట్ 1 తో సూపర్ సక్కెస్ ఇచ్చాడు సుకుమార్(Sukumar). వీరిద్దరి కాంబో హ్మాట్రిక్ హిట్ కొట్టింది. ఇప్పుడు బాలీవుడ్ లో అక్షయ్ లాంటి హీరోను డైరెక్ట్ చేయబోతున్నాడు. సుకుమార్ సినిమాలో హీరో ఎంత మాస్ గా ఉంటాడో తెలిసిందే.. మరి అక్షయ్(Akshay Kumar)  ను ఎలాంటి పాత్రలో చూపిస్తాడో చూడాలి.

66

మరో వైపు సుకుమార్(Sukumar)  కు ఇఫ్పుడు  టాలీవుడ్ లో విజయ్ దేవరకొండతో సినిమా చేయాల్సి ఉంది. అటు పుష్పా పార్ట్ 2 మూవీ కూడా కంప్లీట్ చేయాలి. ఈకరోనా పాండమిక్ టైమ్ లో ఈ సినిమాలు కంప్లీట్ అయ్యే సరికే.. ఎంత టైమ్ పడుతుందో తెలియదు, మరి అక్షయ్ (Akshay Kumar) సినిమాకు ఎప్పుడు టైమ్ కేటాయిస్తాడో సుకుమార్ చూడాలి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
బాలీవుడ్
Latest Videos
Recommended Stories
Recommended image1
Divi Vadthya: పుష్ప 2 కోసం నేను పడ్డ కష్టం అంతా ఇంతా కాదు, మూవీ చూశాక ఎందుకు ఒప్పుకున్నానా అని ఆవేదన చెందా
Recommended image2
నేషనల్ అవార్డు వెనక్కి తీసుకోవాలి అంటూ చిరంజీవి సినిమాపై కుట్ర.. ఆ మూవీ ఏంటి ? అసలేం జరిగింది ?
Recommended image3
Virosh Honeymoon: థాయ్‌లాండ్‌లో విజయ్‌ రష్మిక హనీమూన్‌.. సీక్రెట్‌ ఫోటో లీక్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved