కాపీ వివాదంలో ‘పుష్ప’, రైటర్ ఫేస్ బుక్ పోస్ట్ వైరల్
భారీ సినిమాలకు క్రేజ్ తో పాటు ,కాపీ వివాదాలు ప్రక్కనే ఉంటున్నాయి. కొన్నైతే రిలీజ్ తర్వాత కాపీ వివాదాలు మొదలైతే, మరికొన్ని ప్రారంభం నుంచి వివాదాలును ఎదుర్కొంటున్నాయి. తాజాగా అల్లు అర్జున్ ప్రతిష్టాత్మక చిత్రం `పుష్స` విషయంలో ఈ కాపీ వివాదం మరికాస్త ముందుగానే మొదలైంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న సినిమా ‘పుష్ఫ’ కథ నాదే.. అంటూ ఓ రచయిత ఇప్పుడు గళం విప్పి ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టారు. ఇప్పుడా పోస్ట్ వైరల్ అవుతోంది. ఇంతకీ ఎవరా రచయిత..ఏమిటా వివాదం చూద్దాం...
తెలుగులో ఎక్కువగా మాట్లాడుతున్న చిత్రాలు ...ఆర్ ఆర్ ఆర్ ఆ తర్వాత పుష్ప. రీసెంట్ గా అల వైకుంటపురములో వంటి సూపర్ హిట్ ఇచ్చిన అల్లు అర్జున్ చిత్రం కావటంతో అందరి దృష్టీ ఈ సినిమాపై ఉంది. దానికి తోడు సుకుమార్ దర్శకుడు కావటం సినిమాపై అంచనాలు పెంచేసింది.
ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. పుష్పరాజ్ అనే పాత్ర పోషిస్తున్నాడు బన్నీ. అది లారీ డ్రైవర్ పాత్ర అని చెప్తున్నారు. అదే సమయంలో ఈ సినిమా సెకండ్ లుక్ లో ఎర్ర చందనంతో పోలీసులకు పట్టుబడినట్టున్న బన్నీ లుక్ చూస్తుంటే ఆయన ఎర్ర చందనం దొంగ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏదిఏమైనా బన్నీ డి గ్లామర్ లుక్ కేక పుట్టించింది.
ఇక ఈ సినిమా కథపై ఆరోపణలు చేసింది..ఏ అనామకుడైన రైటరో కాదు. కేంద్ర సాహిత్య యువ పురస్కారాన్ని అందుకున్న రచయిత.. వేంపల్లి గంగాధర్. 2008లో తాను రాసిన ‘తమిళ కూలీ’ కథనే ‘పుష్ష’గా తీస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు.
వేంపల్లి గంగాధర్ రాసిన తమిళకూళీ కథ కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథే. అటవీ నేపథ్యంలో సాగుతుంది. ఆ కథనే అటూ ఇటూ మార్చి `పుష్ష`గా తీస్తున్నారన్నది ఆయన ఆరోపణ.
గతంలోనూ ఈ రచయిత.. `అరవింద సమేత`పై ఇలాంటి ఆరోపణలు చేశారు. తాను రాసిన ‘మొండి కత్తి’ కథలో 5 రూపాయల ఫ్యాక్షన్ నేపథ్యాన్ని రాశారు. దాన్నే… `అరవింద సమేత`లోనూ చూపించారు.
`అరవింద సమేత` సమయంలో ఈ రచయిత మాట్లాడినా, సినిమా విడుదలై, బయటకువచ్చేసింది కాబట్టి.. ఏం చేయలేకపోయారు. ఆ తర్వాత ఫేస్ బుక్ పోస్ట్ సైతం డిలేట్ చేసేసారు. అందుకే.. ఇప్పుడు ముందుగానే పోరాటానికి సిద్ధమయ్యారీయన అని అంటున్నారు.
ఇప్పటికే విడుదలై టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌తో సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో నెలకొన్నాయి. షూటింగ్‌లో భాగంగా ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌లో అల్లు అర్జున్ పాల్గొనలేదు. రెండో షెడ్యూల్ నుంచి పాల్గొనాల్సి ఉంది. అయితే కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో చిత్రీకరణలు ఆగిపోయాయి.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఔట్‌డోర్ షూటింగ్‌కు కష్టమని భావించిన చిత్ర బృందం ఓ క్రియేటివ్ ఆలోచన చేసింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలోనే అడవితో పాటు అడవిలో ఉండే ఓ మారుమూల గ్రామానికి సంబంధించి భారీ సెట్లను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.
గతంలో రంగస్థలం సినిమా కోసం కూడా పూర్తి సహజసిద్దంగా ఉండే విలేజ్ సెట్‌ను సుకుమార్ వేయించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అంతే సహజంగా సెట్లను నిర్మించాలని ఆర్ట్‌డైరెక్టర్స్ సూచించాడట.
అంతేకాకుండా ఈ సెట్స్ నిర్మాణం అయ్యేలోపు అతికొద్దిమందితో పాటల చిత్రీకరణ కూడా పూర్తిచేయాలని కూడా సుకుమార్ అండ్ గ్యాంగ్స్ ప్లాన్ చేస్తోంది. ఇక ఇప్పటికే రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ ట్యూన్ సిద్దం చేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి.
త్వరలోనే ‘పుష్ప’ పాటల షూటింగ్ ప్రారంభం కానునుట్ల ఇండస్ట్రీ టాక్. దీంతో ఔట్‌డోర్‌కు వెళ్లాల్సిన పనిలేకుండా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ‘పుష్ప’ షూటింగ్ పూర్తి చేయాలని చిత్రం టీమ్ భావిస్తుందట.
ఏదో ఇంటి సెట్ వేస్తునంత ఈజీ కాదు అడవి సెట్ వేయటమంటే..ఎందుకంటే పెద్ద పెద్ద చెట్లు..తుప్పలు..తెచ్చి నాటాలి..ఆ లుక్ తీసుకురావాలి. అంటే చాలా అయ్యిపోతుంది. అలాగే అదే సమయంలో ఎంతచేసినా కొంత గ్రాఫిక్స్ లో మేనేజ్ చేయకతప్పదు. అదో అదనపడు బడ్జెట్. కానీ నిర్మాతలకు వేరే ఆప్షన్ లేదు. దాంతో బడ్జెట్ పెంచటానికే నిర్ణయంచుకున్నట్లు సమాచారం.