30 ఏళ్ల తరువాత మళ్లీ మెగాస్టార్‌తో.. క్రేజీ కాంబో!

First Published 24, Jun 2020, 4:08 PM

మెగాస్టార్‌ చిరంజీవి లూసీఫర్‌ రీమేక్‌కు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు నటీనటుల ఎంపిక కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు దర్శకుడు. ఈ సినిమాలో ఓ పవర్‌ ఫుల్‌ లేడీ పాత్ర ఉంది. ఆ పాత్ర కోసం ఓ  సీనియర్ నటిని సంప్రదిస్తున్నారు చిత్రయూనిట్‌.

ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి ఆచార్య సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సందేశాత్మక కథాంశంతో కమర్షియల్ జానర్‌తో తెరకెక్కుతోంది. మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లాక్‌ డౌన్‌ కారణంగా ఆగిపోయింది. అంతేకాదు ఈ సినిమాలో మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. చరణ్‌కు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ ఇంకా జరగాల్సి ఉంది.

అయితే ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే తరువాత చేయబోయే ప్రాజెక్ట్‌ను కూడా ఫైనల్‌ చేశాడు మెగాస్టార్‌. మలయాళ సూపర్ హిట్ సినిమా లూసిఫర్‌ను తెలుగులో రీమేక్ చేసేందుకు ఓకే చెప్పాడు చిరు. ఈ సినిమా కు సాహో ఫేం సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌ కూడా పూర్తయ్యింది. అయితే ఆచార్య పూర్తయితే గాని ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం లేదు.

ఈ లోగా నటీనటుల ఎంపిక కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు దర్శకుడు. ఈ సినిమాలో ఓ పవర్‌ ఫుల్‌ లేడీ పాత్ర ఉంది. ఆ పాత్ర కోసం  సీనియర్ నటిని సంప్రదిస్తున్నారు చిత్రయూనిట్‌. మలయాళంలో మంజు వారియర్‌ చేసిన ఆ పాత్రను తెలుగులో విజయశాంతి పోషిస్తుందన్న ప్రచారం జరిగింది. ఇటీవల సరిలేరు నీకెవ్వరు ఫంక్షన్‌లో ఆప్యాయంగా మాట్లాడుతుకన్న చిరు, విజయశాంతిలు తిరిగి తెరను పంచుకోబోతున్నారన్న ప్రచారం గట్టిగా జరిగింది.

కానీ తాజాగా విజయశాంతి ఆ పాత్రలో నటించటం లేదన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఆ పాత్రలో మరో సీనియర్‌ నటి సుహాసిని నటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. గతంలో వీరిద్దరు హీరో హీరోయిన్లుగానూ పలు చిత్రాల్లో నటించారు. చివరగా 1988లో రిలీజ్‌ అయిన మరణ మృదంగం సినిమాలో కలిసి నటించాడు చిరు సుహాసిని. దాదాపు మూడు దశాబ్దాల తరువాత తిరిగి కలిసి నటించేందుకు రెడీ అవుతున్నారు.

అయితే ఈ సినిమాలో సుహాసిని చిరుకు చెల్లెలిగా నటించనుంది. అంతేకాదు ఈ సినిమాలో మరో కీలకమైన పాత్రలో యంగ్ హీరో రానా నటించనున్నాడని తెలుస్తోంది. మలయాళంలో పృథ్విరాజ్‌ పోషించిన ఈ పాత్రలో రానా నటించనున్నాడు. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ నిర్మించనున్నాడు.

loader