- Home
- Entertainment
- అడవిలో దీపికా పిల్లితో సుడిగాలి సుధీర్ రొమాన్స్.. పాపం `జబర్దస్త్` రష్మి.. ఏం చేయబోతుంది?
అడవిలో దీపికా పిల్లితో సుడిగాలి సుధీర్ రొమాన్స్.. పాపం `జబర్దస్త్` రష్మి.. ఏం చేయబోతుంది?
సుడిగాలి సుధీర్- రష్మి బుల్లితెరపై ఎంతటి పాపులర్ జంటనో తెలిసిందే. వీరిద్దరిని విడిగా చూడలేం. కానీ రష్మిని వదిలేసి దీపికా పిల్లితో సుధీర్ కనిపించడం హాట్ టాపిక్ అవుతుంది.

`జబర్దస్త్`తో సుడిగాలి సుధీర్ టీమ్ లీడర్‌గా, కమేడియన్‌గా పాపులర్ అయితే, రష్మి యాంకర్‌గా పాపులర్ అయ్యింది. సుధీర్ పంచ్ లు, డబుల్ మీనింగ్ డైలాగ్ లతో కూడిన పంచ్‌లు, ఆయన కామెడీ నవ్విస్తుంది. మరోవైపు రష్మి అందాలతో ఆకట్టుకుంటుంది. ముద్దు ముద్దు మాటలతో కట్టిపడేస్తుంది. ఈ ఇద్దరు మంచి జోడీ అని అంతా ఫీలవుతుంటారు. ఇద్దరూ ప్రేమలోనే ఉన్నారని భావిస్తుంటారు.
అయితే ఇటీవల వీరిద్దరు కలిసి షోస్ చేయడం లేదు. `జబర్దస్త్` నుంచి సుధీర్ బయటకు వచ్చాడు. సినిమాలు చేసుకుంటున్నారు. మరోవైపు ఆయన హోస్ట్ గా చేసే `శ్రీదేవి డ్రామా`ని కూడా వదిలేశాడు సుధీర్. సినిమాలతో బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన నాలుగు సినిమాలు చేస్తున్నారు. `వాంటెడ్ పండుగాడ్`, `గాలోడు`తోపాటు మరో రెండు చిత్రాలున్నాయి.
అందులో భాగంగా ప్రస్తుతం దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు సమర్పణలో `పండుగాడ్` చిత్రంలో సుధీర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయనతోపాటు సునీల్ మెయిన్ రోల్ చేస్తుండగా, `జబర్దస్త్` బ్యాచ్‌లో అనసూయ, దీపికాపిల్లి, విష్ణు ప్రియా వంటి వారు ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీధర్ సీపాన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ని నేడు విడుదలైంది.
టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. జైల్ నుంచి పారిపోయిన పండుగాడ్( సునీల్) కోసం వెతకడమనే కాన్సెప్ట్ తో సినిమా సాగుతుందని అర్థమవుతుంది. ఆయన్ని పట్టుకుంటే కోటి రూపాయలు ఇస్తారు. దీంతో పండుగాడిని పట్టుకునేందుకు అంతా అడవిలోకి వస్తారు. అక్కడ జరిగే సన్నివేశాలు ఆద్యంతం అలరించేలా ఉన్నాయి. ఇందులో విష్ణు పొట్టి నిక్కర్ పోజులు, అనసూయ గిరిజన మహిళాగా కనిపించి షాకిచ్చింది.
అంతా బాగానే ఉంది. కానీ ఇందులో సుడిగాలి సుధీర్.. `ఢీ` ఫేమ్ దీపికా పిల్లితో కలిసి రొమాన్స్ చేయడం విశేషం. ఆమెతో కలిసి అడవికెళ్లి తన స్టయిల్‌లో రెమాన్స్ చేయడం విశేషం. ఇద్దరు కలిసి డ్యూయెట్లు పాడుకోవడం ఆకట్టుకుంటుంది. ఇద్దరు కలిసి అడవిలో ప్రేమ పాఠాలు చెప్పుకోవడం ఆసక్తిగా మారింది. ఇప్పుడిది హాట్ టాపిక్ అవుతుంది.
సుధీర్ ఏం చేసినా రష్మితోనే చేయాలంటుంటారు. రష్మి లేకుండా సుధీర్‌ని, సుధీర్ లేకుండా రష్మిని వేరే వ్యక్తులతో అభిమానులు చూడలేరు. దీంతో కామెంట్లు పెడుతుంటారు. ఇప్పుడు రష్మి విషయంలోనూ సింపథి ప్రకటిస్తున్నారు. దీపికా పిల్లితో సుధీర్ రొమాన్స్ చేస్తే, రష్మి పరిస్థితి ఏంటని, పాపం రష్మి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే దీపికా పిల్లి సైతం నటిగా దూసుకెళ్తుంది. టిక్‌టాక్‌తో ఎదిగిన ఈ భామ `ఢీ` షోలోకి వచ్చి రచ్చ చేసింది. అతి తక్కువ టైమ్‌కే పాపులర్ అయ్యింది.
ఇప్పుడు కామెడీ స్టార్స్ కి చేస్తుంది. మరోవైపు సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. అందులో భాగంగా `వాంటెడ్ పండుగాడ్`లో ఆల్మోస్ట్ హీరోయిన్ తరహా రోల్‌ని చేస్తుండటం విశేషం.