- Home
- Entertainment
- రష్మీ వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటే నా ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటో చెప్పలేను... సుధీర్ ఆసక్తికర కామెంట్స్
రష్మీ వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటే నా ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటో చెప్పలేను... సుధీర్ ఆసక్తికర కామెంట్స్
యాంకర్ రష్మీ గౌతమ్ వివాహం పై సుడిగాలి సుధీర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనని కాకుండా రష్మీ వేరే అబ్బాయిని వివాహం చేసుకుంటే నా అభిమానుల రియాక్షన్ ఎలా ఉంటుందో చెప్పలేను అన్నాడు.

Sudigali Sudheer
రష్మీ గౌతమ్-సుధీర్ బయటకనిపిస్తే చాలు వాళ్లకు ఎదురయ్యే ప్రశ్న... మీ ఇద్దరి మధ్య ఏముంది?. ఇటీవల ఈ విషయం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. రష్మీ, సుధీర్ తమ చిత్రాల ప్రమోషన్స్ కోసం మీడియా ముందుకు వచ్చిన నేపథ్యంలో వారి లవ్ ఎఫైర్ గురించి మీడియా ప్రముఖంగా అడగడం జరిగింది.
Sudigali Sudheer
బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీలో రష్మీ హీరోయిన్ గా నటించారు. నవంబర్ 4న ఆ చిత్రం విడుదలైంది. ఆ చిత్ర ప్రమోషన్స్ కోసం ఆమె కొన్ని ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. యాంకర్ సుధీర్ గురించి ఆమెను అడిగారు. రష్మీ ఒకింత అసహనం వ్యక్తం చేసింది. ప్రతి విషయాన్ని బయటకు చెప్పేస్తే జీవితంలో ఏమీ మిగలదు. సుధీర్ తో నాకు ఉన్న రిలేషన్ ఏమిటనేది చెప్పలేను. భవిష్యత్ లో అందరికీ తెలుస్తుంది, అన్నారు.
Sudigali Sudheer
ఇక నవంబర్ 18న సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన గాలోడు మూవీ విడుదలవుతుండగా ఆయన మీడియా ముందుకు వచ్చారు. ఈ క్రమంలో సుధీర్ చేసిన కామెంట్ సంచలనం రేపుతోంది. రష్మీ వేరే అబ్బాయిని వివాహం చేసుకుంటే నా నా ఫ్యాన్స్ రియాక్షన్ ఏమిటో చూడాలి. ఆ రోజు కోసం నేను కూడా వేచి చేస్తున్నాను, అన్నారు.
సుధీర్-రష్మీ మేము మిత్రులమని చెబుతున్నప్పటికీ వారి తాజా కామెంట్స్ మరిన్ని సందేహాలు లేవనెత్తేవిగా ఉన్నాయి. ఈ ఇద్దరి వయసు దాదాపు 35 ఏళ్ళు. అయినా పెళ్లి మాట ఎత్తడం లేదు. ఈ పరిణామం కూడా ప్రేమికులేమో, అందుకే మరొకరిని పెళ్లి చేసుకోవడం లేదేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
దేనికైనా కాలమే సమాధానం చెప్పాలి. సుడిగాలి సుధీర్-రష్మీ ప్రేమికులన్న ప్రచారం చాలా కాలంగా జరుగుతుంది. జబర్దస్త్ వేదికగా మొదలైన వీరి రిలేషన్ పదేళ్లుగా సాగుతుంది. బుల్లితెరపై తమని తాము లవర్స్ గా ప్రాజెక్ట్ చేసుకున్నారు. అది వాళ్ళ కెరీర్ కి ఎంతగానో ఉపయోగపడింది.
కాగా బుల్లితెరపై అలరించిన ఈ జంట హీరో హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. గజ్జల గుర్రం టైటిల్ తో ఒక మూవీ చర్చల దశలో ఉంది. అది కార్యరూపం దాల్చితే కాంబినేషన్ సెట్ అయినట్లే అని సుధీర్ అన్నారు. అలాగే తన లేటెస్ట్ మూవీ గాలోడు తోపాటు గత చిత్రం సాఫ్ట్ వేర్ సుధీర్ లో మొదట రష్మీని హీరోయిన్ గా అనుకున్నామని సుధీర్ చెప్పారు.