- Home
- Entertainment
- OTT Releases: జైలర్ 2 నుంచి రణబాలి వరకు... ఈ వారం ఓటీటీలోకి వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే
OTT Releases: జైలర్ 2 నుంచి రణబాలి వరకు... ఈ వారం ఓటీటీలోకి వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే
OTT Releases: ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితా మీకోసం. జైలర్ 2, అన్బిల్ అవన్ సహా పలు ఆసక్తికరమైన చిత్రాలు ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ కానున్నాయి.

ఈ వారం ఓటీటీ రిలీజ్లు
ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ విపరీతంగా పెరగడంతో ప్రతి వారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా రిలీజ్ అయిన 28 రోజుల్లో ఓటీటీకి వచ్చేస్తోంది. థియేటర్లో మిస్ అయిన సినిమాలు ఓటీటీలో చూడొచ్చనే మైండ్‌సెట్‌కి ప్రేక్షకులు అలవాటు పడ్డారు. అందుకే ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల సంఖ్య కూడా బాగా పెరిగింది. ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్‌ల లిస్ట్ ఓసారి చూద్దాం.
జైలర్ 2
రణబాలి
పెళ్లి తర్వాత రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ తొలిసారి జంటగా నటించిన సినిమా రణబాలి. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ అంచనాలతో రిలీజ్ అయినా జైలర్ 2 ప్రభంజనంలో చిక్కుకుని వసూళ్లు రాబట్టలేకపోయింది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా నవంబర్ 13న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది.
అన్బిల్ అవన్
కొత్త డైరెక్టర్ కార్తికేయన్ దర్శకత్వంలో అశోక్ సెల్వన్, ప్రీతి ముకుందన్ జంటగా నటించిన చిత్రం అన్బిల్ అవన్. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. నవంబర్ 13 నుంచి సోనీ లివ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.













