- Home
- Entertainment
- Divya Bharathi : సుడిగాలి సుధీర్ హీరోయిన్ లేటెస్ట్ లుక్... ‘మా చూపంతా అక్కడే’ అంటూ కుర్రాళ్ల క్రేజీ కామెంట్లు
Divya Bharathi : సుడిగాలి సుధీర్ హీరోయిన్ లేటెస్ట్ లుక్... ‘మా చూపంతా అక్కడే’ అంటూ కుర్రాళ్ల క్రేజీ కామెంట్లు
సుడిగాలి సుధీర్ హీరోయిన్, యంగ్ బ్యూటీ దివ్య భారతీ (Divya Bharathi) లేటెస్ట్ లుక్ నెట్టింట వైరల్ గా మారింది. ఆమె ధరించిన డ్రెస్, స్టిల్స్ పై కుర్రకారు క్రేజీగా కామెంట్లు చేస్తున్నారు.

సుడిగాలి సుధీర్ Sudigali Sudheer తాజాగా నటించిన చిత్రం G.O.A.T (గోట్). GreatestOfAllTimes అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంలో హీరోయిన్ గా దివ్యభారతి (Divya Bharathi) నటిస్తున్నది.
ఈ చిత్రానికి ‘పాగల్’ ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నారు. మహాతేజ క్రియేషన్స్ అండ్ జైష్ణవ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.
ఈ క్రమంలో సినిమాను టీమ్ ప్రమోట్ చేసేందుకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ను వదులుతూనే వస్తోంది. అలాగే నటి దివ్య భారతీ కూడా తన సినిమాను ప్రచారం చేసేందుకు సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తూనే ఉంది.
ఇంట్రెస్టింగ్ గా పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటోంది. మరీ ముఖ్యంగా ఇటీవల స్టన్నింగ్ గా ఫొటోషూట్లు చేస్తూ మతులు పోగొడుతోంది. తాజాగా మరిన్ని అదిరిపోయే ఫొటోలను పంచుకుంది.
లేటెస్ట్ లుక్ లో దివ్య భారతీ స్టన్నింగ్ గా మెరిసింది. మినీ గౌన్, క్రీమీ కలర్ పాయింట్ లో దర్శనమిచ్చింది. అయితే స్కిన్ టోన్ కు మ్యాచ్ అయ్యే కలర్ డ్రెస్ లో మెరియడంతో అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.
పైగా సైడ్ యాంగిల్ లో సిట్టింగ్ ఫోజులిచ్చి హాట్ లుక్ తో కేకపెట్టింది. మరోవైపు మత్తు కళ్లతో మయా చేసింది. దీంతో కుర్రాళ్లు మీ కళ్లను తప్ప ఇంకేమీ చూడటం సాధ్యపడటం లేదంటూ క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.