MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సుధీర్‌ బాబు ప్రయోగం, పౌరాణిక కథతో `జటాధర`, ఇలా హిట్‌ పడిందో లేదో తగ్గడం లేదుగా!

సుధీర్‌ బాబు ప్రయోగం, పౌరాణిక కథతో `జటాధర`, ఇలా హిట్‌ పడిందో లేదో తగ్గడం లేదుగా!

సుధీర్‌ బాబు సక్సెస్‌ కోసం చాలా కాలంగా స్ట్రగుల్‌ అవుతున్న నేపథ్యంలో ఇటీవల ఓ హిట్ పడింది. అంతే ఇప్పుడు రూట్‌ మార్చి మైండ్‌ బ్లోయింగ్‌ స్టోరీతో రాబోతున్నాడు.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Sep 24 2024, 11:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

యంగ్‌ హీరో సుధీర్‌ బాబుకి చాలా రోజుల తర్వాత హిట్ పడింది. ఇటీవల ఆయన `హరోంహర` చిత్రంతో హిట్‌ అందుకున్నారు. కెరీర్‌ పరంగా కొంత రిలీఫ్‌ అయ్యాడు. అంతేకాదు కథల ఎంపికలోనూ పంథా మార్చుకున్నాడు. రొటీన్‌ సినిమాలను పక్కన పెట్టిన ప్రయోగాత్మక చిత్రాలకు ప్రయారిటీ ఇస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పుడు ఓ ప్రయోగం చేస్తున్నాడు. పౌరాణిక కథలుచేస్తున్నారు. తాజాగా ఆయన `జటాధర` పేరుతో మూవీ చేస్తున్నారు. ఇది పౌరాణిక, ఫాంటసీ, డ్రామా మేళవింపుగా రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం కావడం విశేషం. 

బిగ్ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ చూడండి.

25

వైవిధ్య‌మైన సినిమాలు, పాత్ర‌ల‌తో మెప్పిస్తోన్న సుధీర్ బాబు హీరోగా ఈ సూప‌ర్ నేచుర‌ల్ థ్రిల్ల‌ర్ ‘జటాధర’ రూపొందుతుంది.  అనౌన్స్‌మెంట్ నుంచి పాన్ ఇండియా సినీ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుని భారీ అంచ‌నాలు క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం 2025 శివ‌రాత్రి విడుద‌ల‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతుంది.

ఈ సినిమా నుంచి విడుద‌లైన కొత్త పోస్ట‌ర్ సినిమాపై ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను మ‌రింత‌గా పెంచుతోంది. పౌరాణిక‌, ఫాంట‌సీ, డ్రామా అంశాల క‌ల‌యిక‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంద‌ని విడుద‌లైన పోస్ట‌ర్ చూస్తుంటేనే అర్థ‌మ‌వుతుంది. అలాగే అందులో సుధీర్ బాబు స‌రికొత్త లుక్‌తో, శ‌క్తివంత‌మైన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నార‌ని తెలుస్తుంది. 
 

35

ప్రేర‌ణ అరోరా స‌మ‌ర్ప‌ణ‌లో సుధీర్ బాబు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై `జ‌టాధ‌ర` చిత్రం తెరకెక్కుతుందగా, వెంకట్‌ కళ్యాణ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. విడుదల చేసిన కొత్త లుక్ లో సూప‌ర్ నేచుర‌ల్ శ‌క్తితో అద‌ర‌గొట్టే లుక్‌లో సుధీర్ బాబు క‌నిపిస్తున్నారు. దీని గురించి సుధీర్ బాబు మాట్లాడుతూ, `జ‌టాధ‌ర‌` ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కు వ‌చ్చిన ఆద‌ర‌ణ చూసి ఆశ్చ‌ర్య‌పోయాను.

ఇంత గొప్ప స్పంద‌న రావ‌డంతో సంతోష‌మేసింది. ఈ సినిమాలోకి అడుగు పెట్ట‌టం అనేది ఓ స‌రికొత్త ప్ర‌పంచాన్ని నాకు ప‌రిచ‌యం చేసింది. శాస్త్రీయ‌త‌, పౌరాణిక అంశాల క‌ల‌యిక స్క్రిప్ట్‌ను రాశారు. ఈ రెండు జోన‌ర్స్‌కు చెందిన ప్ర‌పంచాల‌ను రేపు ఆడియెన్స్ వెండితెర‌పై చూస్తున్నప్పుడు ఓ స‌రికొత్త సినిమా అనుభూతిని పొందుతారు. 
 

45

ఓ సినిమా స‌క్సెస్‌కైనా కార‌ణం బ‌ల‌మైన స్క్రిప్ట్‌. దీనికి మంచి టీమ్ తోడైతే అది మంచి సినిమాగా ప్రాణం పోసుకుంటుంది. మా సినిమా విష‌యంలో అదే జ‌రుగుతుంది. విజువ‌ల్‌గా, ఎమోష‌న‌ల్‌గా ఓ అద్భుత‌మైన సినిమాను ఆమె తెర‌కెక్కిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన సెకండ్ పోస్ట‌ర్ పౌరాణిక ప్రపంచాన్ని తెలియజేస్తుంది. ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచేలా ఉండే అంశాలు ఎన్నో ఈ సినిమాలో ఉండ‌బోతున్నాయి` అని తెలిపారు. 

55

భారీ బ‌డ్జెట్‌తో అంచ‌నాల‌ను మించేలా ఓ అద్భుత‌మైన స‌రికొత్త చిత్రాన్ని రూపొందించ‌టానికి నిర్మాత‌లు ప్రేర‌ణ అరోరా, శివివ‌న్ నారంగ్‌, నిఖిల్ నంద‌, ఉజ్వ‌ల్ ఆనంద్  ప్రయత్నిస్తున్నారు. సినిమాలో హీరోయిన్‌గా ఓ ప్ర‌ముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ న‌టించ‌నుంది. అలాగే ప్ర‌తినాయ‌కి పాత్ర‌లో బాలీవుడ్ స్టార్ న‌టించనుంది.

ఆ వివ‌రాల‌ను మేక‌ర్స్ త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో ప్రారంభం కానుంది. ఇటీవల `హరోంహ‌ర‌`తో హిట్ కొట్టిన సుధీర్ బాబు అక్టోబ‌ర్ 11న `మా నాన్న సూప‌ర్ హీరో` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు.
 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode:దీపకు కాపలాగ పారు-దాసు హెల్ప్-కార్తీక్‌కు తప్పిన ప్రమాదం-శౌర్య సేఫ్
Recommended image2
మహేష్ బాబు ను అన్నయ్య అని పిలిచిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఎందుకలా పిలిచింది? నిజమెంత?
Recommended image3
Giri Babu: ఆ స్టార్ హీరోతో రూమ్ షేరింగ్.. మధ్యలోనే ఇండస్ట్రీ వదిలేయాలనుకున్నా..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved