సుదీప ఎలిమినేటెడ్.. ఆరోవారంలో `బిగ్ బాస్` హౌజ్‌ని వీడేది ఆమే?
`బిగ్ బాస్ తెలుగు 6` ఆరో వారం పెద్ద షాక్. ఈ వారం నామినేషన్‌లో ఉన్న తొమ్మిది మందిలో ఉన్న సుదీప ఈ వారం ఎలిమినేట్ అయ్యిందనే వార్త వైరల్ అవుతుంది.

బిగ్ బాస్ 6 తెలుగు ఆరో వారం ముగింపు చేరుకుంది. హౌజ్ ఇప్పుడిప్పుడే కాస్త రసవత్తరంగా మారుతుంది. ఈ వారం నామినేషన్‌లో కీర్తి, సుదీప, శ్రీహాన్, బాలాదిత్య, రాజ్, శ్రీ సత్య, మెరీనా, ఆదిరెడ్డి, గీతూ నామినేషన్లలో ఉన్నారు. అయితే వీరిలో ఎవరు హౌజ్‌ని వీడుతారనేది ఆసక్తికరంగా మారింది. రాజ్, సుదీప, కీర్తి, మెరీనాలో ఒకరు ఎలిమినే అయ్యే అవకాశాలున్నాయి. మిగిలిన వారితో పోల్చితే వీరు కాస్త వీక్‌గా ఉన్నారు.
అయితే తాజాగా ఈ వారం ఎలిమినేషన్ లీక్ అయ్యింది. సుదీప ఆరోవారం ఎలిమినేట్ అయ్యిందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆరో వారం సుదీప ఎలిమినేట్ అని కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. మిగిలిన వారితో పోల్చితే ఆమెకి చాలా తక్కువ ఓట్లు రావడంతో ఎలిమినేట్ అయ్యిందని సమాచారం.
అయితే ఇప్పటి వరకు సుదీప నామినేషన్లలో పెద్దగా లేదు. ఇప్పుడు అంతా బలంగా మారుతున్నారు. సుదీప ఎక్కువగా కిచెన్‌కే పరిమితం అవుతుంది. దీంతో స్క్రీన్‌లో కనిపించడం లేదు. ఇదే ఆమెకి పెద్ద మైనస్ అని తెలుస్తుంది. ఇటీవల వారి ఇంటివారితోనూ మాట్లాడినా, వాళ్లు ఇదే విషయాన్ని చెప్పారు. హౌజ్ సభ్యులు కూడా అదే చెప్పారు. నాగ్ కూడా ఈ విషయాన్ని పలు మార్లు వెల్లడించారు.
దాన్ని అధిగమించి యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తుంది సుదీప. కానీ ఇంతలోనే ఆమె ఎలిమినేట్ అయ్యిందనే వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఎలిమినేషన్‌లో సుదీప, రాజ్ చివరకు మిగలగా అందులో ఉత్కంఠభరితమైన ఎపిసోడ్ అనంతరం సుదీపని ఎలిమినేట్‌గా నాగార్జున ప్రకటించినట్టు సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది రేపటికి తెలుస్తుంది.
హౌజ్‌లో ప్రస్తుతం 16 మంది ఉన్నారు. నేడు(శనివారం) హోస్ట్ నాగార్జున హౌజ్‌లో సందడి చేయనున్నారు. సభ్యులకు క్లాస్ పీకడాలు, తప్పొప్పులు చెబుతూ, వారితో గేమ్ ఆడించనున్నారు.