- Home
- Entertainment
- Brahmamudi: తల్లి, కొడుకుల పొగరు దించిన సుభాష్.. తల్లిదండ్రులపై తప్పు వేసి షాకిచ్చిన అప్పు?
Brahmamudi: తల్లి, కొడుకుల పొగరు దించిన సుభాష్.. తల్లిదండ్రులపై తప్పు వేసి షాకిచ్చిన అప్పు?
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి కంటెంట్ తో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. కొడుకు తప్పు చేస్తే ఆ తప్పుని సరిదిద్దున ఒక తండ్రి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఆగస్టు 23 ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో వర్షంలో తడుస్తూ కూతుర్ని పుట్టింటికి తీసుకొని బయలుదేరుతారు కృష్ణమూర్తి దంపతులు. సరైన సమయానికి సుభాష్ అక్కడికి వచ్చి నా కోడల్ని ఎక్కడికి తీసుకు వెళుతున్నారు అని అడుగుతాడు. రాజ్ కావ్యని బయటికి గెంటేసాడు అని చెప్తాడు ప్రకాష్. పుట్టింటికి తీసుకు వెళుతున్నాం అంటాడు కృష్ణమూర్తి. మీరెవరు నా కోడల్ని తీసుకు వెళ్ళటానికి, పెళ్లి అయిపోయిన తర్వాత ఇంక మీ బాధ్యత లేదు. ఇప్పుడు తన తండ్రి నేను అంటూ కోడల్ని చేయి పట్టుకుని ఇంట్లోకి తీసుకువెళ్తాడు సుభాష్.
అసలు ఏం జరుగుతుంది ఇంట్లో, తండ్రి ఇంట్లో లేకపోతే నిర్ణయాలు తీసుకునే అంత పెద్ద వాడివి అయిపోయావా అంటూ రాజ్ కి చివాట్లు పెడతాడు. అత్త కోడళ్ళకి తగులు వస్తే తగ్గవలసింది ఎవరు అత్తే కదా అంటే నా కొడుకు కాపురం విడిపోయినా పర్వాలేదు కానీ నీ పంతం నెగ్గాలి అంతే కదా అంటూ పెళ్ళం మీద కేకలు వేస్తాడు సుభాష్. తను చాలా పొగరుగా ప్రవర్తించింది అన్నయ్య అంటుంది రుద్రాణి. నోరు అదుపులో పెట్టుకో.. నువ్వు ఇక్కడ పడి ఉన్నట్టు తను కూడా తన భర్తను వదిలేసి తన పుట్టింట్లో పడి ఉండాలా..
అసలు నా భార్య సగం ఇలా ప్రవర్తించడానికి కారణం నువ్వే అంటూ రుద్రాణి మీద కూడా మండిపడతాడు. తల్లిదండ్రుల వైపు తిరిగి మాట్లాడితే వంశ పరువు ప్రతిష్టల గురించి మాట్లాడుతారు ఇప్పుడు ఏమైంది మీ పెద్దరికం. కోడలు ఇంట్లోంచి వెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకున్నారా అని కోప్పడతాడు సుభాష్. మా పెద్దరికాన్ని నీ భార్య నీ కొడుకు మంట కలిపేసారు. ఈ ఇంట్లో నీ కోడలికే కాదు మా పెద్దరికంకి కూడా అన్యాయం జరిగింది అంటారు సీతారామయ్య దంపతులు.
ఇది నీ ఇల్లు ధైర్యంగా మీ ఇంట్లోకి వెళ్ళు అనే ధైర్యం చెప్పి కావ్యని ఇంట్లోకి పంపిస్తాడు. కృష్ణమూర్తి దంపతులకు క్షమాపణ చెప్పి వాళ్ళని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేయమని చెప్పి డ్రైవర్ని ఇచ్చి పంపిస్తాడు సుభాష్. ఆ తర్వాత స్నానం చేసి వచ్చిన భర్తని ఎందుకు ఇలా చేశారు ఒకసారి తనని పుట్టింటికి పంపిస్తే మన విలువ తెలిసేది అంటుంది అపర్ణ. నువ్వు తనని కోడలిగా అంగీకరించడం లేదు కాబట్టి తన విలువ నీకు తెలియటం లేదు.
తనని కోడలిగా ఒప్పుకోకపోవడానికి ఒక కారణం కూడా లేదు ఆ స్వప్న లాగా మొండిదైతే మనం ఎన్ని పాట్లు పడాలో ఆలోచించుకో. అయినా కావ్య ఆత్మ అభిమానం నీకు తెలుసు కదా తను ఒక్కసారి పుట్టింటికి వెళ్తే మళ్ళీ ఇక్కడికి వస్తుంది అనుకుంటున్నావా.. అప్పుడు వీధిన పడేది మనపరువే. పేదింటి అమ్మాయిని కోడలుగా తెచ్చుకుని మూడు నెలలు కూడా ఉంచుకోకుండా పుట్టింటికి తరిమేసారు అని మనల్ని అంటారు.
అయినా ఒక్కసారి కావ్యని మంచి మనసుతో అర్థం చేసుకో అప్పుడు తన మంచి మనసు నీకు అర్థమవుతుంది అంటాడు సుభాష్. తను ఎప్పటికీ నా కోడలు కాలేదు, నేను ఎప్పటికీ తనని నా కోడలుగా ఒప్పుకోను. నా కొడుక్కి అన్యాయం జరిగింది అని మొండిగా మాట్లాడుతుంది అపర్ణ. మరోవైపు కావ్య కాపురం గురించి బాధపడుతూ ఉంటారు కృష్ణమూర్తి దంపతులు. అక్కని అలా వదిలేసి వచ్చి తప్పు చేశారు. అక్కడ అంత అవమానం జరుగుతున్నప్పుడు ఎందుకు అలా చేశారు.
ఎంత అత్తింటి వాళ్ళు అయితే మాత్రం వాళ్ళు ఏమన్నా అక్కడే పడి ఉండాలా అంటూ తల్లిదండ్రుల మీద కోప్పడి బయటకు వెళ్ళిపోతుంది అప్పు. నాక్కూడా అదే అనిపిస్తుంది. పొద్దున అల్లుడని చూసినప్పుడు వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉన్నారు అనుకున్నాము కానీ అతని మనసులో ఇంత దురుద్దేశం ఉందని అనుకోలేదు. మనసులో అభిమానం లేనప్పుడు వాళ్ళిద్దరూ ఎలా కలిసి కాపురం చేస్తారు అని దిగులు పడతాడు కృష్ణమూర్తి.
మరోవైపు కావ్య రాజ్ దగ్గరికి వచ్చి అసలు ఏం జరిగిందో ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి అనుకుంటుంది. కానీ తన మాట వినకుండా కోపంతో చేతిని తలుపుకు వేసి కొట్టుకుంటాడు రాజ్. రక్తం కారుతున్న చేత్తోనే కోపంగా వెళ్లి పడుకుండిపోతాడు. రాజ్ చేతికి కట్టు కడుతుంది కావ్య. తరువాయి భాగంలో కావ్య కట్టిన కట్టుని కోపంగా విప్పేస్తాడు రాజ్. నేను మా పుట్టింటికి వెళ్ళవచ్చా అని భర్తని పర్మిషన్ అడుగుతుంది కావ్య. సమాధానం చెప్పకుండా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజ్. తన కోపాన్ని కృష్ణుడి ముందు వెళ్లగకుతుంది కావ్య.