ఎన్టీఆర్ నుంచి నాగచైతన్య వరకు స్టార్ హీరోల రెండు పెళ్ళిళ్ళు, పవన్ కళ్యాణ్ ,నరేష్ టాప్ లో ఉన్నారు..
ఫిల్మ్ ఇండస్ట్రీలో రెండు పెళ్లిళ్లు కామన్ అయిపోయాయి. చాలామంది స్టార్లు రెండు సార్లు వివాహం చేసుకున్నారు. ఈ లిస్ట్ లో స్టార్ హీరోలు కూడా ఉన్నారు. పెద్దాయిన సీనియర్ ఎన్టీఆర్ నుంచి నాగచైతన్య వరకూ రెండు అంతకు మించి పెళ్లిళ్లు చేసుకున్నవారు ఎవరోతెలుసా..?
ఎన్టీఆర్
తెలుగుపరిశ్రమకు మొదటి తరం హీరోగా.. ఆంధ్ర ప్రదేశ్ కు మఖ్యమంత్రిగా ప్రజల హృదయాలు గెలిచిన నందమూరి తారక రామారావు రెండు పెళ్లిల్లు చేసుకున్నారు. ఆయన మొదటి భార్య బసవతారకమ్మ కాగా.. వారి సంతానమే ఇప్పుడు నందమూరి వారసులుగా టాలీవుడ్ లో, రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఇక 70 ఏళ్ళ వయస్సలో ఆయన లక్ష్మీ పార్వతిని రెండో పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం ఇప్పటికీ వివాదంగానే ఉంది. ఈ పెళ్ళి వల్ల నందమూరి కుటుంబంతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో కూడా పెను సంచలనమే జరిగింది.
Nandamuri Harikrishna
హరికృష్ణ
ఇక నందమూరి వారసుడు, చైతన్య రధ సారధి హరికృష్ణ కూడా రెండు పెళ్ళిల్లు చేసుకున్నారు. ఆయన మొదటి భార్యకు కలిగిన సంతానమే హీరో కళ్యాణ్ రామ్, జానకి రామ్, సుహాసని. జానకిరామ్ యాక్సిడెంట్ లో మరణించారు. ఇక హరికృష్ణ మొదటి భార్య ఉండగానే రెండో పెళ్లి చేసుకున్నారు. ఆమె పేరు షాలిని. వీరి సంతానమే పాన్ ఇండియా హీరో.. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.
నాగార్జున
టాలీవుడ్ మన్మధుడు అక్కినేని అందగాడు కింగ్ నాగార్జున కూడా రెండు పెళ్ళిల్లు చేసుకున్నారు. నాగ్ కు మొదట పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నారు. హీరో వెంకటేష్ చెల్లెలు, మూవీ మొగల్ దివంగత నిర్మాత రామానాయుడు కూతురు లక్ష్మిని ఆయన పెళ్ళాడారు. నాగచైతన్య పుట్టిన తరువాత వీరు విడిపోయారు. ఆ తరువాత నాగార్జున హీరోయిన్ అమలను ప్రేమించి పెళ్ళాడారు. వీరిసంతానమే యంగ్ హీరో అఖిల్.
నాగచైతన్య
తండ్రి నాగార్జున బాటలోనే నడిచాడు నాగచైతన్య. ఆయన మొదటి సినిమా టైమ్ లోనే హీరోయిన్ సమంతతో ప్రేమలో పడ్డాడు. ఆ ప్రేమ కాస్తా పెళ్ళి దాకా వచ్చింది. దాదాపు 7 ఏళ్ళు సీక్రేట్ గా ప్రేమించుకున్న చైతూ సమంతలు .. ఆతరువాత పెద్దల ఓప్పందంతో పెళ్ళి చేసుకున్నారు. కాని మూడు ఏళ్లకే వీరు విడాకులు తీసుకున్నారు. ఇక నాగచైతన్య మరో హీరోయిన్ శోభిత ధూళిపాళతో మళ్ళీ ప్రేమలో పడ్డారు. డిసెంబర్ 4న వీరి పెళ్ళి ఘనంగా జరిగింది.
పవన్ కళ్యాణ్
ఇక మెగా ప్యామిలీలో హీరోల విషయంలో రెండుకు మించి పెళ్ళిళ్ళు చేసుకున్న స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే. ఆయన ముందుగా వైజాగ్ కు చెందిన ఓ అమ్మాయిని పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకున్నారు. ఆతరువాత మనస్పర్ధలు రావడంతో ఆమెకు విడాకులు ఇచ్చి.. ఆతరువాత హీరోయిన్ రేణు దేశాయ్ ను ప్రేమించారు.. పెళ్ళాడారు. వీరికి ఇద్దరు పిల్లలు కాగా. వారే అకీరా నందన్, ఆధ్య. ఇక ఆ తరువాత రేణుకి కూడా విడాకులు ఇచ్చిన ఆయన అన్నా లెజినోవాను ప్రేమించి పెళ్ళాడారు.
కృష్ణ
సూపర్ స్టార్ కృష్ణ కూడా రెండు పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఆయన తన మరదలు ఇందిరాదేవిని పెళ్ళాడారు. వారి సంతానమే.. మహేష్ బాబు రమేష్ బాబు తో పాటు మంజులు, పద్మావతి, ప్రియదర్శిని. ఇక ఆయన ఆ తరువాత ఆయన తనతో ఎన్నో సినిమాలు చేస్తున్న విజయనిర్మలను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. అప్పటికే విజయనిర్మలకు కూడా పెళ్ళై.. హీరో నరేష్ కు జన్మినచ్చారు. తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చారు విజయనిర్మల. ఇక పెళ్లి తరువాత కృష్ణ విజయనిర్మలతోనే కలిసి ఉన్నారు.
Naresh pavitra
నరేష్
ఇక విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నరేష్ హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి.. ఇప్పుడు క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నాడు. కాని పర్సనల్ లైఫ్ లోనే ఎన్నో వివాదాలు చుట్టుకున్నారు. ఆయన నాలుగు పెళ్ళిల్లు చేసుకున్నారు. ప్రస్తుతం నరేష్ నాలుగో భార్యగా ప్రముఖ నటి పవిత్రలోకేష్ ఉన్నారు. అంతకు ముందు ముగ్గరికి కూడా నరేష్ విడాకులిచ్చారు.
మోహన్ బాబు
మంచు ఫ్యామిలీ కూడా ఈ కోవలోకే వస్తారు. మంచు స్టార్ మోహన్ బాబు కూడా తన మొదటి భార్య చనిపోవడంతో ఆమెచెల్లెలినే పెళ్ళాడారు. మెహన్ బాబు మొదటి భార్య సంతానంగా మంచు లక్ష, విష్ణు ఉండగా.. రెండో భార్య సంతానంగా మనోజ్ జన్మించాడు.
మంచు మనోజ్.
ఇక మోహన్ బాబు రెండో తనయుడు మనోజ్ కూడా రెండు పెళ్ళిల్లు చేసుకున్నారు. ఆయన మొదటి భార్య అరేంజ్డ్ మ్యారేజ్ కాగా. అప్పటికే ఆయన భూమా మౌనికతో ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆతరువాత కలహాల వల్ల విడిపోయిన మనోజ్ .. మౌనికను పెళ్శాడాడు.
కృష్ణంరాజు
యంగ్ రెబల్ స్టార్ కృష్ణ రాజు కూడా రెండు పెళ్ళిల్లు చేసుకున్నవారే. ఆయన తన భార్య చనిపోవడంతో.. భార్యకు చెల్లెలు వరసుండే ఆవిడని రెబల్ స్టార్ పెళ్ళి చేసుకున్నారు.