MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • `బిగ్‌ బాస్‌ తెలుగు 9`లోకి స్టార్‌ సింగర్‌.. లేటెస్ట్ కన్ఫమ్‌ కంటెస్టెంట్ల లిస్ట్

`బిగ్‌ బాస్‌ తెలుగు 9`లోకి స్టార్‌ సింగర్‌.. లేటెస్ట్ కన్ఫమ్‌ కంటెస్టెంట్ల లిస్ట్

బిగ్‌ బాస్‌ తెలుగు 9వ సీజన్‌కి సంబంధించి హౌజ్‌లోకి వచ్చే కంటెస్టెంట్ల వివరాలు ఆసక్తికరంగా మారాయి. తాజాగా ఓ స్టార్‌ సింగర్‌ బిగ్‌ బాస్‌ రియాలిటీ షోలోకి రాబోతున్నారట. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 10 2025, 12:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
`బిగ్‌ బాస్‌ తెలుగు 9` షో ప్రారంభానికి సన్నాహాలు
Image Credit : star maa promo

`బిగ్‌ బాస్‌ తెలుగు 9` షో ప్రారంభానికి సన్నాహాలు

బిగ్‌ బాస్‌ తెలుగు 9వ సీజన్‌ రియాలిటీ షో ప్రారంభానికి మరికొన్ని రోజులే ఉంది. సెప్టెంబర్‌ మొదటి వారంలోనే ఈ షో ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్లని ఫైనల్‌ చేసే పనిలో టీమ్‌ ఉంది. నాగార్జున హోస్ట్ గా చేస్తున్న ఈ షోలో ఈ సారి కంటెస్టెంట్లుగా ఎవరు వస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది. వినిపిస్తోన్న సమాచారం మేరకు పలువురు క్రేజీ కంటెస్టెంట్లు రాబోతున్నారట. వివాదాస్పద కంటెస్టెంట్లకి పెద్ద పీట వేస్తున్నట్టు తెలుస్తోంది.

DID YOU
KNOW
?
కామన్‌ మ్యాన్‌లు ఐదుగురు
ఈసారి బిగ్‌ బాస్‌ తెలుగు 9వ హౌజ్‌లోకి ఏకంగా ఐదుగురు కామన్‌ మ్యాన్లు కంటెస్టెంట్లుగా రాబోతున్నారట.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి సింగర్‌ సాకేత్‌?
Image Credit : Facebook/Saketh Komanduri

బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి సింగర్‌ సాకేత్‌?

తాజాగా ఓ క్రేజీ సింగర్‌ పేరు తెరపైకి వచ్చింది. స్టార్‌ సింగర్‌ని దించుతున్నారట బిగ్‌ బాస్‌ నిర్వాహకులు. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న సింగర్‌ సాకేత్‌ కోమండూరి బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి వస్తున్నట్టు సమాచారం. బిగ్‌ బాస్‌ నిర్వాహకులు ఆయన్ని సంప్రదించారని, గాయకుడు కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. పట్టుబట్టి సాకేత్‌ని బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి తీసుకొస్తున్నట్టు సమాచారం. ఆయన వస్తే అటు ఎంటర్‌టైన్‌మెంట్‌, ఇటు పాటలతో అలరించడంతోపాటు గేమ్స్ ఆడటంలోనూ ముందుంటారు. చాలా యాక్టీవ్‌గా ఉంటారు. దీంతో షోలో రచ్చ వేరే లెవల్‌లో ఉంటుందని బిగ్‌ బాస్‌ టీమ్‌ భావిస్తుందట. అయితే దీనికి సాకేత్‌ పారితోషికం గట్టిగానే డిమాండ్‌ చేస్తున్నారట. బిగ్‌ బాస్‌ నిర్వాహకులు కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. 

Related Articles

Related image1
రాజమౌళి సినిమాకి మహేష్‌ బాబు పారితోషికం ఎంతో తెలుసా? జక్కన్న ప్లాన్‌ వేరే లెవల్‌
Related image2
`కూలీ` మూవీ క్రిటిక్‌ రివ్యూ, వామ్మో పూనకాలు తెప్పించే సర్‌ప్రైజ్‌ ఉందట.. రజనీ, నాగ్‌ వెండితెరపై రచ్చే
35
అలేఖ్య చిట్టి పికిల్స్ గర్ల్ రమ్య ఫైనల్‌
Image Credit : instagram/Ramya moksha kancharla

అలేఖ్య చిట్టి పికిల్స్ గర్ల్ రమ్య ఫైనల్‌

వీరితోపాటు పలువురు క్రేజీ సెలబ్రిటీలు హౌజ్‌లోకి కంటెస్టెంట్లుగా రాబోతున్నారట. అలేఖ్య చిట్టి పికిల్స్ ద్వారా పాపులర్‌ అయిన అమ్మాయి రమ్య కూడా హౌజ్‌లోకి రాబోతుంది. ఆమె ఇప్పటికే కన్ఫమ్‌ అయ్యింది. పికిల్స్ రేట్‌ అడిగినందుకు బూతులతో సమాధానం చెప్పి ఈ పికిల్ గర్ల్స్ పెద్ద రచ్చ చేసిన విషయం తెలిసిందే. దీంతో సోషల్‌ మీడియాలో పాపులర్‌ అయ్యారు. అదే రచ్చ బిగ్‌ బాస్‌ హౌజ్‌లోనూ జరుగుతుందని టీమ్‌ భావిస్తుంది. ఆమెకి సోషల్‌ మీడియా ద్వారా వచ్చిన క్రేజ్‌ ఈ షోకి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నారు. అయితే రమ్య సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. జిమ్‌ లుక్‌లో, చీరలో ఫోటోలు పెట్టి నెటిజన్లకి మతిపోగొడుతుంది. ఇదంతా బిగ్‌ బాస్‌ రేటింగ్‌ పెంచడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు. మరి అది ఎంత వరకు వర్కౌట్‌ అవుతుందో చూడాలి.

45
ఆల్మోస్ట్ కన్ఫమ్‌ కంటెస్టెంట్లు వీరే
Image Credit : star maa promo

ఆల్మోస్ట్ కన్ఫమ్‌ కంటెస్టెంట్లు వీరే

వీరితోపాటు బిగ్‌ బాస్‌ తెలుగు 9 సీజన్‌లో కంటెస్టెంట్‌గా కన్ఫమ్‌ అయిన వారిలో ఇటీవల వివాదాస్పద నటి కల్పిక గణేష్‌, బుల్లితెర స్టార్స్ దీపికా, తేజస్విని, శివకుమార్‌, దేబ్జానీ, జబర్దస్త్ ఇమ్మాన్యుయెల్‌, సాయికిరణ్‌, సుమంత్‌ అశ్విన్‌ వంటి వారు కంటెస్టెంట్లుగా ఆల్మోస్ట్ కన్ఫమ్‌ అయ్యారు. వీరితోపాటు టీవీ నటి కావ్య శ్రీ పేరు వినిపిస్తుంది. అలాగే వర్మ సినిమాలోని ఓ బోల్డ్ నటి రాబోతుందట. ఈ వివరాలు తెలియాల్సి ఉంది. వీరితోపాటు కామన్‌ మ్యాన్‌ కేటగిరి నుంచి ఈ సారి దాదాపు ఐదుగురుని కంటెస్టెంట్లుగా ఎంపిక చేయబోతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సారి కామన్‌ మ్యాన్ లను పెంచుతున్నట్టు సమాచారం.

55
నవరత్నాలుగా హౌజ్‌లోకి కంటెస్టెంట్లు
Image Credit : star maa promo

నవరత్నాలుగా హౌజ్‌లోకి కంటెస్టెంట్లు

నాగార్జున హోస్ట్ గా చేస్తున్న ఈ 9వ సీజన్‌ బిగ్‌ బాస్‌ తెలుగు సెప్టెంబర్‌ 7న గ్రాండ్‌గా ప్రారంభానికి ప్లాన్‌ చేస్తున్నారు. ప్రస్తుతం సెట్‌ వర్క్ జరుగుతుంది. అన్నపూర్ణ సెవెన్‌ ఎకర్స్ లో దీని కోసం ప్రత్యేకంగా సెట్‌ వేశారు. ఇప్పుడు ఆ సెట్‌ని సరికొత్తగా తీర్చిదిద్దుతున్నారు. ఈ సారి హౌజ్‌లో సరికొత్త ట్విస్ట్ లు ఉండబోతున్నాయట. పలు క్రేజీ గేమ్స్ ప్లాన్‌ చేస్తున్నారట. అలాగే 18 మంది కంటెస్టెంట్లని తొమ్మిది జంటలుగా చేసి హౌజ్‌లోకి పంపిస్తారని, జాతిరత్నాలు మాదిరిగా నవరత్నాలుగా వారిని పిలవబోతున్నారని సమాచారం. వైల్డ్ కార్డ్ ద్వారా మరో నలుగురు కంటెస్టెంట్లు వచ్చే అవకాశం ఉందని, ఈ సారి మొత్తంగా 22 మంది కంటెస్టెంట్లకి స్కోప్‌ ఉందని సమాచారం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
రియాలిటీ కార్యక్రమాలు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Allari Naresh: మూడు నెలలు బెడ్ రూమ్ నుంచి బయటకు రాని హీరో, పని మనిషి తెస్తేనే భోజనం..నితిన్ చెప్పాకే మారాడు
Recommended image2
Romanchakam Movie Review: రోమాంచకం మూవీ రివ్యూ.. సందీప్‌ రెడ్డి వంగా నిర్మించిన మూవీ ఎలా ఉందంటే?
Recommended image3
Chiranjeevi: సీనియర్ ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకు, ఆ ఫార్ములాకు తిరుగులేదు..పాపం రవితేజకి కోలుకోలేని దెబ్బ
Related Stories
Recommended image1
రాజమౌళి సినిమాకి మహేష్‌ బాబు పారితోషికం ఎంతో తెలుసా? జక్కన్న ప్లాన్‌ వేరే లెవల్‌
Recommended image2
`కూలీ` మూవీ క్రిటిక్‌ రివ్యూ, వామ్మో పూనకాలు తెప్పించే సర్‌ప్రైజ్‌ ఉందట.. రజనీ, నాగ్‌ వెండితెరపై రచ్చే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved