- Home
- Entertainment
- విజయ్ దేవరకొండ కోసం కొట్టుకున్న జాన్వీ, సారా అలీ ఖాన్... మధ్యలో దూరిన అనన్య పాండే... ఇదేం పోరు బాబోయ్!
విజయ్ దేవరకొండ కోసం కొట్టుకున్న జాన్వీ, సారా అలీ ఖాన్... మధ్యలో దూరిన అనన్య పాండే... ఇదేం పోరు బాబోయ్!
కాఫీ విత్ కరణ్ మోస్ట్ కాంట్రవర్షియల్ షో అని చెప్పాలి. బోల్డ్ ప్రశ్నలతో గెస్ట్స్ ని ఇరుకున పెట్టడం హోస్ట్ కరణ్ జోహార్ కి అలవాటైపోయింది. ఈ క్రమంలో ఈ షోపై అనేక వివాదాలు, విమర్శలు కూడా వచ్చాయి.

Ananya Panday
ఆ మధ్య కరణ్ జోహార్ షోల పాల్గొన్న క్రికెటర్స్ కే ఎల్ రాహుల్, హార్దిక్ పాండే సెక్స్, విమెన్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ పర్యవసానంగా వారు బీసీసీఐ నుండి శిక్షను ఎదురుకొన్నారు. కొన్ని మ్యాచెస్ కి వాళ్ళను నిషేధించడం జరిగింది. ఎన్ని విమర్శలు వచ్చినా హోస్ట్ కరణ్ జోహార్ అసలు తగ్గడం లేదు. తాజాగా కాఫీ విత్ కరణ్ సీజన్ 7 మొదలైంది. లేటెస్ట్ సీజన్ ని ఆయన మరింత స్పైసీ గా నడిపిస్తున్నారు.
ఇక లేటెస్ట్ ఎపిసోడ్ లో లైగర్ స్టార్స్ విజయ్ దేవరకొండ, అనన్య పాండే పాల్గొన్నారు. షోలో నీకు చీజ్ అంటే ఇష్టమా? అని హోస్ట్ కరణ్ దేవరకొండను అడిగారు. దానికి ఏం సమాధానం చెప్పాలో దేవరకొండకు అర్థం కాలేదు. అప్పుడు గత ఎపిసోడ్ లో జరిగిన వీడియో ఫుటేజ్ కరణ్ చూపించారు. ఆ వీడియోలో విజయ్ దేవరకొండతో డేటింగ్ విషయంలో స్టార్ కిడ్స్ జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ గొడవపడ్డారు. విజయ్ నాకంటే నాకు అంటూ పోటీపడ్డారు.
ఆ వీడియో అనంతరం వారిద్దరిలో నువ్వు ఎవరితో డేట్ కి వెళ్లాలనుకుంటున్నావ్.. అని దేవరకొండను కరణ్ అడిగాడు. ఇద్దరూ యంగ్, గుడ్ లుకింగ్ గర్ల్స్ అని దేవరకొండ ఆన్సర్ చెప్పబోతుంటే... ముసలోడిలాగా మాట్లాడకు ఓపెన్ గా చెప్పు, అందులో తప్పులేదని కరణ్ దేవరకొండను ఇబ్బంది పెట్టాడు. విజయ్ దేవరకొండ స్పష్టమైన ఆన్సర్ ఇచ్చే లోపే మధ్యలో అనన్య దూరారు. తనకు కూడా దేవరకొండతో డేట్ కి వెళ్లాలని ఉందని కోరిక బయటపెట్టింది. విజయ్ దేవరకొండ కోసం ఈ స్టార్ కిడ్స్ గొడవడపడం ఆసక్తికరంగా మారింది.
అలాగే అనన్య పాండేకి రాపిడ్ ఫైర్ టెస్ట్ పెట్టిన కరణ్... తాను చెప్పిన స్టార్స్ రిలేషన్ షిప్ స్టేటస్ ఏమిటో చెప్పాలని ఆదేశించారు. ఈ టెస్ట్ లో అనన్య బాలీవుడ్ కి చెందిన కియారా, టైగర్ ష్రాఫ్, జాన్వీ కపూర్ లతో పాటు విజయ్ దేవరకొండ లవర్స్ పేర్లు పరోక్షంగా హింట్ ఇచ్చారు. టైగర్ ష్రాఫ్ లవర్ దిశా పటాని అని, కియారా హీరో సిద్ధార్థ్ మల్హోత్రా లవ్ లో ఉందని ఇక జాన్వీ మాత్రం సింగిల్ అని అనన్య పరోక్షంగా చెప్పింది ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తే ఆయన రష్మిక మందాన రిలేషన్ లో ఉన్నాడని అనన్య ఇండైరెక్ట్ హింట్ ఇచ్చింది. రాపిడ్ ఫైర్ లో అనన్య నిస్సంకోచంగా ఈ స్టార్స్ రిలేషన్షిప్ గురించి ఓపెన్ అయ్యింది.
చాలా కాలంగా రష్మిక, విజయ్ దేవరకొండ ప్రేమించుకుంటున్నారంటూ వార్తలు వస్తున్నాయి. విజయ్ దేవరకొండ ఇంట్లో జరిగే వేడుకలకు రష్మిక ఒక్కటే హాజరుకావడం, ముంబైలో అప్పుడప్పుడు వీరిద్దరూ జంటగా తిరగడం వంటి చర్యలు ఈ రూమర్స్ కి కారణమయ్యాయి. అయితే పలుమార్లు ఈ కథనాలను విజయ్ దేవరకొండ రష్మిక ఖండించారు.
కరణ్ షోలో సైతం విజయ్ దేవరకొండ రష్మిక తనకు మంచి ఫ్రెండ్ అంటూ చెప్పుకొచ్చారు. రష్మిక నాకు డార్లింగ్, ఆమె అంటే నాకు చాలా ఇష్టం. రష్మిక నాకు మంచి ఫ్రెండ్. మేమిద్దరం కలిసి రెండు చిత్రాలు చేశాం. అప్పటి నుండి ఈ రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆమెతో నటించిన తర్వాత మంచి బాండింగ్ ఏర్పడింది. అంతకు మించి మా ఇద్దరి మధ్య ఏమీ లేదని విజయ్ దేవరకొండ తెలియజేశారు.
అలాగే సెక్స్, లవ్, రిలేషన్ వంటి బోల్డ్ అంశాలపై విజయ్ దేవరకొండ ఈ షోలో స్పందించాడు. రష్మికతో పాటు ఓ విదేశీ అమ్మాయితో కూడా విజయ్ దేవరకొండ ఎఫైర్ నడిపినట్లు పుకార్లు ఉన్నాయి. మరోవైపు విజయ్ దేవరకొండ కెరీర్ పీక్స్ లో ఉంది. లైగర్ హిట్ అయితే ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన లైగర్ ఆగస్టు 25న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల కానుంది. లైగర్ మూవీలో విజయ్ ప్రొఫెషనల్ ఫైటర్ రోల్ చేస్తున్నారు. ఇక లైగర్ విడుదల కాకుండానే పూరి-విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో జనగణమన టైటిల్ తో మరి భారీ పాన్ ఇండియా మూవీ స్టార్ట్ అయ్యింది. ఈ మూవీలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్నారు. అలాగే శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి టైటిల్ తో ఓ మూవీ చేస్తున్నారు.