- Home
- Entertainment
- Shivathmika Rajashekar: చీర కట్టులో సెగలు రేపుతున్న శివాత్మిక... స్టార్ కిడ్ గ్లామరస్ లుక్ వైరల్
Shivathmika Rajashekar: చీర కట్టులో సెగలు రేపుతున్న శివాత్మిక... స్టార్ కిడ్ గ్లామరస్ లుక్ వైరల్
చీర కట్టులో కూడా గుండెల్లో సెగలు రేపింది శివాత్మిక. ఆమె కొంటె పోజులు మనసును తట్టి లేపాయి. శివాత్మిక గ్లామరస్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.

Shivathmika Rajashekar
అచ్చ తెలుగు హీరోయిన్ శివాత్మిక సోషల్ మీడియా సెన్సేషన్ గా మారుతున్నారు. తనలోని గ్లామర్ యాంగిల్ పరిచయం చేస్తూ నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ యంగ్ బ్యూటీ అటు ట్రెడిషనల్ గా ఇటు ట్రెండీగా మైమరిపిస్తున్నారు.
Shivathmika Rajashekar
తాజాగా చీర కట్టి ప్రకృతివనంలో హొయలు పోయింది. సాంప్రదాయ కట్టులో శివాత్మిక సోయగాలు మైమరిపిస్తున్నాయి. శివాత్మిక లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు.
Shivathmika Rajashekar
ఇక శివాత్మిక కెరీర్ పరిశీలిస్తే... ఆమె కీలక రోల్ చేసిన రంగమార్తాండ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రకాష్ రాజ్-రమ్యకృష్ణల కూతురు పాత్రలో ఆమె అలరించారు.
Shivathmika Rajashekar
రంగమార్తాండ మూవీలో శివాత్మిక పాత్రకు ప్రశంసలు దక్కాయి. రంగమార్తాండ మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంది. అయితే కలెక్షన్స్ రాలేదు. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన రంగమార్తాండలో అనసూయ సైతం కీలక రోల్ చేశారు.
Shivathmika Rajashekar
గత ఏడాది శివాత్మిక నటించిన ప్రయోగాత్మక చిత్రం పంచతంత్రం విడుదలైంది. పంచతంత్రం చిత్రానికి ప్రేక్షకాదరణ దక్కలేదు. అలాగే ఆకాశం టైటిల్ తో విడుదలైన తమిళ డబ్బింగ్ మూవీ కూడా ఆడలేదు. కాగా తమిళంలో కూడా శివాత్మికకు ఆఫర్స్ వస్తున్నాయి. ఏక కాలంలో రెండు పరిశ్రమల్లో శివాత్మిక అదృష్టం పరీక్షించుకుంటున్నారు.
Shivathmika Rajashekar
చెప్పాలంటే శివాత్మికకు బ్రేక్ ఇచ్చే మూవీ ఇంకా పడలేదు. హీరో రాజశేఖర్-జీవిత వారసురాలిగా శివాత్మిక వెండితెరకు పరిచయమయ్యారు. 2019లో విడుదలైన దొరసాని ఆమె మొదటి చిత్రం.ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ పాజిటివ్ టాక్ అందుకుంది. అయితే కమర్షియల్ గా ఆడలేదు. అయితే శివాత్మిక నటనకు ప్రశంసలు దక్కాయి.
Shivathmika Rajashekar
ఈ యంగ్ బ్యూటీ కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. శివాత్మిక అక్క శివాని సైతం హీరోయిన్ అయ్యారు. ఆమె కూడా స్ట్రగుల్ అవుతున్నారు. అక్కతో పోల్చితే చెల్లి కొంచెం బెటర్. గుర్తింపు తెచ్చుకున్నారు. చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్స్ దక్కించుకుంటున్నారు.