Pooja Hegde: మహేష్, చరణ్, ప్రభాస్... 2022లో సందడి మొత్తం పూజా హెగ్డేదే!
వరుస హిట్స్ తో పూజా హెగ్డే (Pooja Hegde)ఫేమ్ ఎవరెస్ట్ కి చేరింది. బాలీవుడ్ టు కోలీవుడ్ అమ్మడు దున్నేస్తుంది. అల వైకుంఠపురంలో , మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రాలతో సూపర్ ఫార్మ్ లో ఉన్న పూజా 2022 కోసం క్రేజీ ప్రాజెక్ట్స్ సిద్ధం చేసింది. ఈ ఏడాది పూజా హెగ్డే నుండి రానున్న చిత్రాలేమిటో చూద్దాం..

ప్రభాస్ (Prabhas)నాలుగవ పాన్ ఇండియా చిత్రం రాధే శ్యామ్. దాదాపు మూడేళ్ళుగా ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. దర్శకుడు రాధాకృష్ణ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. రాధే శ్యామ్ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కావాల్సి ఉంది. వైరస్ విజృంభణతో వాయిదా పడింది. ఇక రాధే శ్యామ్ విడుదలపై త్వరలో క్లారిటీ రానుంది.
కోలీవుడ్ టాప్ స్టార్ గా ఉన్నారు విజయ్. ఆయన లేటెస్ట్ మూవీ బీస్ట్. డాక్టర్ మూవీతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బీస్ట్ (Beast) మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా సమ్మర్ కానుకగా విడుదల కానుంది.
మెగాస్టార్ చిరంజీవి-రామ్ చరణ్ ల మల్టీస్టారర్ గా తెరకెక్కుతుంది ఆచార్య(Acharya). విడుదలకు సిద్దమైన ఈ మూవీ ఫిబ్రవరి 4న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఆచార్య మూవీలో పూజాహ్ హెగ్డే చరణ్ కి జంటగా నటిస్తున్నారు. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పోస్ట్ ఫోన్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.
బాలీవుడ్ మాస్ చిత్రాలు దర్శకుడు రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న చిత్రం సర్కస్. రణ్వీర్ సింగ్ హీరోగా నటిస్తుండగా పూజా హెగ్డే జతకడుతున్నారు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సర్కస్ చిత్రం జులై లో విడుదల కానుంది.
సల్మాన్ ఖాన్ (Salman Khan)హీరోగా తెరకెక్కుతుంది భాయ్ జాన్. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న భాయ్ జాన్ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపికయ్యారు.
కాగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఫేవరేట్ హీరోయిన్ గా మారిపోయారు పూజా హెగ్డే. ఆయన గత రెండు చిత్రాలు అరవింద సమేత వీరరాఘవ, అల వైకుంఠపురంలో చిత్రాలలో పూజా హీరోయిన్ నటించారు. పూజాకు బ్రేక్ ఇచ్చిన త్రివిక్రమ్ తన నెక్స్ట్ మూవీ మహేష్ తో ప్రకటించారు. ఈ మూవీలో కూడా పూజా హెగ్డే హీరోయిన్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
పూజా హెగ్డే హిట్ పర్సెంటేజ్ రీత్యా... అమ్మడు భారీగా రెమ్యూనరేషన్ పెంచేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఏకంగా రూ. 3.5 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారట. సౌత్ లో టాప్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా పూజా రికార్డులకు ఎక్కినట్లు సమాచారం.