- Home
- Entertainment
- ఆ స్టార్ డైరెక్టర్ వైఫ్ ఎన్టీఆర్‌ని `బండ` అని పిలుస్తుందా?.. ఎంత క్లోజ్ అయితే మాత్రం ఆ మాట అంటుందా?
ఆ స్టార్ డైరెక్టర్ వైఫ్ ఎన్టీఆర్‌ని `బండ` అని పిలుస్తుందా?.. ఎంత క్లోజ్ అయితే మాత్రం ఆ మాట అంటుందా?
ఎన్టీఆర్ ఇప్పుడు స్టార్ హీరో రేంజ్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా ఎదుగుతున్నాడు. ఈ స్థాయిలో ఉన్న ఆయన్ని స్టార్ డైరెక్టర్ వైఫ్ మాత్రం `బండ` అని పిలుస్తుందట. మరి ఆమె ఎవరు ?

ఎన్టీఆర్‌కి రాజమౌళి ఫ్యామిలీకి మధ్య మంచి అనుబంధం ఉంది. తారక్‌ని తమ ఫ్యామిలీలో మెంబర్‌గా భావిస్తుంటారు. అంతటి క్లోజ్ రిలేషన్ ఉంటుంది. `స్టూడెంట్ నెం 1` నుంచి ట్రావెల్ అవుతున్నారు కాబట్టి ఆ మాత్రం క్లోజ్ ఉంటుంది. అంతేకాదు రాజమౌళి చేసిన సినిమాల్లో ఎక్కువగా ఎన్టీఆర్‌తోనే ఉన్నాయి.
ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్‌లో `స్టూడెంట్ నెం 1`, `సింహాద్రి`, `యమదొంగ`, `ఆర్‌ఆర్‌ఆర్` చిత్రాలున్నాయి. ఇది రాజమౌళితోనే కాదు, వారి ఫ్యామిలీతోనూ క్లోజ్ రిలేషన్ ఏర్పడ్డానికి కారణమవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే రాజమౌళి సినిమాకి వాళ్ల ఫ్యామిలీ అంతా పనిచేస్తుంది. రాజమౌళి కొడుకు కార్తికేయ లైన్ ప్రొడ్యూసర్‌గా, ఎగ్జిక్యూటివ్‌గా ఉంటాడు, అలాగే కీరవాణి సంగీతం అందిస్తారు, రమా రాజమౌళి కాస్ట్యూమ్స్ చూసుకుంటారు. వల్లీ కూడా అదే పనిలో ఉంటుంది. కాళభైరవ మ్యూజిక్‌లో భాగమవుతుంటాడు. ఇలా ఫ్యామిలీ ప్యాక్‌గా పని చేస్తుంటారు.
అయితే రాజమౌళి భార్య రమా రాజమౌళి ఎన్టీఆర్‌ని ఓ ముద్దు పేరుతో పిలుస్తుందట. అయితే అది మామూలు వ్యక్తులకు అయితే ఓకే, కానీ ఓ పాన్ ఇండియా స్టార్‌ని అలా పిలవడమే ఆశ్చర్యపరిచే విషయం. ఇంతకి ఏమని పిలుస్తుందో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. నలభై ఏళ్లు దాటిన ఎన్టీఆర్‌ని.. రాజమౌళి వైఫ్.. `బండ` అని పిలుస్తుందట.
ఓ ఇంటర్వ్యూలో తారక్ ఈ విషయాన్ని వెల్లడించారు. రాజమౌళి పెట్టే బాధలను చెప్పుకుంటూ.. `ఆర్‌ఆర్‌ఆర్`లో జరిగిన సంఘటనలను పంచుకున్నారు తారక్. అమ్మ చూడు అమ్మ సావగొడుతున్నాడు, నలిపేవాడమ్మా అంటే.. `వెళ్లురా బంగారం, త్వరగా వెళ్రా.. నన్ను బండ అంటుంది. వెళ్లురా బండ త్వరగా వెళ్లు, అయిపోతుంది పో, ఆ పిచ్చోడితో త్వరగా చేయించుకుని వెళ్లిపోదాం` అని అంటుందట రమా రాజమౌళి. దీంతో దెబ్బకి తారక్‌కి ఫ్యూజులు ఎగిరిపోయినంత పని అవుతుందట.
NTR - Rajamouli
`ఆర్‌ఆర్‌ఆర్` సినిమా సమయంలో ఇచ్చిన కామన్ ఇంటర్వ్యూలో ఈ విషయాలను ఎన్టీఆర్ వెళ్లడించారు. అలా రమా రాజమౌళి తనని బండా అని పిలుస్తుందని చెప్పాడు తారక్. అయితే అలా పిలవడం ఎన్టీఆర్‌కి సమస్య లేదు, వాళ్లకి ప్రాబ్లమ్ లేదు, కానీ ఓ పెద్ద స్టార్ హీరోని పట్టుకుని అలా `బండ` అంటూ పిలవడమే అభిమానులు జీర్ణించుకోలేని విధంగా ఉందని చెప్పొచ్చు. మరి ఇది ఇప్పటికీ కొనసాగుతుందా అనేది తెలియాల్సి ఉంది.
ఇక `ఆర్‌ఆర్‌ఆర్` లో ఎన్టీఆర్‌తోపాటు రామ్ చరణ్ కూడా నటించారు. ఇది పెద్ద హిట్ అయ్యింది. ప్రస్తుతం ఎన్టీఆర్ `దేవర` చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో తారక్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అక్టోబర్ 10న దీన్ని రిలీజ్ చేయబోతున్నారు. అయితే సెప్టెంబర్ 27న విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.