MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Rajamouli: ఇక నుంచి రాజమౌళి హాలీవుడ్ డైరెక్టర్, సినిమా పుట్టిన దేశంలో జక్కన్నకు అరుదైన గౌరవం..

Rajamouli: ఇక నుంచి రాజమౌళి హాలీవుడ్ డైరెక్టర్, సినిమా పుట్టిన దేశంలో జక్కన్నకు అరుదైన గౌరవం..

SS Rajamouli: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. దర్శకధీరుడు రాజమౌళి కి ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు సరసన జక్కన్నకు స్థానం లభించింది. ఇక నుంచి టాలీవుడ్, బాలీవుడ్ కాదు.. రాజమౌళి హాలీవుడ్ డైరెక్టర్.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 02 2026, 08:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రాజమౌళి కి అంతర్జాతీయ స్థాయి గౌరవం
Image Credit : instagram.com/ssrajamouli

రాజమౌళి కి అంతర్జాతీయ స్థాయి గౌరవం

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కి అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం లభించింది. ప్రపంచ చలనచిత్ర చరిత్రలో విశిష్ట స్థానాన్ని కలిగిన ఫ్రాన్స్‌లోని లయోన్ నగరంలో ఉన్న  ఇన్‌స్టిట్యూట్ లుమియర్ రాజమౌళిని ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా అక్కడి 'వాల్ ఆఫ్ ఫిల్మ్‌మేకర్స్'పై ఆయన పేరుతో శాశ్వత స్మారక ఫలకాన్ని ప్రతిష్ఠించింది. ఈ గౌరవంతో ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు మార్టిన్ స్కోర్సెస్సీ, క్లింట్ ఈస్ట్‌వుడ్, క్వెంటిన్ టరంటినో, ఫ్రాన్సిస్ ఫోర్డ్ కపోలా వంటి దిగ్గజాల సరసన రాజమౌళి పేరు కూడా చేరింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రాజమౌళి కి సర్ ప్రైజ్ ఇచ్చిన హాలీవుడ్..
Image Credit : instagram.com/ssrajamouli

రాజమౌళి కి సర్ ప్రైజ్ ఇచ్చిన హాలీవుడ్..

భారతీయ దర్శకుడిగా ఆయనకు దక్కిన ఈ గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచింది. జూలై 1, 2 తేదీల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం అనంతరం రాజమౌళి తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ, "లుమియర్ మ్యూజియంను సందర్శించే అవకాశం నాకు లభించింది. అక్కడ నా సినిమాలు 'ఈగ', 'ఆర్ఆర్ఆర్' ప్రదర్శితమవుతున్న స్క్రీనింగ్ రూమ్‌కు వెళ్లిన సమయంలో ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ థియరీ ఫ్రెమాక్స్ నన్ను ప్రేక్షకులకు పరిచయం చేశారు. అనంతరం నాకు ఒక సర్‌ప్రైజ్ ఉందని చెప్పి సినిమా పుట్టిన వీధికి తీసుకెళ్లారు" అని వివరించారు.

Related Articles

Related image1
Horror thriller OTT: బాక్సాఫీస్‌ను షేక్ చేసిన హారర్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలో, కానీ ట్విస్ట్ ఏంటంటే?
Related image2
Age Gap: ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకు 30 ఏళ్ల చిన్న హీరోయిన్లతో ఘాటు రొమాన్స్ చేసిన హీరోలు వీరే?
35
దర్శకధీరుడి ఎమోషనల్ కామెంట్స్..
Image Credit : instagram.com/ssrajamouli

దర్శకధీరుడి ఎమోషనల్ కామెంట్స్..

జక్కన్న మాట్లాడుతూ.. ''ఆ వీధిలో నడుస్తుండగా.. ప్రపంచ ప్రఖ్యాత దర్శకుల పేర్లతో ఉన్న శాశ్వత ఫలకాలను చూపించారు. తర్వాత ఎరుపు రంగు వస్త్రంతో కప్పి ఉంచిన మరో ఫలకాన్ని థియరీ ఫ్రెమాక్స్ ఆవిష్కరించారు. అదిచూసి నమ్మలేకపోయాను. ఆ ఫలకంపై నా పేరు కనిపించగానే ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాను. ఈ అరుదైన గౌరవానికి వినమ్రంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను" అని ఆయన పేర్కొన్నారు.

45
జక్కన్న ఖాతాలో గౌరవాలెన్నో..
Image Credit : instagram.com/ssrajamouli

జక్కన్న ఖాతాలో గౌరవాలెన్నో..

ఇప్పటికే జక్కన్న ఖాతాలో ఎన్నో అంతర్జాతీయ గౌరవాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ తో తెలుగు సినిమాకు ఆస్కార్ సాధించిన జక్కన్న.. గ్రామీ అవార్డుతో పాటు పలు అంతర్జాతీయ అవార్డులు తెలుగు పరిశ్రమకు అందించారు. అంతకు మించి ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా అన్న రేంజ్ కు ఇండస్ట్రీ వెళ్లడానికి రాజమౌళి నే కారణం. ఇక ఇటీవలే ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ప్రముఖ సినీమాథెక్ ఫ్రాన్సైస్ థియేటర్‌లో రాజమౌళి పేరుతో ఒక శాశ్వత సీటును కేటాయించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇన్‌స్టిట్యూట్ లుమియర్ అందించిన ఈ తాజా గౌరవంతో ఆయన అంతర్జాతీయ గుర్తింపు మరింత పెరిగింది.

55
ఇన్‌స్టిట్యూట్ లుమియర్ లో రాజమౌళి సినిమాల ప్రదర్శన
Image Credit : others

ఇన్‌స్టిట్యూట్ లుమియర్ లో రాజమౌళి సినిమాల ప్రదర్శన

ఇక జూన్ చివరి వారం నుంచి జూలై మధ్య వరకు ఇన్‌స్టిట్యూట్ లుమియర్ రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' వంటి సినిమాలతో ప్రత్యేక రెట్రోస్పెక్టివ్ ప్రదర్శనలను నిర్వహిస్తోంది. ఈ ప్రదర్శనల ద్వారా ఆయన సినిమాలను అంతర్జాతీయ ప్రేక్షకులకు మరోసారి పరిచయం చేస్తోంది. ప్రస్తుతం రాజమౌళి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో.. దాదాపు 1500 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈసినిమాతో రాజమౌళి ఇంకెన్ని రికార్డులు బ్రేక్ చేస్తాడో చూడాలి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఎస్.ఎస్. రాజమౌళి
మహేష్ బాబు ఘట్టమనేని
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Pakash Raj: నాలుగు రాష్ట్రాల్లో నాలుగు ఓటర్ ఐడీలు, ప్రకాష్ రాజ్ అరెస్ట్ .. నాన్ బెయిలబుల్ వారెంట్
Recommended image2
Vijay London Trip: బ్రిటన్‌లో ఫ్యామిలీ రీయూనియన్? భార్య సంగీతను కలవనున్న సీఎం విజయ్?
Recommended image3
Duniya Vijay Divorce: భార్యకి విడాకులు ఇచ్చిన బాలయ్య విలన్‌, భరణం కింద 2 కోట్లు.. మరో కండీషన్‌ కూడా
Related Stories
Recommended image1
Horror thriller OTT: బాక్సాఫీస్‌ను షేక్ చేసిన హారర్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలో, కానీ ట్విస్ట్ ఏంటంటే?
Recommended image2
Age Gap: ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకు 30 ఏళ్ల చిన్న హీరోయిన్లతో ఘాటు రొమాన్స్ చేసిన హీరోలు వీరే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved