MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Horror thriller OTT: బాక్సాఫీస్‌ను షేక్ చేసిన హారర్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలో, కానీ ట్విస్ట్ ఏంటంటే?

Horror thriller OTT: బాక్సాఫీస్‌ను షేక్ చేసిన హారర్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలో, కానీ ట్విస్ట్ ఏంటంటే?

బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించిన 'అబ్సెషన్' సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. జూలై 14న ఈ సినిమా డీవీడీ, బ్లూ-రే, 4K UHD వెర్షన్లను కూడా రిలీజ్ చేయనున్నారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 02 2026, 08:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సూపర్‌ న్యాచురల్ థ్రిల్లర్ 'అబ్సెషన్
Image Credit : others

సూపర్‌ న్యాచురల్ థ్రిల్లర్ 'అబ్సెషన్

యూట్యూబర్ కరి బార్కర్ దర్శకత్వం వహించిన సూపర్‌న్యాచురల్ థ్రిల్లర్ 'అబ్సెషన్' బాక్సాఫీస్ దగ్గర పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 370 మిలియన్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఈ బ్లాక్‌బస్టర్ హారర్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ ప్లాట్‌ఫామ్‌లలో మూవీ ఉంది. కానీ ట్విస్ట్ ఏంటంటే.. ఈ సినిమాను ఫ్రీగా చూసే అవకాశం లేదు. మూవీను అద్దెకు తీసుకోవచ్చు లేదా కొనుగోలు చేయొచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అబ్సెషన్ మూవీని కొనాలంటే..?
Image Credit : youtube

అబ్సెషన్ మూవీని కొనాలంటే..?

ప్రముఖ మీడియా సంస్థ 'వెరైటీ' కథనం ప్రకారం, ఈ సినిమాను కొనుగోలు చేయాలంటే 24.99 (సుమారు 2,085 రూపాయలు) డాలర్లు అద్దెకు తీసుకోవాలంటే 19.99 డాలర్లు (సుమారు 1,670 రూపాయలు) చెల్లించాలి. ఈ డిజిటల్ రిలీజ్‌తో పాటు, సినిమా మేకింగ్ వీడియోలు, డైరెక్టర్ కరి బార్కర్ కామెంటరీ లాంటి బోనస్ కంటెంట్ కూడా అందిస్తున్నారు.

Related Articles

Related image1
CM Vijay Vs Suriya: విజయ్ దళపతికి పోటీగా సూర్య, స్టార్ హీరో పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడో తెలుసా? నిజమెంత?
Related image2
Trisha: డిప్యూటీ సీఎంగా త్రిష ? రూట్ క్లియర్ చేసిన రాఘవ లారెన్స్, అసలేం జరుగుతోంది?
35
బాక్సాఫీస్ దగ్గర ఎంత వసూలు చేసిందంటే?
Image Credit : People

బాక్సాఫీస్ దగ్గర ఎంత వసూలు చేసిందంటే?

ఈ సినిమాకు సంబంధించిన డీవీడీ, బ్లూ-రే, 4K UHD వెర్షన్లను జూలై 14న మార్కెట్లోకి విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా, త్వరలోనే ఈ సినిమా 'పీకాక్' స్ట్రీమింగ్ సర్వీస్‌లో కూడా అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. 'ఫోకస్ ఫీచర్స్' సంస్థ మే 15న 'అబ్సెషన్' సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసింది. ఇది ఊహించని విధంగా భారీ విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా $370 మిలియన్లకు పైగా కలెక్ట్ చేసి, 'ఫోకస్ ఫీచర్స్' చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది.

45
అబ్సెషన్ సినిమా కథేంటి? నటీనటులు ఎవరు?
Image Credit : Movie Stills

అబ్సెషన్ సినిమా కథేంటి? నటీనటులు ఎవరు?

26 ఏళ్ల అతి చిన్న వయసున్న యూట్యూబర్ అయిన కరి బార్కర్ ఈ సినిమాకు కథ రాసి, దర్శకత్వం వహించారు. బేర్ (మైకెల్ జాన్‌స్టన్) అనే కుర్రాడు, తాను ఇష్టపడే అమ్మాయి తనను ప్రేమించేలా చేయడానికి 'వన్ విష్ విల్లో' అనే ఓ మ్యాజికల్ వస్తువును వాడతాడు. కానీ, అతని కోరిక కాస్తా బెడిసికొట్టి, భయంకరమైన మలుపు తీసుకుంటుంది. అతని క్రష్ నిక్కీ (ఇండే నవరెట్టె) అతనికి ప్రమాదకరంగా అతుక్కుపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేదే సినిమా కథ అని 'వెరైటీ' వివరించింది. ఈ చిత్రంలో కూపర్ టామ్లిన్‌సన్, మేగన్, ఆండీ రిక్టర్ కూడా కీలక పాత్రల్లో నటించారు.

55
భారీ విజయానికి కారణం ఏంటి?
Image Credit : Prime Video

భారీ విజయానికి కారణం ఏంటి?

రిపోర్టుల ప్రకారం, ఈ సినిమాను కేవలం 750,000 డాలర్ల బడ్జెట్‌తో నిర్మించారు. టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోని 'మిడ్‌నైట్' విభాగంలో సినిమాను ప్రదర్శించిన తర్వాత, 'ఫోకస్ ఫీచర్స్' సంస్థ 15 మిలియన్ డాలర్లకు పైగా చెల్లించి హక్కులను కొనుగోలు చేసిందని 'డెడ్‌లైన్' వెల్లడించింది. యూట్యూబ్ క్రియేటర్ కరి బార్కర్ తొలిసారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం, SXSW సహా పలు ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమైంది. అక్కడి నుంచి వచ్చిన పాజిటివ్ టాక్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా మౌత్ టాక్ బలంగా ఉండటంతో, అన్ని వయసుల ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
భయపెడుతూ నవ్వించి, 180 కోట్లు కొల్లగొట్టిన హారర్ సినిమా.. ఓటీటీలో ఇప్పటికీ ట్రెండింగే!
Recommended image2
Ram Charan: 30 ఏళ్ల వయసులో రామ్ చరణ్ చేసిన పనికి.. నిర్మాత బండ్ల గణేష్ కు కన్నీళ్లు ఆగలేదు.. ఏం జరిగింది?
Recommended image3
Allu Arjun: దేనికి పనికిరాడని అల్లు అర్జున్ కి 10 లక్షలు ఇన్సురెన్స్ చేయించింది ఎవరు? 4th క్లాస్ లోనే తేలిపోయిందా?
Related Stories
Recommended image1
CM Vijay Vs Suriya: విజయ్ దళపతికి పోటీగా సూర్య, స్టార్ హీరో పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడో తెలుసా? నిజమెంత?
Recommended image2
Trisha: డిప్యూటీ సీఎంగా త్రిష ? రూట్ క్లియర్ చేసిన రాఘవ లారెన్స్, అసలేం జరుగుతోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved