- Home
- Entertainment
- ప్రభాస్ ‘వర్షం’ సినిమాపై రాజమౌళికి ఎలాంటి ఒపీనియన్ ఉందో తెలుసా? డార్లింగ్ మొహం పట్టుకొని చెప్పిన జక్కన్న
ప్రభాస్ ‘వర్షం’ సినిమాపై రాజమౌళికి ఎలాంటి ఒపీనియన్ ఉందో తెలుసా? డార్లింగ్ మొహం పట్టుకొని చెప్పిన జక్కన్న
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కెరీర్ ను మలుపు తిప్పిన చిత్రం ‘వర్షం’. అయితే ఈ సినిమాపై ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli)కి ఓ అభిప్రాయం ఉండింది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. చివరిగా డార్లింగ్ ‘సలార్’ (Salaar) తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించారు.
‘సలార్’ (Salaar Part 1) సక్సెస్ తర్వాత ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంతో రాబోతున్నారు. ఇక Kalki 2898 AD మూవీ పాన్ వరల్డ్ గా రూపుదిద్దుకుంటోంది. ఈ ప్రాజెక్ట్ పై ఫ్యాన్స్ తోపాటు నార్మల్ ఆడియెన్స్ లో అంచనాలు నెలకొన్నాయి.
త్వరలో ప్రభాస్ అప్ కమింగ్ ఫిల్మ్స్ నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి. ఇదిలా ఉంటే.. డార్లింగ్ కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ప్రభాస్ - రాజమౌళితో మాట్లాడిన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఆ వీడియోలో ‘వర్షం’ సినిమాపై జక్కన్నకు ఎలాంటి అభిప్రాయం ఉండేదో స్వయంగా డార్లింగే చెప్పారు.
‘వర్షం’ సినిమా మొత్తం అమ్మాయి వెనకాల అబ్బాయి తిరగడం ఏంటీ? అసలు అలాంటి కథలు రాయడం తనకు ఏమాత్రం నచ్చదని డార్లింగ్ కు రాజమౌళి చెప్పారంట.
లవ్ స్టోరీల కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయో తనకు పెద్దగా తెలియదని, అందుకే పూర్తిగా లవ్ కథలను డైరెక్ట్ చేయలేనని చెప్పారంట. ఈ విషయాన్ని డార్లింగ్ ఆ వీడియోలు చెప్పడం ఆసక్తికరంగా మారింది.