- Home
- Entertainment
- శ్రీనివాస సాయి బిగ్ బాస్ పారితోషికం ఎంతో తెలుసా? నాలుగు వారాలు హౌజ్‌లో ఉన్నందుకు దక్కింది ఇదే
శ్రీనివాస సాయి బిగ్ బాస్ పారితోషికం ఎంతో తెలుసా? నాలుగు వారాలు హౌజ్‌లో ఉన్నందుకు దక్కింది ఇదే
బిగ్ బాస్ తెలుగు 9 ఆదివారం శ్రీనివాస సాయి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. నాలుగు వారాలు హౌజ్‌లో ఉన్న శ్రీనివాస సాయి ఎంత పారితోషికం తీసుకున్నారనేది తెలుసుకుందాం.

తొమ్మిదో శ్రీనివాస్ సాయి ఎలిమినేట్
బిగ్ బాస్ తెలుగు 9 తొమ్మిదో వారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. రాము రాథోడ్ స్వతహాగా ఎలిమినేట్ కావడంతో రెగ్యూలర్‌గా ఆదివారం మరో ఎలిమినేషన్ జరిగింది. అందులో భాగంగా శ్రీనివాస సాయి హౌజ్‌ని వీడాల్సి వచ్చింది. ఎలిమినేషన్‌కి సంబంధించి చివర్లో భరణి, శ్రీనివాస సాయి మిగిలారు. ఎవరు వెళ్తారని ఇద్దరి మధ్య తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఊహించినట్టుగానే శ్రీనివాస సాయిని ఎలిమినేట్ చేశారు. దీంతో అంతా ఆశ్చర్యపోయారు. ఇప్పటికే రాము రాథోడ్ ఎలిమినేట్ అయిన నేపథ్యంలో శ్రీనివాస సాయి ఎలిమినేషన్ ఉండదేమో అని హౌజ్ మేట్స్ భావించారు. కానీ అవేవీ లేకుండా ఆయన్ని ఎలిమినేట్ చేయడం గమనార్హం.
శ్రీనివాస సాయి పారితోషికం
ఇక టీవీ, సినిమా ఆర్టిస్ట్ అయిన శ్రీనివాస సాయి వైల్డ్ కార్డ్ ద్వారా హౌజ్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఐదో వారం నిర్వహించిన వైల్డ్ ఎంట్రీ ఈవెంట్‌లో ఆరుగురిలో ఒకరిగా సాయి బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్‌లోకి అడుగుపెట్టాడు. దాదాపు నాలుగు వారాలపాటు హౌజ్‌లో ఉన్నారు. నాలుగు వారాలకు గానూ ఆయనకు ఎనిమిది లక్షల పారితోషికం ఇచ్చినట్టు తెలుస్తోంది. వారానికి రెండు లక్షల చొప్పున పారితోషికం దక్కిందట. ఈ లెక్కన రోజుకి రూ.28-30వేల వరకు ఇచ్చినట్టు సమాచారం. ఇందులో నిజమెంతా అనేది తెలియాలి.
కంటెంట్ ఇవ్వడంలో ఫెయిల్ అయిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్
సెలబ్రిటీ కోటాలో బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీనివాస సాయి కంటెంట్ ఇవ్వడంలో వెనకబడ్డాడు. హౌజ్‌లో ఏమాత్రం యాక్టివ్‌గా కనిపించలేదు. ఓ రకంగా వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన ఏ ఒక్కరు కూడా ఆకట్టుకోలేకపోయాయి. దివ్వెల మాధురి నోటికొచ్చింది మాట్లాడి హౌజ్‌ని వీడాల్సి వచ్చింది. రమ్య మోక్ష గాసిప్‌లకు పరిమితమై వచ్చిన రెండో వారమే వెళ్లిపోయింది. అనారోగ్యంతో ఆయేషా జీనత్ హౌజ్‌ని వీడాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు నాల్గో వారం శ్రీనివాస సాయి వెళ్లిపోయారు. వీరితోపాటు గౌరవ్, నిఖిల్ కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్నారు. కంటెంట్ ఇవ్వడంలో విఫలమవుతున్నారు. నామినేషన్‌లో లేక సేవ్ అవుతున్నారు తప్పితే, వీళ్లు కూడా హౌజ్‌లో ఉండేందుకు అర్హులు కారనే విమర్శలు నెటిజన్ల నుంచి వినిపిస్తాయి.
నాగార్జున ఫ్యామిలీకి దగ్గరగా శ్రీనివాస సాయి
శ్రీనివాస సాయి టీవీ, సినీ నటుడిగా గుర్తుంపు తెచ్చుకున్నాడు. ఆయన పలు సీరియల్స్ లో నటించారు. అలాగే `గోల్కొండ హై స్కూల్` చిత్రంలోనూ నటించాడు. అంతకు ముందు నాగార్జున నటించిన `కేడీ` చిత్రంలో బాలనటుడిగా మెరిశాడు. అలాగే నాగ్‌తో `ఊపిరి` చిత్రంలోనూ కనిపించాడు. ఇలా ఎక్కువగా అక్కినేని సినిమాల్లో మెరిశాడు. దీంతో నాగ్ ఫ్యామిలీకి దగ్గరి వాడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఈ షో ద్వారా మరింత పాపులర్ కావాలని, ఎక్కువ మందికి రీచ్ కావాలని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. మంచి పేరు కాదు కదా, మరింత బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది. కంటెంట్ ఉన్నా, మనోడు బయటపెట్టకపోవడంతో అది ఆయనకే మైనస్‌గా మారింది, చివరికి ఎలిమినేషన్‌కి దారితీసింది.
డిసెంబర్ 21 గ్రాండ్ ఫినాలే?
ఇక బిగ్ బాస్ తెలుగు 9 ఇప్పుడు పదో వారానికి చేరుకుంది. ప్రస్తుతం హౌజ్‌లో సంజనా, భరణి, తనూజ, గౌరవ్, నిఖిల్, ఇమ్మాన్యుయెల్, రీతూ చౌదరీ, దివ్య, డీమాన్ పవన్, కళ్యాణ్, సుమన్ శెట్టి ఉన్నారు. వీరిలో టాప్ లోకి వెళ్లే ఐదుగురు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. తనూజ, ఇమ్మాన్యుయెల్, కళ్యాణ్, సుమన్ శెట్టి టాప్‌లో ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. డిసెంబర్ 21న గ్రాండ్ ఫినాలే జరగనుందని తెలుస్తోంది.