శ్రీలీల దెబ్బకు .. ఆ ముగ్గురు హీరోయిన్స్ కెరీర్స్ మటాష్
ప్రస్తుతం శ్రీలీల చేతిలో అరడజనుకుపైగా సినిమాలున్నాయి. పెళ్లిసందడి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ అమ్మడు వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తూ దూసుకుపోతుంది.

తెలుగులో సూపర్ స్టార్ హీరోయిన్ ఎవరూ అంటే కళ్లు మూసుకుని శ్రీలీల పేరే చెప్తారు. అంతలా ఆమె ధమాకా తర్వాత జనాల్లోకి వెళ్లిపోయింది. హీరోలు, డైరక్టర్స్, నిర్మాతలు ఒకరేమిటి అందరూ ఆమెనే కోరుకుంటున్నారు. కుర్రాళ్ల దగ్గర నుంచి కాటికి కాళ్లు చాపుకు కూర్చున్న పెద్దవాళ్ల వరకు ఈ బ్యూటీ పేరే తలుచుకుంటున్నారు. ఎంతలా అంటే ప్రస్తుతం శ్రీలీల చేతిలో 10 సినిమాలున్నాయి. అయితే ఆమె స్పీడులో బలైపోయిన హీరోయిన్స్ ఉన్నారు. వాళ్లు మరెవరో కాదు...
పూజా హెగ్డే గత కొంతకాలంగా తెలుగు పరిశ్రమను లిటరల్ గా శాసిస్తోంది. అయితే ఎప్పుడైతే శ్రీలీల ల్యాండ్ అయ్యిందో అప్పుడే సమస్య మొదలైంది. ఆమె ప్రాజెక్టులు మెల్లిగా శ్రీలీల దగ్గరు వెళ్లిపోతున్నాయి. రీసెంట్ గా గుంటూరు కారం సినిమా సైతం పూజ చేతిలోంచి శ్రీలీల దగ్గరకు వెళ్లిపోయంది.
పూజా హెగ్డేతో పది రోజులు పాటు గుంటూరు కారం సినిమా చేసారు. అయితే నిర్మాతలు శ్రీలల క్రేజ్ చూసి ఆమెను మెయిన్ హీరోయిన్ గా సీన్ లోకి తెచ్చారు. దాంతో తప్పనిసరిపరిస్దితిల్లోనూ లేక కోపగించో.. పూజ ఆ సినిమా వదిలేసి వెళ్లిపోయింది.
అక్కడితో అయ్యిందా పూజా హెగ్డే మరో ప్రాజెక్టు వదులుకోవాల్సి వచ్చింది. అదే ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా పవన్ ,హరీష్ శంకర్ కాంబినేషన్ లో భారీగా రూపొందుతోంది. మొదట ఈ సినిమాకు పూజ పేరునే హరీష్ ఎనౌన్స్ చేసారు. అది లాంచింగ్ కు ముందే జరిగింది. కానీ ఇప్పుడు శ్రీలల సైలెంట్ గా వచ్చి షూటింగ్ చేసుకుని వెళ్తోంది. పవన్ తో ఆమె ఫస్ట్ షెడ్యూల్ పూర్తైంది.
ఇక్కడితో అవ్వలేదు...శ్రీలీల ఇంపాక్ట్....కృతి శెట్టిపై పడింది. ఉప్పెనతో కుర్రాళ్ల గుండెళ్లో ఉప్పెనలా దూసుకుపోయిన ఆమెకు శ్రీలీల వలన డైరక్ట్ గా దెబ్బ పడలేదు. కానీ కొత్త సినిమాలు ఏమీ సైన్ చెయ్యలేదు. శ్రీలీల జోరుకే ఆమె ప్రక్కకు తప్పుకోవాల్సి వచ్చిందనేది మాత్రం నిజం. శ్రీలీల కారణం కాకపోయినా కీర్తి కిట్టీలో వరసగా నాలుగు డిజాస్టర్స్ ఉన్నాయి. వరుసగా వస్తున్న పరాజయాలకు తన అందంతో చెక్ పెట్టేందుకు మరిన్ని ఆఫర్స్ అందుకునేందుకు కృతి శెట్టి పరువాలు ఒలకబోస్తోంది.
Photo Courtesy: Instagram
వీళ్లందరిదీ ఒకెత్తు..రష్మికది మరొక ఎత్తు. నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న ఆమె తెలుగులో భీబత్సమైన క్రేజ్ ఉంది. అయితేనేం వరసగా బారీ ఆఫర్స్ రావటం లేదు. స్టార్ హీరోలు పవన్, మహేష్ వంటి హీరోలు శ్రీలీల వైపు చూస్తున్నారు. దాంతో నితిన్ తో రెయిన్ బో అనే సినిమా రీసెంట్ గా సైన్ చేసింది. అల్లు అర్జున్ సరసన పుష్ప 2 చేస్తోంది. పుష్ప 2 అనేది సీక్వెల్ కాకుండా కొత్త సినిమా అయితే ఖచ్చితంగా శ్రీలీల ఉండేదని అంటున్నారు.
ఇక సాధారణంగా ఓ హీరోయిన్ చేతిలో 2-3 మూవీస్ ఉండటం చాలా గొప్ప. అలాంటిది వరస పెట్టి ఇన్ని సినిమాలంటే ఆశ్చర్యమే. అవును శ్రీలీలకు ఒకటి రెండు కాదు చాలా అంశాలు కలిసొచ్చాయి. దాదాపు పది సినిమాలు దాకా ఆమె చేతిలో పడ్డాయి.
శ్రీలీల ప్లస్ ఏమిటంటే... తెలుగు స్పష్టంగా మాట్లాడుతుంది. సొంతంగా డబ్బింగ్ చెప్పుకొంటుంది. పుట్టింది అమెరికాలో, పెరిగింది బెంగళూరులో అయినా.. తల్లి స్వర్ణలతది తెలుగు కుటుంబం కావడంతో ఇంట్లో చిన్నప్పటి నుంచి తెలుగులోనే మాట్లాడుకునేవారు. అలా శ్రీలీలకు మాతృభాషపై పట్టు పెరిగింది. అదే ప్లస్ అయ్యింది.
డాన్స్ లలోనూ శ్రీలీల ది నెక్ట్స్ రేంజ్. మనకున్న హీరోయిన్లలో ఊరమాస్ డ్యాన్స్ చేసేది చాలా తక్కువ మంది. అప్పట్లో తమన్నా ఉండేది కానీ ఇప్పుడు ఆమెకు ఇప్పుడు తెలుగులో పెద్దగా ఆఫర్స్ రావట్లేదు. దీంతో డ్యాన్స్ విషయంలో దర్శకనిర్మాతలకు కనిపిస్తున్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ శ్రీలీల.
బెంగుళూరు బ్యూటీ శ్రీలీల టాలీవుడ్ లోకి మెరుపులా దూసుకువచ్చింది. పెళ్ళిసందD చిత్రంతో పరిచయమైన ఈ కుర్రభామ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ల స్థానాలకు సైతం ఎసరు పెట్టేసింది. ప్రస్తుతం శ్రీలీల పవన్ , మహేష్ బాబు, బాలకృష్ణ, రామ్ పోతినేని ఇలా వరుసగా స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది. తెలుగులో తొలి సినిమా 'పెళ్లి సందD'లో క్యూట్ స్టెప్పులేసింది. 'ధమాకా'లో మాత్రం రెచ్చిపోయి మరీ డ్యాన్సులతో దుమ్ముదులిపింది. ఈ పాయింట్ కూడా శ్రీలీలకు బాగా ప్లస్ అయిందని చెప్పొచ్చు.
శ్రీలీలకు చిన్న వయస్సు కూడా బాగా ప్లస్ అయ్యింది. ప్రస్తుతం ఈమె వయసు 22 ఏళ్లు. దాంతో ఆ గ్లామర్ ఆమె మొహంలో కనపడుతోంది. ఇలాంటి వాళ్లు టాలీవుడ్ కి చాలా అరుదుగా దొరుకుతారు. ఇలాంటి శ్రీలీలకు బోలెడన్ని అంశాలు కలిసొచ్చాయి.
డ్రస్ ల విషయంలో అచ్చ తెలుగు అమ్మాయిలా తయారు అవుతుంది. 'పెళ్లి సందD'లో లంగా ఓణీలతో, 'ధమాకా'లో మోడ్రన్ గా కనిపించింది. త్వరలో రాబోయే సినిమాల్లోనూ చాలావరకు తెలుగు అమ్మాయిగా కనిపించబోతుంది. డైరెక్టర్లు.. ఈమెతో చీరలు కట్టిస్తున్నారు, స్కర్ట్‌లు వేయిస్తున్నారు.ఏ డ్రెస్ వేసినా ఆమె కేక అంటున్నారు
అన్నిటికన్నా ముఖ్యంగా శ్రీలీల గ్లామర్ విషయంలో నో అబ్జెక్షన్స్ అన్నట్లు ఉంటుంది. కొందరు హీరోయిన్లు యాక్టింగ్ పరంగా ఎంత టాలెంటెడ్ అయినప్పటికీ గ్లామర్ కి వచ్చేసరికి కండీషన్స్ పెడుతుంటారు. అందానికి కేరాఫ్ అడ్రస్ అయిన శ్రీలీల మాత్రం అలాంటి వాటికి అడ్డు చెప్పకపోవటం మరింత కలిసొచ్చే అంశం. తెలుగు బ్యూటీ శ్రీలీలా ప్రస్తుతం టాలీవుడ్ లో ఏలుతోంది. చిన్న హీరోల నుంచి బడా హీరోల సరసన నటిస్తూ దుమ్ములేపుతోంది. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. ఈ క్రమంలో భారీ స్థాయిలో ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది.