ఆటలో ఓడిపోయారు...
ఒళ్ళు హూనం చేసుకొని ఆటలాడితే ఫలితం మాత్రం ప్రతికూలంగా వస్తుంది. స్పోర్ట్స్ డ్రామాలు నమ్ముకున్న హీరోలకు ఘోర పరాజయాలు ఎదురవుతున్నాయి. ఈ జోనర్లో సినిమాలు చేసి యువ హీరోలు బేజారయ్యారు.

Ghani Movie
స్పోర్ట్స్ డ్రామాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. స్టార్ హీరోలు వీటి జోలికి పోరు. అలాగని యంగ్ హీరోలు చేస్తే జనాలు చూడడం లేదు. గొడ్డులా కష్టపడి, సదరు ఆటకు తగ్గట్లుగా శరీరాన్ని మార్చుకొని, సిక్స్ ప్యాక్ చేసి మూవీ చేస్తే కనీస వసూళ్లు రావడం లేదు. ఈ మధ్య కాలంలో యంగ్ హీరోలు చేసిన స్పోర్ట్స్ డ్రామాలన్నీ ఢమాల్ అన్నాయి.
మెగా హీరో వరుణ్ (Varun Tej) ప్రయోగాలకు పెట్టింది పేరు. కెరీర్ బిగినింగ్ నుండి అనేక ప్రయోగాత్మక చిత్రాలు చేశారు. ఆయన లేటెస్ట్ మూవీ గని(Ghani) ఘోరంగా ఫెయిలైంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ డ్రామా వరుణ్ కేరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా రికార్డులకు ఎక్కింది. డెబ్యూ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి గని చిత్రాన్ని తెరకెక్కించారు. బాక్సర్ గా కనిపించడంతో కోసం వరుణ్ చాలా కష్టపడ్డారు. దాదాపు రూ. 26 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన ఈ మూవీ రూ. 4 కోట్లు కూడా వసూలు చేసే పరిస్థితి లేదు.
A1 Express Trailer
ఒక్క బ్రేకింగ్ హిట్ కోసం ఏళ్ల తరబడి తపస్సు చేస్తున్న సందీప్ కిషన్ చేసిన స్పోర్ట్స్ డ్రామా A1 ఎక్స్ ప్రెస్. హాకీ నేపథ్యంలో తెరకెక్కిన మొట్టమొదటి టాలీవుడ్ చిత్రంగా బాగా ప్రచారం చేశారు. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి డెన్నిస్ జీవన్ దర్శకత్వం వహించారు. సందీప్ కిషన్ చాలా ఆశలు పెట్టుకొని ఈ చిత్రం చేశారు. హాకీ ప్లేయర్ లుక్ కోసం సిక్స్ ప్యాక్ బాడీ సాధించాడు. ఫలితం మాత్రం శూన్యం.
ఒక ప్రక్క సెకండ్ హీరో, విలన్ రోల్స్ చేస్తూనే ఛాన్స్ దొరికినప్పుడు హీరోగా చేస్తున్నాడు ఆది పినిశెట్టి. ఆయన హీరోగా క్లాప్ టైటిల్ తో ఓ స్పోర్ట్స్ డ్రామా విడుదలైంది. క్లాప్ మూవీలో అంగవైకల్యం కలిగిన అథ్లెట్ రోల్ చేశారు. ఈ మూవీ వచ్చి వెళ్లిన సంగతి కూడా తెలియదు.
Lakshya
లవర్ బాయ్ ఇమేజ్ తో అడపాదడపా హిట్స్ కొడుతున్న నాగ శౌర్య స్పోర్ట్స్ డ్రామా చేసి ఉన్న ఇమేజ్ పోగొట్టుకున్నాడు. లక్ష్య టైటిల్ తో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామాలో నాగ శౌర్య ఆర్చర్ గా కనిపించారు. ఈ రోల్ కోసం ఆయన సిక్స్ ప్యాక్ డెవలప్ చేయడంతో పాటు జుట్టు పెంచి కంప్లీట్ మేకోవర్ అయ్యారు. యంగ్ డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో వచ్చిన లక్ష్య భారీ ప్లాప్ కొట్టింది.
వీరితో పాటు స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా స్పోర్ట్స్ డ్రామాలో నటించారు. దర్శకుడు నగేష్ కుకునూర్ గుడ్ లక్ సఖి టైటిల్ తో ఎయిర్ రైఫిల్ స్పోర్ట్స్ నేపథ్యంలో మూవీ చేశారు. గుడ్ లక్ సఖి సైతం అట్టర్ ప్లాప్ ఖాతాలో చేరిపోయింది.
<p>bigil</p>
అయితే కొందరు హీరోలకు ఈ ఆటలు బాగా కలిసొచ్చాయి. స్టార్ హీరో విజయ్ ఫుట్ బాల్ నేపథ్యంలో తెరకెక్కిన బిగిల్ తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ కొట్టింది. అలాగే నాని హీరోగా విడుదలైన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా జెర్సీ సక్సెస్ టాక్ తెచ్చుకుంది.