- Home
- Entertainment
- Guppedantha Manasu: వసు చేతిలో ఘోరంగా మోసపోయిన రిషి.. కొత్త డ్రామాకు తెరతీసిన సౌజన్య రావు!
Guppedantha Manasu: వసు చేతిలో ఘోరంగా మోసపోయిన రిషి.. కొత్త డ్రామాకు తెరతీసిన సౌజన్య రావు!
Guppedantha Manasu: స్టార్ మాలో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కంటెంట్ తో టాప్ రేటింగ్ ని సంపాదించుకుంటుంది. కొడుకు మొహంలో సంతోషం చూడటం కోసం ఏం చేయటానికైనా సిద్ధపడే ఒక తల్లి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 21 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో.. నా తరఫున మేడంకి థాంక్స్ చెప్పు అంటాడు రిషి. ఆ థాంక్స్ మీరే చెప్పుకోండి నేను చెప్పటం కన్నా మీరు చెప్తే ఆవిడ ఎక్కువ సంతోషిస్తారు అంటుంది వసు. నేను ఏమైనా తప్పు చేస్తున్నానా అంటాడు రిషి. కాలేజీ విషయంలో మీరు ఎప్పుడు ఎలాంటి తప్పు చేయరు ఆ నమ్మకం మాకుంది అంటుంది వసు. ఎమ్మెస్సార్ కాలేజీలో మన డి బి ఎస్ టి కాలేజ్ కలిసి పోవడం అనే మాటనే భరించలేకపోతున్నాను అంటాడు రిషి. ఇంతలో ఏదో ఫోన్ రావటంతో మీరు బయలుదేరండి నేను వేరే పని చూసుకొని వస్తానని వసుకి చెప్తాడు రిషి. ఎక్కడికి సర్ అంటుంది వసు.
కొన్ని లెక్కలు తేల్చుకుని రావాలి అంటూ బయలుదేరుతాడు రిషి. మరోవైపు ఏమి మాట్లాడకుండా ఉన్న రిషిని చూసి ఏమి సమాధానం చెప్పడం లేదేంటి మీ సమాధానం కోసం వెయిట్ చేస్తున్నాను అంటాడు సౌజన్య రావు. నా నుంచి ఏం సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.. అయినా మా మేడం వాళ్లు మీకు ఇచ్చిన సమాధానం సరిపోలేదా అంటాడు రిషి. మనసు మార్చుకున్నారేమో అని అడుగుతున్నాను.. అయినా మంచి నిర్ణయం తీసుకోలేని వయసు మీది.. మీకు మంచి అవకాశం ఇస్తున్నాను వాడుకోండి అంటాడు సౌజన్యరావు. ఎవరికి మంచి మీకా, మాకా.. అయినా మీరు మాకు అవకాశం ఇవ్వటం ఏంటి నేనే మీకు అవకాశం ఇస్తున్నాను.
మీ కాలేజీ ని తీసుకొచ్చి మా కాలేజీలో కలిపేయండి అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి. సౌజన్య రావు షాక్ లో ఉండిపోతాడు. మరోవైపు సౌజన్య రావుతో జరిగిన సంభాషణ అంతా తండ్రి, పెదనాన్నలకి చెప్తాడు రిషి. మంచి పని చేశావు.. అలాంటి వాళ్ళకి నీలాంటి వాళ్ళే కరెక్ట్ అంటాడు మహేంద్ర. అయినా ఇంకొకరితో కలిసి కాలేజీ స్టార్ట్ చేయటం ఎందుకు మనమే సొంతంగా స్టార్ట్ చేద్దాము. పర్మిషన్స్ సంగతి నేను చూసుకుంటాను. నువ్వేమీ టెన్షన్ పడకు. వెళ్లి ఫ్రెష్ అప్ అవ్వు అంటాడు ఫణీంద్ర. అలాగే అంటూ లోపలికి వెళ్ళిన రిషికి జగతి, వసు కనిపించడంతో వాళ్లకి కూడా జరిగిందంతా చెప్తాడు.
ఇక మీదట సౌజన్య రావు గురించి ఆలోచించవలసిన పనిలేదు అని చెప్పి వెళ్ళిపోతాడు. సర్ కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు కానీ లోపల చాలా బాధపడుతున్నారు. అయినా ఆ సౌజన్య రావు గురించి ముందే తెలియటం మంచిదయింది. లేదంటే పోను పోను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వచ్చేది అంటుంది వసు. ఏదైతేనేమి రిషి కోరిక తీరేలాగా మనం ప్రయత్నం చేయాలి అంటుంది జగతి. మరోవైపు సౌజన్య రావు కి మీటింగ్ ఏమైంది అని ఒక మెసేజ్ వస్తుంది. రిషి దిగిరాడు అవకాశం పోయింది అంటాడు సౌజన్య రావు. అతను మనకి అవకాశం ఇచ్చాడు కదా అతను చెప్పినట్లే చెయ్యు అని సౌజన్య రావు కి మెసేజ్ వస్తుంది. సరే అంటూ రిప్లై ఇస్తాడు సౌజన్య రావు. మరోవైపు వసు కి ఒక ఫైల్ ఇచ్చి రిషి చేత సైన్ చేయించమంటుంది జగతి.
వద్దు మేడం అది సార్ ను మోసం చేసినట్లు అవుతుంది.. ఈ పని నేను చేయలేను అంటుంది వసు. తప్పదు రిషి అనుకున్నది జరగాలంటే ఇలాగే చేయాలి. నిజం తెలిస్తే రిషి ఒప్పుకోడు అంటూ ఫైల్ వసు చేతిలో పెడుతుంది జగతి. భయపడుతూనే ఆ ఫైల్ తీసుకొని టెన్షన్తో ముందుకు వెళుతుంది. ఇలా వెళ్తే రిషికి దొరికిపోతావు.. జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్యు అని వసుకి చెప్పి పంపిస్తుంది జగతి. మరోవైపు సౌజన్య రావు నన్ను కలవాలి అంటున్నాడు.. అందుకే అతన్ని ఇంటికి రమ్మన్నాను అంటాడు ఫణీంద్ర. అతన్ని కలవడం మంచిది కాదేమో.. అయినా తన నిర్ణయాన్ని రిషి చెప్పేసాడు కదా అంటాడు మహేంద్ర.
నేను కూడా అదే చెప్పాను కానీ మాట్లాడతాను అని పట్టుబట్టాడు. విషయం ఏంటో తెలుసుకుని రిషి కి చెబుదామని నేను కూడా రమ్మన్నాను అంటాడు ఫణీంద్ర. మరోవైపు ఫైల్స్ తీసుకొచ్చి రిషిని సంతకం పెట్టమంటుంది వసు.వాటిని చదవకుండానే సైన్ చేసేస్తాడు రిషి. ఇన్ని పేపర్స్ మీద సైన్ చేస్తున్నావేంటి ఏమైనా చెక్ చేయమంటావా అని అడుగుతాడు రిషి. మీ ఇష్టం సర్ అంటూ కంగారుపడుతూ చెప్తుంది వసు. నువ్వు ఏ తప్పు చేయవని నాకు తెలుసు అంటూ సైన్ పెట్టి ఇచ్చేస్తాడు రిషి. ఆ ఫైల్ తీసుకొచ్చి జగతికి ఇస్తుంది వసు. సార్ నన్ను చాలా నమ్ముతున్నారు ఆ నమ్మకాన్ని నేను వొమ్ము చేస్తున్నానేమో అంటుంది వసు.
రిషి అనుకున్నది జరగాలంటే ఇలా చేయక తప్పదు నిజం తెలిసినప్పుడు కోప్పడతాడు కానీ భరించాలి అంటూ ఫైల్ తీసుకుని బయలుదేరుతుంది జగతి. జాగ్రత్తగా వెళ్ళిరండి అని జగతికి చెప్తుంది వసు. మరోవైపు ఫణీంద్ర వాళ్లని కలిసిన సౌజన్య రావు రిషి నాకు ఒక ప్రపోజల్ పెట్టాడు. ఆవేశంతో చెప్పాడో ఆలోచనతో చెప్పాడు తెలియదు కానీ ఆ ప్రపోజల్ కి నేను అంగీకరిస్తున్నానని చెప్పి షాక్ ఇస్తాడు. ఒక్కసారి గా ఆలోచనలో పడతారు మహేంద్ర, ఫణీంద్ర. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.