బాగా రిచ్ అమ్మాయిలని పెళ్లి చేసుకున్న స్టార్ హీరోలు.. ఎన్టీఆర్, విజయ్, సూర్య భార్యల ఆస్తులు గురించి తెలిస్తే
సౌత్ లో చాలా మంది స్టార్ హీరోల భార్యలు అత్యంత ధనిక కుటుంబాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. బాగా రిచ్ అయిన స్టార్ హీరోల భార్యలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
చిత్ర పరిశ్రమలో హీరోల భార్యల గురించి ఆడియన్స్ కి చాలా తక్కువ విషయాలు తెలుస్తుంటాయి. కొంతమంది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు కానీ.. మరికొంతమంది చిత్ర పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేకుండా ఉంటారు. సౌత్ లో చాలా మంది స్టార్ హీరోల భార్యలు అత్యంత ధనిక కుటుంబాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. బాగా రిచ్ అయిన స్టార్ హీరోల భార్యలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
Dulquer Salmaan
దుల్కర్ సల్మాన్
మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ సౌత్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హీరోగా రాణిస్తున్నారు. దుల్కర్ సల్మాన్ 2011లో అమల్ సుఫియాని వివాహం చేసుకున్నాడు. అమల్ సుఫియా తండ్రి సయ్యద్ నిజాముద్దీన్ నార్త్ ఇండియాకి చెందిన వ్యక్తి. కానీ వ్యాపారాల కోసం చెన్నైలో స్థిరపడ్డారు. కోట్ల టర్నోవర్ కలిగిన వ్యాపార వేత్తగా సయ్యద్ నిజాముద్దీన్ రాణిస్తున్నారు.
Jr NTR
ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి ప్రణతి ఎప్పుడు కనిపించినా చాలా సింపుల్ గా ఉంటారు. లక్ష్మి ప్రణతి కూడా సాధారణ మహిళా కాదు. ఆమె తండ్రి శ్రీనివాస రావు మీడియా ఛానల్ అధినేత. అలాగే అనేక వ్యాపారాలు కూడా ఉన్నాయి. పాలిటిక్స్ లో కూడా రాణించాలని చూసారు. గతంలో ఆయనపై ఐటి రైడ్స్ కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. లక్ష్మి ప్రణతి తండ్రి అంత రిచ్ అన్నమాట.
Allu Arjun
అల్లు అర్జున్
అల్లు అర్జున్, అల్లు స్నేహ రెడ్డి ప్రేమించుకుని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అల్లు స్నేహారెడ్డి సాధారణ మహిళా కాలేదు. తెలంగాణలో ప్రముఖ రాజకీయ నాయకుడిగా రాణిస్తున్న చంద్రశేఖర్ రెడ్డి కుమార్తె.
Suriya
సూర్య
తమిళ స్టార్ సూర్య సతీమణి జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్ లో అద్భుతమైన పాత్రలు చేస్తోంది. జ్యోతిక అంటే గతంలో బాగా రాణించిన హీరోయిన్ మాత్రమే అని అంటుంటారు. ఆమె తండ్రి చందర్ సాధన కొన్ని దశాబ్దాల క్రితమే బాలీవుడ్ లో నిర్మాతగా రాణించారు. వీళ్లది బాగా ధనిక కుటుంబం.
Rana Daggubati
రానా దగ్గుబాటి
బాహుబలితో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న రానా ఆ తర్వాత ఆయా జోరుని కొనసాగించలేకపోయాడు. రానా విలక్షణ నటనకి చాలా మంది అభిమానులు ఉన్నారు. 2020 లో రానా .. మిహీకా బజాజ్ అనే అమ్మాయిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మిహీక తల్లిదండ్రులకు పలు జ్యువెలరీ వ్యాపారాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మిహీక కూడా ఇంటీరియర్ డిజైనర్ గా బిజినెస్ లో రాణిస్తున్నారు.
Ram Charan
రాంచరణ్
రాంచరణ్ సతీమణి ఉపాసన గురించి చెప్పగానే అపోలో ఆసుపత్రులు గుర్తుకు వస్తాయి. అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్ రెడ్డి కి మనవరాలు ఉపాసన. ఆయన వారసురాలు కాబట్టి ఆస్తుల లెక్క వేల కోట్ల నుంచి మొదలవుతుందేమో.
Thalapathy Vijay
దళపతి విజయ్
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. అశేషంగా అభిమాన గణం ఉన్న హీరో ఆయన. ఆయన సతీమణి పేరు సంగీత. ఇంటిదగ్గరే ఉంటూ కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ ఉంటుంది. కానీ ఆమె తండ్రి ముందు నుంచి ధనికుడు. సంగీత తండ్రికి తమిళనాడు తో పాటు శ్రీలంక, యుకె లాంటి దేశాల్లో వ్యాపారాలు ఉన్నాయట.