Karthika Deepam: శౌర్యని కలుసుకున్న సౌందర్య.. టెన్షన్ పడుతున్న మోనిత?
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తుంది. ఒకటే కథతో నిత్యం ట్విస్ట్ ల మీద ట్విస్టులతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు నవంబర్ 17 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈ రోజు ఎపిసోడ్ లో ఇంద్రుడు సౌర్యని ఏంటి బంగారం మళ్లీ ఈ ఊరికి వచ్చేయాలని ఉందా అని అడుగుతాడు. అయితే చెప్పు బంగారం మళ్లీ ఇదే ఊరికి వచ్చేద్దాం మీ అమ్మానాన్నలను వెతుకుదాం అని అంటాడు. అప్పుడు వద్దులేండి బాబాయ్ ఇక్కడే ఉంటే నానమ్మ తాతయ్య కచ్చితంగా వస్తారు అని అంటుంది. అప్పుడు సౌర్య మాటలకు ఇంద్రుడు సంతోష పడిపోతూ ఉంటాడు. ఆ తర్వాత సౌర్య ఇంద్రుడు వాళ్ళు కలిసి ఒకచోట ఐస్క్రీం తినడానికి వెళ్తారు. మరొకవైపు కార్తీక్ దీప ఇద్దరూ మోనిత కోసం మోనిత ఇంటిదగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. వస్తుంది కదా ఈ రోజు మోనితతో అటో ఇటో తేల్చుకుంటాను అని అనగాఅప్పుడు కార్తీక్ వదిలేయ్ దీప ఆ మోనితతో నీకెందుకు అని అంటాడు.
ఇప్పుడు దీప మాత్రం మోనిత మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు నేను ప్రతి విషయం గురించి ఆలోచించాను కానీ ఆ వాని విషయంలో మాత్రం ఆలోచించ లేకపోయాను అని అంటాడు కార్తీక్. అప్పుడు కార్తీక్ ఇకనుంచి మోనితతో ఎటువంటి ప్రమాదం రాకుండా నేను చూసుకుంటాను ఆ మోనిత తో గొడవ పెట్టుకోవద్దు అని దీపను రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు కార్తీక్. మరొకవైపు మోనిత కారులో వస్తూ ఈ ఆంటీ ఈ రోజు నన్ను విడిచి వెళ్లేలా లేదు కదా ఇప్పుడు ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది మోనిత. అంకుల్ అంటే ఎలాగో అలా మేనేజ్ చేశాను కానీ ఆంటీ తో చాలా కష్టం అని అనుకుంటూ ఉంటుంది మోనిత.
అప్పుడు మోనిత ఏదో ఒకటి చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది. మరొకవైపు సౌర్య ఐస్ క్రీమ్ తింటూ ఉంటుంది. అప్పుడు చంద్రమ్మ దంపతులు డబ్బుల విషయం గురించి మాట్లాడుకుంటూ మరొకసారి మనం ఈ ఊరికి రావాల్సిన అవసరం ఉండదు అని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు చంద్రమ్మ దంపతులకు తొందరగా ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం లేదంటే జ్వాలమ్మ అని ఎవరైనా చూస్తారేమో అని భయంగా ఉంది అని అంటుంది. మరొకవైపు సౌందర్య ఆనంద్ రావు మాటలు గుర్తుతెచ్చుకొని కారు ఆపడంతో ఎందుకు అంత ఇక్కడ కారు ఆపింది అనుకుంటూ ఉంటుంది మోనిత.
అక్కడ సౌర్య ను చూసిన సౌందర్య సౌర్య దగ్గరికి వెళ్లడంతో మోనిత అక్కడి నుంచి తప్పించుకొని వెళ్తుంది. మరొకవైపు మోనిత తో గొడవ పెట్టుకోవడానికి దీప ఇంట్లో రెడీగా కూర్చుని ఉంటుంది. అప్పుడు దీప మోనిత తో గొడవ పెట్టుకుంటాను అంటే డాక్టర్ బాబు ఏమీ అనడం లేదు అంటే కచ్చితంగా గతం గుర్తుకు ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది దీప. ఇప్పుడు దీప కావాలనే కార్తీక్ ని చెక్ చేయడం కోసం మోనిత, కార్తీక్ ఇద్దరు కలిసి దిగిన ఫోటోని పగలగొడుతూ ఉండగా కార్తీక్ ఆపుతాడు. అప్పుడు దీప కార్తీక్ మీద సీరియస్ అవుతుంది. మరొకవైపు సౌందర్య సౌర్య దగ్గరికి వెళ్లి ఇన్ని రోజులు ఊరేగింది చాలు ఇంటికి వెళ్దాం పదా అని అంటుంది.
అప్పుడు సౌర్య ఒకసారి నేను చెప్పేది వినండి నానమ్మ అమ్మ నాన్నలు ఇక్కడే ఉన్నారు వాళ్ళు కనిపించగానే నేనే వస్తాను నానమ్మ అని అంటుంది. అప్పుడు వాళ్లు ఎక్కడ ఉన్నారే వాళ్ళు చనిపోయారు అనటంతో సౌర్య సీరియస్ అవుతుంది. మీరు ఎన్నైనా చెప్పండి నానమ్మ నా మనసు అమ్మానాన్నలు ఉన్నారని చెబుతోంది నేను ఇక్కడి నుంచి రాను అని అంటుంది. అప్పుడు సౌందర్య ఇంద్రుడు దంపతుల మీద సీరియస్ అవడంతో శౌర్య సౌందర్య కి నచ్చ చెబుతుంది. అప్పుడు సౌర్య ఫంక్షన్ జరిగింది అని తెలుసుకున్న సౌందర్య సౌర్య ని ఎమోషనల్ గా హత్తుకుంటుంది. మరొకవైపు మోనిత టెన్షన్ టెన్షన్ గా ఇంటి దగ్గరికి పరుగులు తీస్తూ ఉంటుంది.
ఆంటీ ఎందుకు వచ్చింది నా ప్రాణాలు తీయడానికి అనుకొని టెన్షన్ పడుతూ ఇంటి దగ్గరికి వెళ్ళగా అక్కడ మోనిత ఇంటికి, దీపా ఇంటికి తాళం వేసి ఉండడంతో ఇద్దరు ఎక్కడికి వెళ్లారు అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు దుర్గ కనిపించడంతో దుర్గా మోనిత కారు కీస్ తీసుకుని మోనిత ఆట పట్టిస్తూ ఉంటాడు. అప్పుడు దుర్గ మోనిత కారు కీస్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు సౌందర్య ఫంక్షన్ గురించి సౌర్య ఒక్క మాట కూడా చెప్పలేదు అని సౌర్య మీద సీరియస్ అవుతుంది.