`సుశాంత్‌లా నేను ఆత్మహత్య చేసుకుంటానని మా అమ్మ భయం`

First Published 6, Aug 2020, 4:18 PM

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మరణం చాలా మంది ప్రముఖులను వివాదంలోకి లాగుతోంది. ఇప్పటికే బాలీవుడ్ సీనియర్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా, తాజాగా సుశాంత్ గర్ల్‌ ఫ్రెండ్ రియా మీద కూడా తీవ్ర స్థాయిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సుశాంత్ మృతి తనను కూడా ఇబ్బంది పెడుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు యంగ్  హీరో సూరజ్‌ పంచోలి..

అతి చిన్నవయసులోనే చనిపోయిన బాలీవుడ్ నటి జియా ఖాన్‌. అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన జియా మృతి విషయంలో యంగ్ హీరో సూరజ్‌ పంచోలి మీద అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ కేసు విషయంలో సూరజ్‌ అరెస్ట్‌ కూడా అయ్యాడు. ఇప్పటికే కేసు విచారణ కొనసాగుతోంది.

ఈ కేసు ఇలా ఉండగానే ఇటీవల మరణించిన సెలబ్రిటీ మేనేజర్‌ దిశా సలియన్‌ ఆత్మహత్యతోనూ సూరజ్‌కు సంబంధాలు ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఆ వార్తలపై సూరజ్‌ స్పందించాడు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ దిశా, జియా ఖాన్‌, సుశాంత్‌ల మరణానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశాడు.

దిశా సలియన్ అనే మహిళను తాను అసలు ఎప్పుడూ కలవలేదని, తను ఎవరో కూడా తెలియదని చెప్పాడు సూరజ్‌. అనవసరంగా తనను ఈ కేసులోకి లాగుతున్నారని, దీనిక వెనుక ఏదైన కుట్ర ఉండి ఉండవచ్చన్న అనుమానం వ్యక్తం చేశాడు. తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని మీడియా వస్తున్న వార్తలన్ని నిరాధారమైనవని కొట్టి పారేశాడు.

ఇప్పటికే తన మీద ఉన్న జియా మృతి కేసు కారణంగా ఇండస్ట్రీలో చాలా మంది తనతో కలిసి వర్క్‌ చేయటం లేదని, మరిన్ని వివాదాల్లోకి లాగితే తన కెరీర్‌ నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. 8 ఏళ్లుగా జియా మృతి కేసు ఎటూ తేలకపోవడానికి ఆమె తల్లి రబియా ఖానే కారణం అన్నాడు సూరజ్‌. ఈ కేసు కారణంగా తన కుటుంబం కూడా చాలా ఆవేదన చెందుతుందన్నాడు సూరజ్‌.

అంతేకాదు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తరువాత తన తల్లి ఎంతో భయపడిపోయిందని, తాను కూడా అలాంటి తీవ్ర నిర్ణయం తీసుకుంటానేమో అని వాళ్లు కలవరపడుతున్నారని సూరజ్‌ వెల్లడించాడు. తన తల్లి `నీకు ఏ బాధ ఉన్నా మాతో చెప్పు ఎలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవద్దని` తనతో ఆవేదనగా చెప్పిందని గుర్తు చేసుకున్నాడూ సూరజ్‌.

తాను ఇండస్ట్రీలోకి రావడానికి ఎంతో కష్టపడ్డానని చెప్పిన సూరజ్‌, ఎన్ని ఇబ్బందులు, విమర్శలు ఎదురైనా అన్నింటినీ ఎదిరించే ఇక్కడే ఉంటానన్నాడు. కొంత మంది దుర్మార్గులు ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని, వారు తన జీవితాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

loader