సిగ్నల్‌ లేదంటే ఏకంగా టవరే ఏర్పాటు చేయించాడు.. సోనూ సూద్‌ సేవకి అంతేలేదుగా!

First Published 5, Oct 2020, 8:16 AM

కరోనా క్లిష్ట సమయాల్లో విశేష సేవ చేసి ఏకంగా ఐక్యరాజ్యసమితి పురస్కారాన్ని పొందారు. తాజాగా ఆయన చేసిన పనికి ఏకంగా ఓ గ్రామమే చేతులెత్తి దెండం పెడుతోంది. 

<p>టాలీవుడ్‌ విలన్‌ సోనూ సూద్‌ హీరో అనిపించుకున్న సందర్భాలు కోకొల్లలు. చేతికి ఎముకే లేదనేలా తన సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల హృదయాలను&nbsp;గెలుచుకుంటున్నారు.&nbsp;తాజాగా ఆయన చేసిన పనికి ఏకంగా ఓ గ్రామమే చేతులెత్తి&nbsp;దెండం పెడుతోంది. మరి ఇంతకి సోనూ సూద్‌ ఏం చేశాడనేది చూస్తే.&nbsp;</p>

టాలీవుడ్‌ విలన్‌ సోనూ సూద్‌ హీరో అనిపించుకున్న సందర్భాలు కోకొల్లలు. చేతికి ఎముకే లేదనేలా తన సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నారు. తాజాగా ఆయన చేసిన పనికి ఏకంగా ఓ గ్రామమే చేతులెత్తి దెండం పెడుతోంది. మరి ఇంతకి సోనూ సూద్‌ ఏం చేశాడనేది చూస్తే. 

<p>లాక్‌డౌన్‌లో పేదలు, వలస కార్మికులకు సహాయం చేసి గొప్ప మనసుని చాటుకున్న ఆయన ఇప్పుడు మరోసారి ఉదారతను ప్రదర్శించారు. హర్యానాలోని మోర్ని గ్రామంలో&nbsp;ఒక విద్యార్థి ఆన్‌లైన్‌ క్లాస్‌ల కోసం మొబైల్‌ ఫోన్‌ వాడాల్సి వచ్చింది. ఆ గ్రామంలో నెట్‌వర్క్ లేనందున ఆ అబ్బాయి చెట్టు పైకి ఎక్కి క్లాస్‌లు వింటున్నాడు. చెట్టు ఎక్కితే గానీ ఆ&nbsp;ఊర్లో సిగ్నల్‌ రాదు.&nbsp;</p>

లాక్‌డౌన్‌లో పేదలు, వలస కార్మికులకు సహాయం చేసి గొప్ప మనసుని చాటుకున్న ఆయన ఇప్పుడు మరోసారి ఉదారతను ప్రదర్శించారు. హర్యానాలోని మోర్ని గ్రామంలో ఒక విద్యార్థి ఆన్‌లైన్‌ క్లాస్‌ల కోసం మొబైల్‌ ఫోన్‌ వాడాల్సి వచ్చింది. ఆ గ్రామంలో నెట్‌వర్క్ లేనందున ఆ అబ్బాయి చెట్టు పైకి ఎక్కి క్లాస్‌లు వింటున్నాడు. చెట్టు ఎక్కితే గానీ ఆ ఊర్లో సిగ్నల్‌ రాదు. 

<p>విసిగిపోయిన ఆ కుర్రాడు తమ సమస్యని ట్విట్టర్‌ ద్వారా సోనూ సూద్‌కి తెలిపాడు. విషయం తెలుసుకున్న సోనూ సూద్‌ వెంటనే ఆ గ్రామ పెద్దలతో మాట్లాడి ఎయిర్‌టెల్‌&nbsp;టవర్‌ని ఏర్పాటు చేయించాడు. దీంతో ఆ గ్రామ ప్రజలు సంతోషంగా సోనూకి కృతజ్ఞతలు తెలియజేశారు. తమ దీర్ఘకాలిక సమస్యని తీర్చినందుకు ఆ ఊరి విద్యార్థులు రెండు&nbsp;చేతులెత్తి దెండం పెడుతున్నారు.&nbsp;</p>

విసిగిపోయిన ఆ కుర్రాడు తమ సమస్యని ట్విట్టర్‌ ద్వారా సోనూ సూద్‌కి తెలిపాడు. విషయం తెలుసుకున్న సోనూ సూద్‌ వెంటనే ఆ గ్రామ పెద్దలతో మాట్లాడి ఎయిర్‌టెల్‌ టవర్‌ని ఏర్పాటు చేయించాడు. దీంతో ఆ గ్రామ ప్రజలు సంతోషంగా సోనూకి కృతజ్ఞతలు తెలియజేశారు. తమ దీర్ఘకాలిక సమస్యని తీర్చినందుకు ఆ ఊరి విద్యార్థులు రెండు చేతులెత్తి దెండం పెడుతున్నారు. 

loader