- Home
- Entertainment
- Sonam Kapoor: గర్భవతి అయిన సోనమ్ కపూర్.. భర్త ఒడిలో ప్రేమగా, బ్యూటిఫుల్ పిక్స్ వైరల్
Sonam Kapoor: గర్భవతి అయిన సోనమ్ కపూర్.. భర్త ఒడిలో ప్రేమగా, బ్యూటిఫుల్ పిక్స్ వైరల్
సోనమ్ కపూర్, ఆనంద్ అహుజా దంపతులు క్రేజీ న్యూస్ ప్రకటించారు. వీరిద్దరూ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. సోనమ్ కపూర్ ప్రస్తుతం గర్భవతి.

అనిల్ కపూర్ కుమార్తెగా బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన సోనమ్ కపూర్ క్రేజీ హీరోయిన్ గా మారింది. సోనమ్ కపూర్ బాలీవుడ్ లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. స్టార్ హీరోలతో కలసి రొమాన్స్ చేసింది. 2018లో సోనమ్ కపూర్ వ్యాపార వేత్త ఆనంద్ అహుజాని వివాహాం చేసుకున్న సంగతి తెలిసిందే.
దాదాపు మూడేళ్ళ తర్వాత సోనమ్ కపూర్,ఆనంద్ దంపతులు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ప్రస్తుతం సోనమ్ కపూర్ గర్భవతి. త్వరలో ఆనంద్, సోనమ్ తల్లి దండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని సోనమ్, ఆనంద్ ఎంతో బ్యూటిఫుల్ గా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
'నిన్ను పెంచడానికి అన్ని మా నాలుగు చేతుల్లో ఉన్నాయి. నువ్వు ఎక్కడ ఉన్న ప్రతిధ్వనించే రెండు హృదయాలు ఉన్నాయి. నీపై ప్రేమాభిమానాలు కురిపించే ఒక ఫ్యామిలీ ఉంది. నీకోసం ఎదురుచూస్తున్నాం' అంటూ సోనమ్ కపూర్ ఇంస్టాగ్రామ్ లో తాను గర్భవతి అయిన విషయాన్ని ప్రకటించింది.
భర్త ఒడిలో పడుకుని గర్భంపై చేతులు పెట్టుకుని ఉన్న అందమైన పిక్స్ ని సోనమ్ కపూర్ షేర్ చేసింది. సోనమ్ కపూర్ ప్రెగ్నెన్సీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దీనితో సెలెబ్రిటీలు, అభిమనులు సోనమ్ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. వివాహం తర్వాత కూడా సోనమ్ కపూర్ సినిమాలు కంటిన్యూ చేస్తోంది.
సోనమ్ కపూర్ చివరగా జోయా ఫాక్టర్ అనే చిత్రంలో నటించింది. ఈ ఏడాది సోనమ్ కపూర్ బ్లైండ్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం సోనమ్ గర్భవతి కావడంతో కొంత కాలం ఆమె సినిమాల నుంచి బ్రేక్ తీసుకోవాల్సిందే.